జామ ఆకుల టీ తాగితే కంటికెంతో ఆరోగ్యం, కళ్లజోడు పెట్టాల్సిన అవసరమే రాదు

Published : Dec 02, 2025, 04:29 PM IST

Guava Tea: జామ ఆకుల టీ ఆరోగ్యానికి ఎంతో మంచిది. కానీ ఈ విషయం చాలా తక్కువ మందికే తెలుసు. ఇక్కడ మేము జామ ఆకుల టీ వల్ల కలిగే లాభాల గురించి ఇచ్చాము. ముఖ్యంది ఇది కంటికి రక్షణను అందిస్తుంది. 

PREV
14
జామ ఆకుల టీ

ఈ రోజుల్లో ఎక్కువసేపు ఫోన్, ల్యాప్‌టాప్ లేదా టీవీ చూసే అలవాటు పెరిగిపోయింది. దీంతో ఎంతో మందికి కళ్లలో మంట, అలసట, పొడిబారటం, మసకగా కనిపించడం వంటి సమస్యలు వస్తున్నాయి. చిన్న వయసులోనే కళ్లజోడు పెట్టుకోవాల్సిన పరిస్థితి కూడా వచ్చేస్తోంది. ఇలాంటి సమయంలో సహజమైన పద్ధతులతో కళ్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని చాలామంది కోరుకుంటున్నారు. అలాంటి సహజ పద్ధతుల్లో ఒకటి జామ ఆకుల టీ.

24
ఈ టీలో ఏముంది?

జామ ఆకుల్లో విటమిన్ A, యాంటీఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్స్ వంటి కళ్లకు ఉపయోగపడే ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ పదార్థాలు కళ్లలో వచ్చే ఒత్తిడిని తగ్గించడం, పొడిబారటాన్ని కంట్రోల్ చేయడం, కళ్లలో రక్తప్రసరణను మెరుగుపరచడం వంటి ప్రయోజనాలు అందిస్తాయి. ముఖ్యంగా ఎక్కువసేపు స్క్రీన్ చూసే వారికి ఇది సహజంగా కళ్లను రిలాక్స్ చేయడంలో సహాయపడుతుంది. ఇందులో యాంటీఆక్సిడెంట్లు కళ్లను ఫ్రీ రాడికల్స్‌ నుండి రక్షించి, వయసు పెరిగేకొద్దీ రావచ్చని భావించే కొన్ని కంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయని భావిస్తున్నారు. కాటరాక్ట్ వంటి సమస్యలు ఆలస్యంగా రావడానికీ ఇవి కొంత రక్షణ ఇస్తాయని కొందరు చెబుతూ ఉంటారు. అయితే ఇవి పూర్తిగా శాస్త్రీయంగా నిర్ధారణ కాలేదు.

34
జామ ఆకుల టీ ఎలా తయారు చేయాలి?

అయిదారు తాజా జామ ఆకులు తీసుకుని ఒకటిన్నర గ్లాసులో వేసి మరిగించాలి. అది గోరువెచ్చగా అయ్యాక అందులో తేనె, నిమ్మరసం వంటివి కలుపుకుని తాగేయాలి. ఇది కషాయంలా ఉంటుంది కానీ రుచిగా ఉంటుంది. ఈ టీని ఉదయం లేదా సాయంత్రం వేళ తాగితే కళ్లకు రిలాక్స్‌ ఇచ్చే అవకాశముంది. జామ ఆకుల టీ ఆరోగ్యానికి మంచిదన్నది నిజమే. కానీ ఇది చూపును ఒక్కసారిగా పెంచుతుందనే నిర్ధారిత ఆధారాలు ఇంకా లేవు. కళ్లజోడు నంబర్‌ తగ్గిపోవడం, మైయోపియా పూర్తిగా తగ్గిపోవడం వంటి ఫలితాలు ఈ టీతో సాధ్యం కాదు.

44
ఈ సమస్యలు తగ్గుతాయి

కళ్లలో ఒత్తిడి తగ్గడం, స్క్రీన్ టైమ్ వల్ల వచ్చే అలసట తగ్గడం, కళ్లు పొడిబారటం తగ్గడం, కళ్లలో రక్తప్రసరణ మెరుగుపడడం వంటి ప్రయోజనాలు కలుగుతాయి. అయితే గర్భిణీలు, కంటి సమస్యలకు చికిత్స తీసుకుంటున్నవారు, ఏదైనా కంటి ఆపరేషన్ చేయించుకున్న వారు మాత్రం వైద్యుల సలహా మేరకే దీన్ని తాగాలి.

Read more Photos on
click me!

Recommended Stories