Chanakya Niti: జీవితంలో ఈ ముగ్గురు ఉంటే... మీ అంత అదృష్టవంతులు మరొకరు ఉండరు..!

Published : Dec 02, 2025, 01:28 PM IST

Chanakya Niti: ప్రతి ఒక్కరి జీవితంలో కష్ట సుఖాలు వస్తూనే ఉంటాయి. ఇవి కేవలం అన్నీ మనం చేసే పనుల కారణంగానే రావు. మన చుట్టూ ఉన్న వ్యక్తుల వల్ల కూడా రావచ్చు.  ముఖ్యంగా మన చుట్టూ ముగ్గురు వ్యక్తులు ఉంటే జీవితంలో కష్టాలు రావు అని చాణక్యుడు చెబుతున్నాడు. 

PREV
14
Chanakya Niti

ఆచార్య చాణక్యుడు గురించి స్పెషల్ గా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆయన మన జీవితానికి సంబంధించిన చాలా విషయాలను చాణక్య నీతిలో పొందుపరిచారు. ఆ చాణక్య నీతి ప్రకారం.... మన జీవితంలో కనుక ముగ్గురు వ్యక్తులు ఉంటే... వారి జీవితం ఎప్పుడూ సంతోషంగా, ఆనందంగా ఉంటుంది. మరి, ఆ వ్యక్తులు ఎవరు? ఎవరి కారణంగా జీవితంలో ఆనందం లభిస్తుంది? ఎవరు అదృష్టవంతులు అవుతారో ఇప్పుడు తెలుసుకుందాం....

చాణక్య నీతిలో ఏం చెప్పారంటే....

‘‘ సంసారత్పదగ్ధానం త్రయో ఓషంసహేతవ:

అపత్యం చ కత్రం చ సతం వకరేవ చ ’’

24
1.తెలివైన భాగస్వామి...

జీవితంలో ఎలాంటి కష్టాలు వచ్చినా మంచి సమయాల్లో, చెడు సమయాల్లో ఒకరికొకరు నీడలా నిలబడే భార్యాభర్తలు దొరకాలంటే అదృష్టం ఉండాలి. మీ జీవితంలో కూడా అలాంటి భార్య ఉంటే.. మీరు అదృష్టవంతులు అని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా.. ఆమె అన్ని సమయాల్లో మీకు తోడుగా ఉండటంతో పాటు... తెలివైన వారు అయితే... మీరు మరింత అదృష్టవంతులు అవుతారు. సంస్కారవంతమైన, మిమ్మల్ని బాగా అర్థం చేసుకునే భాగస్వామి లభించినవారు జీవితంలో కచ్చితంగా ఉన్నత స్థాయికి వెళతారు.

34
2.బుద్ధిమంతులైన పిల్లలు...

అందమైన, తెలివైన పిల్లలు కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే... వారికంటే.. మంచి బుద్ధి మంతులైన పిల్లలు కలిగిన వారు మాత్రం జీవితంలో కచ్చితంగా అదృష్టవంతులు అవుతారు. ఇలాంటి పిల్లలు ఉన్నవారు మాత్రం చాలా సంతోషంగా ఉంటారు. ప్రశాంతమైన జీవితం గడుపుతారు.

44
3.మంచి మిత్రులు..

ఒక వ్యక్తి ప్రవర్తన, స్నేహం అతని విజయంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. మంచి వ్యక్తులతో మన సహవాసం ప్రతి అడుగులోనూ ఆకాశమంత ఎత్తుకు చేరుకోవడానికి మనల్ని ప్రేరేపిస్తుండగా, చెడ్డ వ్యక్తుల సహవాసం మీ తెలివితేటలను పాడు చేసి మిమ్మల్ని వినాశన అంచులకు తీసుకువెళుతుంది. మంచి వ్యక్తుల సహవాసం జీవితాన్ని సంతోషపరుస్తుంది. అందుకే.. మంచి మిత్రులను ఎంచుకున్నవారు జీవితంలో మంచి స్థాయికి వెళ్లగలరు.

Read more Photos on
click me!

Recommended Stories