Dosa Tawa Tips: దోశ పెనం క్లీనింగ్ టిప్స్.. ఇలా చేస్తే కొత్తదానిలా మెరిసిపోతుంది!

Published : Jul 02, 2025, 04:38 PM IST

Dosa Tawa Tips: వంటపాత్రలు శుభ్రం చేసుకోవడం ఎంతో ముఖ్యం. అవి శుభ్రంగా లేకపోతే మన ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. ప్రధానంగా  రోజూ ఉపయోగించే దోసె పాన్ క్లీన్ చేయడం చాలా ముఖ్యం. దోశ పెనం ఎలా శుభ్రం చేయాలి? వాటిపై ఉన్న మొండి మరకలు, జిడ్డును ఎలా తొలగించాలి? 

PREV
15
దోస పెనం

బ్రేక్‌ఫాస్ట్‌లో ఇడ్లీ తర్వాత ఎక్కువగా తినడానికి ఇష్టపడే టిఫిన్ దోశ. ఉదయాన్నే తినే టేస్టీ దోశ లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఐరన్ పెనంపై దీన్ని ప్రిపేర్ చేస్తే ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావు. అందుకే దీన్ని చాలామంది కిచెన్‌లో భాగం చేసుకుంటారు. ఇక్కడ వరకు అంత బాగానే ఉన్నా దీని క్లీనింగ్ పెద్ద టాస్క్.  దోస పెనం అంచులలో పేరుకుపోయిన నూనె జిడ్డు, మొండి మరకలను తొలగించడం చాలా కష్టం. వీటిని ఎలా తొలగించవచ్చో తెలుసుకుందాం. 

25
పెనం వేడి చేయండి:

దోసె పెనాన్ని 2–3 నిమిషాలు వేడి చేయడం వల్ల పెనంపై ఉన్న నూనె జిడ్డు, మొండి మరకలను సులభంగా తొలగించవచ్చు. వేడి వల్ల ఆ మరకలు మృదువుగా మారుతాయి. ఆ తర్వాత దాన్ని ఉప్పుతో రుద్ది, నీటితో కడిగితే మరింత శుభ్రంగా అవుతుంది. 

35
ఇలా శుభ్రం చేయండి

దోసె పెనాన్ని స్టౌవ్ నుంచి దించగానే, రెండు స్పూన్ల ఉప్పు, ఒక స్పూన్ బేకింగ్ సోడా, అర నిమ్మరసం కలిపి పెనంపై రుద్దాలి. ఈ మిశ్రమం మొండి మరకలు, నూనె జిడ్డును సులభంగా తొలగిస్తుంది. 

45
నిమ్మకాయ తొక్కతో

నిమ్మకాయ తొక్కతో కూడా పెనంపై జిడ్డు, మరకలు పోగొట్టవచ్చు. ఆ మరకలు ఉన్న చోట బాగా రుద్దాలి. అవసరమైతే కొబ్బరి పీచు లేదా స్టీల్ స్క్రబ్బర్ వాడొచ్చు. ఉప్పు, బేకింగ్ సోడా, నిమ్మరసం కలిసి రాస్తే..పెనంపై ఉన్న మొండి జిడ్డును సులభంగా తొలగిపోతాయి. 

55
కడిగే పద్ధతి:

దోస పెనాన్ని సబ్బు లేదా లిక్విడ్ క్లీనర్‌తో బాగా కడిగితే, అది కొత్తదానిలా మెరుస్తూ కనిపిస్తుంది.

గమనిక: ఈ ప్రక్రియను వారానికి ఒక్కసారి చేయడం ద్వారా పెనంపై జిడ్డు, మరకలు పేరుకోకుండా నివారించవచ్చు. ఒక్కసారి ఈ చిట్కా ప్రయత్నించి చూడండి. ఇలా చేస్తే పెనం శుభ్రంగా, మెరుస్తూ ఉంటుంది. 

Read more Photos on
click me!

Recommended Stories