Soap Hacks: ఇంటిలో మిగిలిపోయే సబ్బు ముక్కల్ని ఇక పారేయకండి. ఈ చిట్కాలు పాటిస్తే ఇల్లంతా సువాసనలు వెదజల్లుతాయి. ఇక నుంచి రూమ్ స్ప్రే, ఎయిర్ ఫ్రెషనర్ ఖర్చు తగ్గుతుంది. ఇలా చేసి ఆశ్చర్యపరిచే ప్రయోజనాలు వస్తాయి.
వాడి పారేసిన సబ్బు ముక్కలతో సులభంగా హ్యాండ్ వాష్ తయారుచేసుకోవచ్చు. చిన్న సబ్బు ముక్కల్ని వేడి నీటిలో నానబెట్టి కరిగించాలి. తరువాత దాన్ని సీసాలోకి పోసి, అవసరమైతే కొంత నీరు కలిపి బాగా కుదిపితే హ్యాండ్ వాష్ సిద్ధం. ఈ హ్యాండ్ వాష్‌ను కిచెన్, బాత్రూంలో ఉపయోగించవచ్చు. వీటిని ఉపయోగించి, జెర్మ్ కిల్లర్ లిక్విడ్స్ కొనే ఖర్చును తగ్గించుకోవచ్చు.
28
సబ్బుల తయారీ
వాడి పాడేసిన చిన్న సబ్బు ముక్కలతో కొత్త సబ్బులను తయారు చేయవచ్చు. అదేలాగంటే.. వివిధ రకాల సబ్బులను తురిమి లేదా ముక్కలుగా చేసి, కొద్దిగా నీటితో తక్కువ మంటపై వేడి చేసి కరిగించాలి. ఇందులో మీకు నచ్చిన ఎసెన్షియల్ ఆయిల్ వేసి బాగా కలిపి అచ్చులో పోసి చల్లారనివ్వండి. కొన్ని గంటల్లో కొత్త సబ్బు సిద్ధం అవుతుంది. ఈ రీసైకిల్ చేసిన సబ్బు మీరు స్వయంగా వాడుకోవచ్చు, లేదా బహుమతిగా ఇవ్వవచ్చు. ఇది పర్యావరణానికీ మేలు, ఇలా సబ్బుల ఖర్చులను తగ్గించుకోవచ్చు.
38
సువాసనను తరిమికొట్టండిలా..
దుస్తుల అలమారాలు, డ్రాయర్లు, లాక్ చేసిన పెట్టెలో ముతక వాసన తప్పించుకోవాలంటే.. చిన్న సబ్బు ముక్కల్ని ఒక పలుచని గుడ్డలో చుట్టి లేదా చిన్న జాడీలో వేసి ఉంచండి. ఇది కీటకాలను దూరంగా ఉంచడమే కాకుండా, దుస్తులకు తాజా సువాసనను ఇస్తాయి. వర్షాకాలంలో వచ్చే బూజు వాసనను నివారించడంలో ఇది చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఈ పద్ధతిని కార్లలో కూడా ప్రయత్నించవచ్చు. తక్కువ ఖర్చుతో, సహజంగా చక్కటి ఫ్రెష్‌నెస్‌ను పొందవచ్చు.
డ్రాయర్లు, కిటికీలు తెరవడానికి కష్టంగా ఉన్నప్పుడు, వాటి అంచులు లేదా చీలికలపై చిన్న సబ్బు ముక్కను రుద్దడం ద్వారా సమస్యను తాత్కాలికంగా పరిష్కరించవచ్చు. సబ్బు మృదుత్వం వల్ల గలిసిన భాగాలు సజావుగా కదులుతాయి. ఇదే పద్ధతిని కిటికీల నెట్లకు కూడా ఉపయోగించవచ్చు. ఇలా చేయడం వల్ల అవి సులభంగా తెరుచుకుంటాయి, మూయవచ్చు. తక్కువ ఖర్చుతో ఈ సమస్యకు పరిష్కారించుకోవచ్చు.
58
షేవింగ్ క్రీమ్ గా
అత్యవసర సమయంలో షేవింగ్ క్రీం అందుబాటులో లేకపోతే, ఒక చిన్న సబ్బు ముక్కను నీటిలో తడిపి ముఖానికి రుద్దడం ద్వారా తేలికైన నురగను పొందవచ్చు. ఇది షేవింగ్‌కు తగిన మృదుత్వాన్ని ఇస్తుంది. ఈ విధానాన్ని ఉపయోగించడంతో షేవింగ్ సబ్బు లేదా క్రీం కొనుగోలు ఖర్చు తగ్గించుకోవచ్చు.
68
టైల్స్ క్లీనర్ గా
టాయిలెట్, వాష్‌బేసిన్, టైల్స్ శుభ్రపరచడానికి చిన్న సబ్బు ముక్కలు చక్కగా ఉపయోగపడతాయి. వీటిని నీటిలో నానబెట్టి, ఆ నీటితో శుభ్రం చేస్తే మరకలు పోతాయి. అలాగే, దుమ్ము, బాక్టీరియా, జెర్మ్స్‌ను తొలగించడంలో సహాయపడతాయి. బాత్రూం శుభ్రం చేసిన తరువాత ఒక చిన్న సబ్బు ముక్కను మూలలో ఉంచితే, అది ి తాజాగా ఉంచి, దుర్వాసన నివారిస్తుంది.
78
టైలరింగ్ పనులకు:
టైలరింగ్ చేసేటప్పుడు బట్టలపై గుర్తులు పెట్టుకోవడానికి పెన్సిల్ కి బదులుగా ఎండిన సబ్బు ముక్కల్ని వాడొచ్చు. సబ్బు గుర్తు సులభంగా చెరిగిపోతుంది, అలాగే బట్టపై మరకలు ఉండవు. ఇది టైలర్లకు చక్కని చిట్కా.
88
గోళ్ళ శుభ్రతకు:
తోటలో పనిచేసిన తర్వాత లేదా మురికి పనులు చేసిన తర్వాత, గోళ్ళ చీలికల్లో చేరే మురికిని తొలగించడానికి, ఒక చిన్న సబ్బు ముక్కను నీటిలో తడిపి, బ్రష్ సాయంతో గోళ్ళను శుభ్రం చేసుకోవచ్చు. ఆ సబ్బు నీరు సులభంగా మురికిని తొలగిస్తుంది, ఇది చిన్న మార్పు అయినా, దీర్ఘకాలంలో పెద్ద లాభం చేకూరుస్తుంది. ఈ చర్య పర్యావరణ రక్షణలో భాగమని చెప్పవచ్చు.