Newspaper Craft: మీ ఇంట్లో పాత న్యూస్‌పేపర్లు ఉన్నాయా… వాటిని అమ్మేయకుండా క్రియేటివ్‌గా వాడండి. పాత పేపర్లతో ఎలాంటి అందమైన హోమ్ డెకార్ వస్తువులు తయారుచేయవచ్చో తెలుసుకోండి. తక్కువ ఖర్చుతోనే ఇంటికి ఆకర్షణీయమైన లుక్ ఇస్తాయి.
ఇంట్లో ఉన్న పాత న్యూస్‌పేపర్లను ఏం చేయాలా అని ఆలోచిస్తున్నారా? వాటితో అందమైన వాల్ ఆర్ట్ చేసుకోవచ్చు. రంగురంగుల కటింగ్స్, రోల్స్ లేదా పేపర్ స్ట్రిప్స్‌తో అందమైన వాల్ ఆర్ట్ తయారు చేయవచ్చు. వీటిని మీకు నచ్చిన డిజైన్లతో అమర్చి ఫ్రేమ్ కట్టించుకోవాలి. ఇది మీ లివింగ్ రూమ్ లేదా స్టడీ ఏరియా గోడలకు ప్రత్యేకమైన గుర్తింపును ఇస్తుంది. ఇది ఇంటికి ఎంతో అందాన్ని ఇస్తుంది.
25
అందమైన పేపర్ ఫ్లవర్ వాజ్
ఇక న్యూస్‌పేపర్ తో అందమైన ఫ్లవర్ వాస్ చేయచ్చు. పేపర్లను సన్నని రోల్స్‌గా చుట్టి, వాటిని ఒకదానికొకటి అతికించి అదిరిపోయే ఫ్లవర్ వాజ్‌ను తయారు చేయవచ్చు. దీనికి మీకు నచ్చిన రంగు వేసుకోవాలి. ఇది మార్కెట్లో కొన్న ఫ్లవర్ వాజ్‌లాగే కనిపిస్తుంది. ఇందులో ఆర్టిఫిషియల్ పువ్వులు పెట్టి ఇంటిలోని ఎక్కడ పెట్టిన అందంగా కనిపిస్తుంది.
35
డెకరేటివ్ బాస్కెట్
న్యూస్‌పేపర్ ను రోల్స్ లా చుట్టుకోవాలి. ఈ రోల్స్‌ను గట్టిగా చేసుకోవాలి. వాటితో చిన్న, పెద్ద బాస్కెట్లు అల్లుకోవచ్చు. వీటిని తాళాలు, కాస్మెటిక్స్, రిమోట్ వంటి ఇతర చిన్న వస్తువులు పెట్టుకోవాలి. ఈ బాస్కెట్లు ఇంట్లో అనేక రకాలుగా వాడుకోవచ్చు. ఇది అందమైన అలంకరణ వస్తువుగా కూడా ఉపయోగపడతాయి.
పాత న్యూస్‌పేపర్లతో చేసిన ఫోటో ఫ్రేమ్ ఇది. ఇలాంటి మీ ఇంటికి క్రియేటివ్ లుక్ ఇస్తుంది. పేపర్ రోల్స్ లేదా డిజైన్లను ఫ్రేమ్ చుట్టూ అతికించి అందంగా మార్చుకోవచ్చు. ఇందులో ఫోటోలు పెట్టి ఇంటిని అందంగా మార్చుకోవచ్చు.
55
స్టైలిష్ పేపర్ ల్యాంప్ షేడ్
మీ ఇంటికి అందాన్ని తెచ్చే ల్యాంప్ షేడ్ తయారుచేయవచ్చు. పేపర్ కటింగ్స్, డిజైన్లతో చేసిన ఈ ల్యాంప్ షేడ్, వెలుగులో చాలా అందంగా కనిపిస్తుంది. ఇది డ్రాయింగ్ రూమ్, బెడ్‌రూమ్ లేదా బాల్కనీ అందాన్ని రెట్టింపు చేస్తుంది. ఒక్కసారి దీన్ని తయారుచేసి చూడండి.. ఎంతో అందంగా ఉంటుంది.