కొందరికి ఆవలింతలు (Yawning) నిరంతరం వస్తూనే ఉంటాయి. వాటిని ఆపడం మాత్రం కుదరదు. ఎలా ఆవలింతలు అధికంగా రావడానికి కారణం ఏంటో తెలుసా? ఇది ప్రమాదకరం కూడా కావచ్చు.
కొందరికి ఆవలింతలు వస్తూనే ఉంటాయి. సరిపోయినంత నిద్ర పట్టినా కూడా ఆవలింతలు వస్తూనే ఉంటాయి. తీవ్రంగా అలసిపోవడం వల్ల కూడా ఆవలింతలు వస్తూ ఉంటాయి. అధికంగా ఆవలింతలు రావడం అనేది దేనికి సంకేతమో తెలుసా?
26
ఇది ఒక వ్యాధి
అమెరికన్ అకాడమీ ఆఫ్ స్లీప్ మెడిసిన్ (AASM) ప్రకారం తరచుగా ఆవలింతలు రావడం నిద్రలేమికి సంకేతంగా చెప్పుకోవచ్చు. పగటిపూట అతిగా నిద్ర పోవడం వల్ల కూడా ఇలా జరుగుతుంది.
36
ఈ వ్యాధులు ఉంటే అవకాశం
అధికంగా ఆవలింతలు రావడం అనేది కొన్నిసార్లు బ్రెయిన్ ట్యూమర్, స్ట్రోక్, మల్టిపుల్ స్క్లెరోసిస్ వంటి వ్యాధుల లక్షణం కూడా కావచ్చని వైద్యులు చెబుతున్నారు.
అధ్యయనాల ప్రకారం అధికంగా ఆవలింతలు రావడం అనేది గుండెపోటుకు, రక్త ప్రసరణ సరిగా జరగకపోవడానికి కారణం కావచ్చు.
56
3. శరీర ఉష్ణోగ్రత నియంత్రణ సమస్య
శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడంలో సమస్యల వల్ల కూడా తరచుగా ఆవలింతలు రావచ్చు. ఇది నరాల సంబంధిత రుగ్మతకు సంకేతం కావచ్చు.
66
వైద్యుడిని ఎప్పుడు చూడాలి?
ఆవలింతలు అధికంగా రావడంతో పాటు తల తిరగడం, జ్ఞాపకశక్తి తగ్గడం, చేతులు కాళ్ళలో తిమ్మిరి, తీవ్ర తలనొప్పి, వేగవంతమైన హృదయ స్పందన వంటి లక్షణాలు ఉంటే వైద్యుడిని వెంటనే సంప్రదించాలి.