ఆ తర్వాత పక్కన పెట్టిన పిండిని చిన్న చిన్న బాల్స్ లా తయారు చేయండి. అయితే ఇవి చాలా సాఫ్ట్ గా ఉండాలి. వీటిపైన క్రాక్స్ అస్సలు ఉండకూడదు. లేదంటే అవి నూనెలో వేసినప్పుడు పగిలిపోతాయి. అయితే మీరు పిండి బాల్స్ చేసేటప్పుడు పిండిని బాగా ప్రెస్ చేస్తే క్రాక్స్ రాకుండా ఉంటాయి.
ఇప్పుడు వీటిని వేడిగా అయిన నూనెలో వేయండి. అయితే నూనె మరీ ఎక్కువ వేడిగా ఉండకూడదు. మీడియం, తక్కువ మంట మీదే వీటిని ఫ్రై చేయాలి. లేదంటే గులాబ్ జామూన్ లు లోపల పిండిగా ఉంటాయి.
గులాబ్ జామూన్ లను బంగారు, గోధుమ రంగు వచ్చే వరకు తక్కువ నుంచి మీడియం మంట మీదే ఫ్రై చేసుకోవాలి. వీటిని వేయించేటప్పుడు అటూ ఇటూ తిప్పుతూ ఉండాలి. అప్పుడే అవి అన్నివైపులా బాగా ఫ్రై అవుతాయి. లోపల బాగా ఉడుకుతాయి. ఫ్రై చేసుకున్న గులాబ్ జామూన్ లను వేడి సిరప్ లో వేయండి.
వీటిని రెండు మూడు గంటల పాటు సిరప్ లో ఉంచండి. అప్పుడే ఈ బాల్స్ సిరప్ ను బాగా గ్రహిస్తాయి. అప్పుడే గులాబ్ జామూన్ లు జ్యూసీ జ్యూసీగా అవుతాయి. ఈ గులాబ్ జామూన్ లు సిరప్ ను పూర్తిగా పీల్చుకున్న తర్వాత వాటిని సర్వింగ్ గిన్నెలోకి మార్చండి. వీటిని తరిగిన బాదం లేదా పిస్తాతో డెకరేట్ చేసి తింటే టేస్టీ అదిరిపోతుంది.