Loco Pilot: దేశంలో అతిపెద్ద నెట్ వర్క్..రైల్వే. రోజూ కోట్ల మంది ప్రయాణికులు రైళ్ల సర్వీసు వినియోగించుకుంటున్నారు. రైళ్లను గమ్య స్థానాలకు తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించేది లోకో పైలట్. ప్రయాణికుల భద్రత వీళ్ల బాధ్యత. ఈ లోకో పైలట్ నెల జీతమెంతో తెలుసా?
లోకో పైలట్ జీతం విషయానికి వస్తే, భారతీయ రైల్వేలో ఉద్యోగం స్థాయి, అనుభవం, పని చేసే విభాగం ఆధారంగా వేతనం మారుతుంది. అసిస్టెంట్ లోకో పైలట్ (ALP)గా ఉద్యోగంలో చేరిన వారికి కేంద్ర ప్రభుత్వ 7వ వేతన సంఘం ప్రకారం ప్రారంభ బేసిక్ పే సుమారు రూ.19,900 ఉంటుంది. దీనికి డియర్‌నెస్ అలవెన్స్ (DA), హౌస్ రెంట్ అలవెన్స్ (HRA), ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్ వంటి భత్యాలు అదనంగా లభిస్తాయి.
25
అలవెన్స్‌లన్నీ కలిపితే రూ.55,000 వచ్చే అవకాశం
ఈ అలవెన్స్‌లన్నీ కలిపితే అసిస్టెంట్ లోకో పైలట్ నెలకు సుమారు రూ.35,000 నుంచి రూ.55,000 వరకు సంపాదించే అవకాశం ఉంటుంది. అనుభవం పెరిగే కొద్దీ పదోన్నతులు ఉంటాయి. తర్వాత సీనియర్ అసిస్టెంట్ లోకో పైలట్, లోకో పైలట్, సీనియర్ లోకో పైలట్ వంటి పై స్థాయికి చేరుకోవచ్చు.
35
అదనపు డ్యూటీలు, నైట్ షిఫ్ట్‌లు, ఓవర్‌టైమ్
పూర్తిస్థాయి లోకో పైలట్‌గా పనిచేసే వారికి నెలకు రూ.60,000 నుంచి రూ.1 లక్షకు పైగా వేతనం లభించవచ్చు. కొన్ని ప్రత్యేక మార్గాలు, అదనపు డ్యూటీలు, నైట్ షిఫ్ట్‌లు, ఓవర్‌టైమ్ పనుల వల్ల ఆదాయం మరింత పెరుగుతుంది. అనుభవజ్ఞులైన సీనియర్ లోకో పైలట్ల వేతనం కొన్ని సందర్భాల్లో లక్ష రూపాయలు దాటుతుంది.
లోకో పైలట్ కావాలంటే ఇంటర్ తర్వాత సంబంధిత టెక్నికల్ కోర్సులు లేదా ఐటీఐ, డిప్లొమా అర్హతలు ఉండాలి. తర్వాత రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB)నిర్వహించే పరీక్షల్లో పాసవ్వాలి. రాత పరీక్ష, సైకోమెట్రిక్ టెస్ట్, మెడికల్ పరీక్షల్లో అర్హత సాధించిన తర్వాతే ఎంపిక జరుగుతుంది.
55
బాధ్యతాయుతమైన జాబ్
అయితే ఈ ఉద్యోగం వల్ల జీతం ఎక్కువొచ్చినా...ఇదొక బాధ్యతాయుతమైన జాబ్. గంటల తరబడి కేబిన్‌లో ప్రయాణించాలి. వాతావరణ పరిస్థితులను ఎదుర్కోవాలి. టైమింగ్స్ ఉంటాయి. అయినప్పటికీ మంచి జీతం, ప్రభుత్వ ఉద్యోగ భద్రత, పదోన్నతి అవకాశాల కారణంగా లోకో పైలట్ ఉద్యోగానికి యువతలో మంచి డిమాండ్ ఉంది. అందుకే రైల్వేలో కెరీర్‌ను నిర్మించాలనుకునే వారికి లోకో పైలట్ ఉద్యోగం అత్యంత ప్రతిష్ఠాత్మకమైన అవకాశాల్లో ఒకటి అని చెప్పొచ్చు.