Rooftop Garden: డాబా ఖాళీగా ఉంటే కొందరికి ఇష్టం. ప్రశాంతంగా ఉంటుందని అనుకుంటారు. కానీ అదే డాబాపై మొక్కలు పెంచితే ఇంకా హాయిగా ఉంటుంది. ఈ గార్డెన్ డిజైన్ లతో మీ మేడపై అందమైన గార్డెన్ పెట్టుకోవచ్చు. ప్రీమియం లుక్ కూడా ఇస్తాయి.
ఈరోజుల్లో బయట పెరిగిన కాలుష్యం వల్ల స్వచ్ఛమైన గాలి దొరకడమే కష్టమైపోయింది. కాసేపు చెట్లు కింద కూర్చుందామంటే అసలు చెట్లు, మొక్కలే కనిపించవు. దానికి తోడు పెరుగుతున్న జనాభా. ఇళ్లు కూడా చిన్న చిన్న స్థలాల్లోనే కట్టుకోవాల్సి వస్తోంది. అందుకే ఈ రోజుల్లో రూఫ్‌టాప్ గార్డెన్ ఒక బెస్ట్ ఆప్షన్. ఖాళీగా ఉన్న డాబాను పచ్చదనంతో నింపితే ఇంటి అందం పెరగడమే కాదు, ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. మోడరన్ రూఫ్‌టాప్ గార్డెన్ డిజైన్లు ఇంటికి ప్రీమియం లుక్ ఇవ్వడంతో పాటు, వేసవిలో వేడిని తగ్గించి, స్వచ్ఛమైన గాలిని అందిస్తాయి. సరైన ప్లానింగ్‌తో మీ సాధారణ డాబా కూడా అద్భుతమైన గ్రీన్ స్పేస్‌గా మారిపోతుంది.
25
మోడరన్ ప్లాంటర్లు, వర్టికల్ గార్డెన్ వాడండి
మీ రూఫ్‌టాప్ గార్డెన్‌ను ఆకర్షణీయంగా మార్చడానికి మోడరన్ ప్లాంటర్లు, వర్టికల్ గార్డెన్‌లు బెస్ట్ ఆప్షన్స్. గోడలకు గ్రీన్ ప్యానెల్స్ లేదా హ్యాంగింగ్ ప్లాంట్స్ అమర్చడం వల్ల తక్కువ స్థలంలోనే ఎక్కువ పచ్చదనం వస్తుంది. చిన్న, పెద్ద ప్లాంటర్లను కలిపి వాడితే డాబాకు స్టైలిష్, బ్యాలెన్స్‌డ్ లుక్ వస్తుంది. దీంతో డాబా చాలా నీట్‌గా, ప్రతి మూల అందంగా కనిపిస్తుంది.
35
హాయిగా కూర్చోవడానికి ఓ కార్నర్
రూఫ్‌టాప్ గార్డెన్ అంటే కేవలం మొక్కలు పెంచడమే కాదు. అక్కడ హాయిగా కూర్చోవడానికి మంచి సీటింగ్ ఏర్పాటు చేసుకుంటే, కుటుంబం, స్నేహితులతో సమయం గడపడానికి అదిరిపోయే ప్లేస్ అవుతుంది. చెక్క ఫర్నిచర్, అవుట్‌డోర్ కుర్చీలు, చిన్న టేబుల్స్ గార్డెన్ అందాన్ని మరింత పెంచుతాయి. ఈ ప్రదేశం ఉదయం టీ తాగడానికి, యోగా చేయడానికి లేదా సాయంత్రం రిలాక్స్ అవ్వడానికి పర్ఫెక్ట్‌గా ఉంటుంది.
రాత్రిపూట మీ రూఫ్‌టాప్ గార్డెన్‌ను స్పెషల్‌గా మార్చడంలో లైటింగ్ చాలా ముఖ్యం. వార్మ్ LED లైట్లు, స్ట్రింగ్ లైట్లు, సోలార్ ల్యాంప్‌లు మీ గార్డెన్‌కు ఆకర్షణీయమైన, ప్రశాంతమైన లుక్ ఇస్తాయి. సరైన లైటింగ్ మొక్కల అందాన్ని హైలైట్ చేస్తుంది. మీ డాబాను ఒక మోడరన్ అవుట్‌డోర్ స్పేస్‌గా మార్చేస్తుంది.
55
మల్టీ-ఫంక్షనల్ గ్రీన్ స్పేస్ రెడీ చేయండి
ఆధునిక రూఫ్‌టాప్ గార్డెన్‌లో అలంకరణ మొక్కలతో పాటు హెర్బ్స్, కూరగాయలు, పూల మొక్కలు కూడా పెంచుకోవచ్చు. దీనివల్ల మీ డాబా కేవలం అలంకరణకే కాకుండా, ఉపయోగపడే గ్రీన్ స్పేస్‌గా మారుతుంది. రకరకాల మొక్కలను కలిపి పెంచడం వల్ల సహజమైన అందం పెరగడమే కాకుండా, మీ ఇల్లు పర్యావరణానికి మేలు చేస్తుంది. ఇలాంటి గార్డెన్ మీ ఇంటి విలువను, ఆకర్షణను రెండింటినీ పెంచుతుంది.