Rice Water: అందంగా కనిపించాలంటే ఖరీదైన ప్రోడక్ట్స్ కచ్చితంగా వాడాలని చాలామంది అనుకుంటారు. కానీ మన ఇంట్లో ఉండే కొన్ని సహజ పదార్థాలతో కాంతివంతమైన ముఖాన్ని పొందవచ్చు. మరి ముఖానికి మెరుపునిచ్చే ఆ సహజ పదార్థాలేంటో, ఎలా వాడాలో ఇక్కడ చూద్దాం.
రాత్రి పడుకునే ముందు సరైన స్కిన్ కేర్ తప్పనిసరి. దానివల్ల చర్మం ఆరోగ్యంగా, ప్రకాశవంతంగా మారుతుంది. నిపుణుల ప్రకారం ముఖాన్ని అందంగా, కాంతివంతంగా మార్చడంలో బియ్యం నీరు చక్కగా సహాయపడుతుంది. ఈ నీటిని సరైన విధంగా ఉపయోగిస్తే స్కిన్ టోన్ మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు. మరి బియ్యం నీటిని చర్మానికి ఎలా వాడాలో ఇక్కడ తెలుసుకుందాం.
26
బియ్యం నీటి ప్రయోజనాలు
బియ్యం నీటిలో విటమిన్లు, అమైనో ఆమ్లాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి చర్మాన్ని శాంతింపజేసి, వాపు, మంట తగ్గించడంలో సహాయపడతాయి. ముఖ్యంగా రాత్రి సమయంలో మన చర్మం రిపేర్ మోడ్‌లోకి వెళ్తుంది. అదే సమయంలో స్కిన్ పై సరైన న్యూట్రిషన్ అందితే సెల్స్ రీజెనరేషన్ బాగా జరుగుతుంది. అందుకే పడుకునే ముందు రైస్ వాటర్ ని టోనర్‌గా వాడటం మంచిది.
36
రైస్ వాటర్ తయారీ విధానం
రైస్ వాటర్‌ను సరైన విధంగా తయారు చేయడం కూడా ముఖ్యమే. బియ్యాన్ని బాగా కడిగి, శుభ్రమైన నీటిలో 20–30 నిమిషాలు నానబెట్టి ఆ నీటిని వాడటం మంచిది. కొంతమంది ఫెర్మెంటెడ్ రైస్ వాటర్ ఉపయోగిస్తారు. కానీ అది సెన్సిటివ్ స్కిన్ ఉన్నవారికి ఇబ్బంది కలిగించవచ్చు.
రాత్రి పడుకునే ముందు ముఖాన్ని బాగా శుభ్రం చేసుకోవాలి. తర్వాత కాటన్ సహాయంతో ఫిల్టర్ చేసిన బియ్యం నీటిని ముఖానికి అప్లై చేయాలి. 10 నుంచి 15 నిమిషాలు అలాగే ఉంచి, సహజంగా ఆరనివ్వాలి. తర్వాత నార్మల్ వాటర్ తో కడిగిస్తే సరిపోతుంది. ఇలా చేయడం వల్ల స్కిన్ హైడ్రేటెడ్‌గా ఉండి, ఉదయం లేవగానే ఫ్రెష్‌గా కనిపిస్తుంది.
56
ఆయిలీ స్కిన్ కి ఎక్కువ లాభం
ఈ రైస్ వాటర్ చిట్కా.. ఆయిలీ స్కిన్ ఉన్నవారికి ఎక్కువ ఉపయోగపడుతుంది. ఇది ఎక్సెస్ ఆయిల్‌ను కంట్రోల్ చేయడంలో సహయపడుతుంది. డ్రై స్కిన్ ఉన్నవారు మాత్రం దీని తర్వాత మాయిశ్చరైజర్ వాడటం తప్పనిసరి అని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే మొదటిసారి వాడే ముందు ప్యాచ్ టెస్ట్ చేసుకోవడం మంచిది.
66
మంచి ఫలితాలు రావాలంటే?
నిపుణుల ప్రకారం రైస్ వాటర్‌ను రాత్రి సమయంలో ఉపయోగించడం వల్ల స్కిన్ టోన్ క్రమంగా ఇంప్రూవ్ అవుతుంది. ముఖ్యంగా డల్ స్కిన్, చిన్న మచ్చలు, టాన్ వంటి సమస్యల్ని తగ్గించడంలో ఇది సహాయపడుతుంది. కానీ ఈ వాటర్ ని రెగ్యులర్‌గా ఉపయోగించినప్పుడు మాత్రమే మంచి ఫలితాలు కనిపిస్తాయి.