మీ వయసు కంటే పెద్దవారిలా కనిపిస్తున్నారా? ఈ అలవాట్లే కారణం తెలుసా?

First Published Jan 22, 2023, 11:02 AM IST

కొంతమంది వయసులో చిన్నవారైనా.. పెద్దవారిలా కనిపిస్తుంటారు. ముడతల చర్మం, తెల్లజుట్టు, కంటికింద నల్లటి వలయాలు ఇలా రకరకాల లక్షణాలు కనిపిస్తారు. అయితే ఇలా పెద్దవారిలా కనిపించడానికి కొన్ని అలవాట్లే కారణమంటున్నారు నిపుణులు. 

skin care

నిజానికి వృద్ధాప్యాన్ని ఆపలేం. వయసు పెరుగుతున్న కొద్దీ వృద్ధాప్యం మొదలవుతూనే ఉంటుంది. దీనివల్ల చర్మం ముడతలు పడటం, తెల్లజుట్టు, కంటి చుట్టూ నల్లటి వలయాలు వంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే వీటన్నింటినీ  కొంతమంది మేకప్ వేసి కవర్ చేస్తుంటారు. కానీ వృద్ధాప్యం అనేది ఆపలేని లేదా తిప్పికొట్టలేని విషయం. ఇది అనివార్యం. కానీ కొంతమంది చిన్నవయసులో కూడా పెద్దవారిలా కనిపిస్తారు. నిజం చెప్పాలంటే ఇది మీ చేతుల్లో పని. ఎలా అంటారేమో.. మీ రోజు వారి కొన్ని అలవాట్లే మీ వయస్సు కంటే పెద్దవారిలా కనిపించేలా చేస్తాయి. ఆల్కహాల్ తాగడం నుంచి నిర్జలీకరణానికి గురికావడం వరకు ఎన్నో అలవాట్లు మీ చర్మాన్ని ప్రభావితం చేస్తాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

skin care

మీ చర్మాన్ని తేమగా ఉంచుకోకపోవడం

ఉదయం పూట బిజీబిజీగా ఉండటం, సాయంత్రం పూట అలసిపోయి పడుకోవడం.. చాలా మంది రొటీన్ గా చేసే పని ఇది. మీ వయస్సు కంటే ఎక్కువ వయస్సు వచ్చే అనేక చెడు అలవాట్లలో ఇది కూడా ఒకటి. మాయిశ్చరైజర్లు చర్మాన్ని తేమగా ఉంచడానికి సహాయపడతాయి. బాగా మాయిశ్చరైజ్ చేసిన చర్మం మృదువుగా కనిపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు వీటివల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. 
 

skin care

నిద్రకు ముందు మేకప్ ను తొలగించకపోవడం

పొద్దున్నే మేకప్ వేసుకోవడానికి, గంటల తరబడి టచ్ అప్ చేయడానికి సమయం చాలానే ఉంటుంది. కానీ వేసుకున్న మేకప్ ను తొలగించడానికి మాత్రం చాలా మందికి సమయం దొరకదు. చాలా మంది మేకప్ తోనే పడుకుంటారు. దీనివల్ల మీ చర్మ రంధ్రాలు మూసుకుపోతాయి. అలాగే మొటిమలు అవుతాయి. 

చక్కెరను ఎక్కువగా తీసుకోవడం

శుద్ధి చేసిన చక్కెర ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. టీ, కాఫీ, స్నాక్స్, డెజర్ట్లు లేదా చక్కెర పానీయాలను ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. కొంతమంది తీపి పదార్థాలనే ఎక్కువగా తింటుంటారు. కానీ చక్కెర ఎన్నో అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. చక్కెర అణువులు కొల్లాజెన్  గ్లైకేషన్ కుు కారణమవుతాయి. ఈ ప్రక్రియ త్వరగా కొల్లాజెన్ క్షీణతకు దారితీస్తుంది.
 

skin care

నిర్జలీకరణానికి గురికావడం

నిర్జలీకరణం ఎన్నో ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. ముఖ్యంగా ఇది మీ ముఖ అందాన్ని తగ్గిస్తుంది. మీరు హైడ్రేట్ గా ఉండకపోతే మీ చర్మం నుంచి తేమంతా తగ్గిపోతుంది. అలాగే చర్మం ముడతలు పడుతుంది.  

మద్యం సేవించడం

ఆల్కహాల్  ఆరోగ్యానికి హానికరం అన్న ముచ్చట అందరికీ తెలుసు. అయినా తాగుతుంటారు. ఆల్కహాల్ మీ చర్మం నుంచి ద్రవాలను తొలగిస్తుంది. దీంతో మీ చర్మం పొడిబారుతుంది. ముడతలు కూడా బాగా వస్తాయి. అందుకే ఈ అలవాటును మానుకోండి. 

చర్మం ఆరోగ్యం కోసం చేయాల్సిన పనులు

చర్మ రకాన్ని బట్టి మాయిశ్చరైజ్ చేయండి

ఒక్కొక్కరికీ ఒక్కో రకం చర్మం ఉంటుంది. చర్మానికి తగ్గ మాయిశ్చరైజర్లు చాలా అవసరం. జిడ్డుగల చర్మం ఉన్న మహిళలు జెల్ ఆధారిత మాయిశ్చరైజర్ ఉపయోగించాలని నిపుణులు చెబుతున్నారు. పొడి చర్మం ఉన్నవారు క్రీమ్ ఆధారిత మాయిశ్చరైజర్ ను ఎంచుకోవాలి. సాధారణ చర్మం ఉన్న మహిళలు లోషన్ల ను ఉపయోగిస్తే మంచిది. 

skin care

వారానికి ఒకటి లేదా రెండుసార్లు ఎక్స్ఫోలియేట్ చేయండి

మీ చర్మాన్ని అతిగా తొలగించకుండా లేదా చికాకు పెట్టకుండా చనిపోయిన చర్మ కణాలను తొలగించడానికి ఇది సరిపోతుంది.

మేకప్ కింద సన్స్క్రీన్ ధరించండి

ఏదైనా మేకప్ ఉత్పత్తిని చర్మానికి పెట్టే ముందు SPF 50, PA+++  సన్ స్క్రీన్ ను అప్లై చేయండి. ఇవి యువిఎ కిరణాల నుంచి మీ చర్మాన్ని రక్షిస్తాయి. 
 

click me!