బరువు తగ్గడానికి ఎన్నో ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అయినా ఏ మాత్రం ఫలితం లేదని చాలా మంది బాధపడుతుంటారు. నిపుణుల ప్రకారం.. మీరు బరువు తగ్గడానికి కొబ్బరి నూనె కూడా సహాయపడుతుంది. అదెలాగంటే?
ఈ రోజుల్లో ఓవర్ వెయిట్ సాధారణ సమస్య అయిపోయింది. కానీ ఈ అధిక బరువు వల్ల లేనిపోని అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. అందుకే బరువు పెరగకుండా ముందే జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. ఇక బరువు పెరిగిన తర్వాత తగ్గడమంటే మాటలు కావు. ఇందుకోసం ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. అయినా బరువు తగ్గకుండా పెరిగిన వారు చాలా మందే ఉన్నారు. దీనికి మనం చేసే కొన్ని తప్పులే కారణమంటారు నిపుణులు. అయితే కొన్ని చిట్కాలతో కూడా మీరు సులువుగా బరువు తగ్గొచ్చంటారు నిపుణులు. ముఖ్యంగా కొబ్బరి నూనెతో. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
26
coconut oil
బరువు తగ్గడానికి కొబ్బరి నూనె ఎలా సహాయపడుతుంది?
సులభంగా జీర్ణమవుతుంది
కొబ్బరి నూనె ఒక్క జుట్టుకు మాత్రమే కాదు.. మనం బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. నిపుణుల ప్రకారం.. వేరే నూనెల కంటే కొబ్బరి నూనెనే సులువుగా జీర్ణం అవుతుంది. దీంతో మీ శరీరంలో కొవ్వు పేరుకుపోవడం తగ్గుతుంది. దీంతో మీరు బరువు తగ్గుతారు.
36
coconut oil
హార్మోన్ల సమతుల్యత
హార్మోన్లు సమతుల్యంగా ఉంటే బరువు పెరిగే అవకాశం చాలా వరకు తగ్గుతుంది. అయితే కొబ్బరి నూనె హార్మోన్ల సమతుల్యతకు బాగా సహాయపడుతుంది. కొబ్బరి నూనెలో పాలీఫెనాల్స్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీరంలో హార్మోన్లను సమతుల్యంగా ఉంచడానికి సహాయపడతాయి. మీకు తెలుసా? హార్మోన్ల అసమతుల్యత వల్ల బరువు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
46
coconut oil
స్థిరమైన బ్లడ్ షుగర్
కొబ్బరి నూనె మన రక్తంలో చక్కెర స్థాయిలను పెరగకుండా, తగ్గకుండా స్థిరంగా ఉంచడానికి బాగా సహాయపడుతుంది. దీంతో మీ శరీరంలో పేరుకుపోయిన అదనపు కొవ్వు కూడా కరగడం మొదలవుతుంది. దీంతో మీరు బరువు తగ్గుతారు.
56
బరువు తగ్గడానికి కొబ్బరి నూనెను ఎలా ఉపయోగించాలి?
టీలో కలిపి తీసుకోవచ్చు
అవును మీరు బరువు తగ్గడానికి కొబ్బరి నూనెను టీలో కలిపి తీసుకోవచ్చు. ఇందుకోసం మీరు ఒక టీ స్పూన్ కొబ్బరి నూనెను టీలో కలుపుకుని లేదా వేడినీళ్లలో కలుపుకుని తాగొచ్చు. దీన్ని ప్రతిరోజూ ఉదయం తీసుకుంటే మీరు బరువు తగ్గుతారు.
66
coconut oil
మాంసంలో ఉపయోగించొచ్చు
బరువు తగ్గడానికి మీరు కొబ్బరి నూనెను మాంసాహారంలో కూడా ఉపయోగించొచ్చు. ఇందుకోసం ముందు మాంసానికి మసాలా దినుసులన్నింటినీ పట్టించాలి. వండే ముందు ఈ మాంసంపై కొబ్బరి నూనెను రాయాలి. ఈ కొబ్బరి నూనెతో వండిన మాంసాన్ని తింటే మీ శరీరంలో ఉన్న అదనపు కొవ్వు తగ్గుతుంది. అలాగే మీరు బరువు పెరగకుండా ఉంటారు.
రోజువారీ వంటకాలు
కొబ్బరి నూనెతో మీరు బరువు తగ్గాలనుకుంటే దీన్ని మీరు మీ రోజువారి వంటల్లో కూడా ఉపయోగించొచ్చు. ఇది వంటలను టేస్టీగా చేయడమే కాకుండా.. మీరు ఈజీగా బరువు తగ్గడానికి కూడా బాగా సహాయపడుతుంది.