5 నిమిషాల్లో తెల్ల జుట్టును నల్లగా చేయడం ఎలాగో తెలుసా?

Published : Aug 11, 2025, 10:30 AM ISTUpdated : Aug 11, 2025, 10:31 AM IST

చిన్నా పెద్దా అంటూ తేడా లేకుండా ఈ రోజుల్లో చాలా మందికి తెల్ల వెంట్రుకలు రావడం కామన్ అయిపోయింది.అయితే ఈ తెల్ల వెంట్రుకలను ఐదు నిమిషాల్లో నల్లగా మార్చేయొచ్చు. అదెలాగంటే? 

PREV
16
gray hair

వయసు పెరుగుతున్న కొద్దీ తెల్ల వెంట్రుకలు రావడం చాలా కామన్. కానీ ఈ రోజుల్లో చాలా మందికి చిన్న వయసులోనే తెల్ల వెంట్రుకలు వస్తున్నాయి. కానీ దీనివల్ల పెద్ద వయసు వారిలా కనిపిస్తతారు. అంతేకాకుండా ఈ తెల్ల వెంట్రుకలు జుట్టు అందాన్ని కూడా నాశనం చేస్తాయి. నిజానికి తెల్ల జుట్టు రావడానికి ఎన్నో కారణాలుంటాయి. కానీ ఈ తెల్ల వెంట్రుకలను దాచడానికి మగవారు, ఆడవారు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు.

26
gray hair

జుట్టుకు రంగులను వేస్తుంటార. మెహందీ, ఇతర ఇంటి చిట్కాలను ఫాలో అవుతుంటారు. వీటివల్ల జుట్టు అప్పటిప్పుడే నల్లగా అయిపోదు. ఇది చాలా మందికి ఇబ్బందిని కలిగిస్తుంటుంది. కొన్ని సమయాల్లో తెల్ల జుట్టును వెంటనే కవర్ చేయాల్సి వస్తుంది. ఇది ఎలాగో చాలా మందికి తెలియదు. అయితే ఒక చిట్కాతో మాత్రం ఐదే ఐదు నిమిషాల్లో తెల్ల జుట్టును నల్లగా చేసేయొచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

36
gray hair

5 నిమిషాల్లో తెల్ల జుట్టును నల్లగా చేసే చిట్కాలు

అవును జస్ట్ ఐదు నిమిషాల్లో తెల్ల జుట్టును నల్లగా చేయొచ్చు. రూట్ స్ప్రే నుంచి మస్కారా వరకు.. కొన్ని సింపుల్ చిట్కాలతో తెల్ల జుట్టును నల్లగా చేయొచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

46
gray hair

మస్కారా

మస్కారాను చాలా మంది అమ్మాయిలు ఉపయోగిస్తారు. ఇది కనురెప్పలు నల్లగా, అందంగా, మందంగా కనిపించేలా చేస్తుంది. అందుకే మేకప్ లో భాగంగా దీన్ని కూడా ఉపయోగిస్తుంటారు. అయితే ఈ మస్కారాను ఉపయోగించి తెల్ల జుట్టును నల్లగా కూడా చేయొచ్చు. ఇది జస్ట్ నిమిషాల్లోనే తెల్ల జుట్టును నల్లగా మార్చేస్తుంది. కాబట్టి మీరు దీని తెల్ల వెంట్రుకలకు పెట్టొచ్చు.

56
gray hair

మెహందీ

మెహందీ మన జుట్టుకు చేసే మేలు అంతా ఇంతా కాదు. ఇది జుట్టును బలంగా చేస్తుంది. అలాగే వెంట్రుకలు ఊడిపోకుండా చేస్తుంది. నెత్తిమీద చుండ్రును తగ్గించి ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. ముఖ్యంగా ఇది తెల్ల జుట్టు రాకుండా కూడా ఆపుతుంది. అలాగే తెల్లజుట్టును నల్లగా కనిపించేలా కూడా చేస్తుంది. మీ తెల్ల జుట్టును నేచురల్ గా నల్లగా మార్చాలనుకుంటే మెహందీ బెస్ట్ ఆప్షన్ అనే చెప్పాలి. దీన్ని మీ జుట్టుకు రెండు నుంచి మూడు గంటలు పెడితే మీ తెల్ల జుట్టు నల్లగా మారుతుంది.

66
gray hair

డ్రై షాంపూ

డ్రై షాంపూతో జుట్టును వాష్ చేస్తే మీ హెయిర్ రీఫ్రెష్ గా కనిపిస్తుంది. ముఖ్యంగా ఇది తెల్ల జుట్టుకు రంగును వేసి ఉపయోగిస్తే హెయిర్ కలర్ చెక్కు చెదరకుండా ఉంటుంది. మీరు హెయిర్ కలర్ ను వేసి వెంటనే డ్రై షాంపూతో జుట్టును రీఫ్రెష్ చేయొచ్చు.

ఐషాడో, ఐబ్రో పౌడర్

ఐషాడో, లేదా ఐబ్రో పౌడర్ తో కూడా మీరు తెల్ల వెంట్రుకలు కనిపించకుండా చేయొచ్చు. ఐబ్రో పౌడర్ లేదా ఐషాడో తెల్లి జుట్టు మూలాలను తక్షణమే నల్లగా చేయొచ్చు. అయితే ఇది ఎక్కువ సేపు మాత్రం ఉండదు. కాబట్టి అప్పటికప్పుడు తెల్ల వెంట్రకలు కనిపించకూదంటే మీరు దీన్ని వాడొచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories