జీర్ణ సమస్యలు ఉన్నవారు కూడా కొబ్బరి నీటిని తాగకూడదు. శ్వేతా షా చెబుతున్న ప్రకారం జీర్ణక్రియ బలహీనంగా ఉన్నవారికి, ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్ వంటి సమస్యలతో బాధపడుతున్న వారికి కొబ్బరి నీళ్లు సరిపడకపోవచ్చు. కొబ్బరినీళ్లు తాగాక వీరిలో జీర్ణ సమస్యలు రావచ్చు. ఇది కూడా పొట్ట ఉబ్బరం, గ్యాస్ట్రిక్ వంటి సమస్యలకు కారణం అవుతుంది. కాబట్టి కొబ్బరి నీరు తాగాక మీకు ఏమాత్రం అసౌకర్యంగా ఉన్నా ఆ నీటిని దూరంగా పెట్టడమే మంచిది. కొబ్బరి నీరు శరీరాన్ని చల్లబరుస్తుంది. శీతలీకరణ లక్షణాలను అధికంగా కలిగి ఉంటుంది. కాబట్టి జలుబు, దగ్గుతో బాధపడుతున్నవారు కొబ్బరినీటికి దూరంగానే ఉండాలి. లేకపోతే దీని శీతలీకరణ లక్షణాలు ఆ సమస్యలను మరింత పెంచేస్తాయి. శ్వాసకోశ వ్యాధులు వచ్చేలా చేస్తాయి. ముఖ్యంగా సైనస్ తో బాధపడుతున్న వారు కొబ్బరి నీటిని ఎంత తక్కువగా తాగితే అంత మంచిది.