Chicken: చికెన్ తింటే క్యాన్స‌ర్ వ‌స్తుందా.? ఇలా అయితే బ‌తికేది ఎలా..?

Published : Apr 29, 2025, 05:56 PM IST

ఆదివారం వ‌చ్చిందంటే చాలు ప్లేట్‌లో చికెన్ ఉండాల్సిందే. వారంలో ఒక్క‌సారైనా చికెన్ తినే వారు చాలా మంది ఉంటారు. చిల్లీ చికెన్, చికెన్ 65, చికెన్ మంచూరియా, చికెన్ బిర్యానీ ఇలా ర‌క‌ర‌కాల పేర్ల‌తో చికెన్‌ను లొట్ట‌లేసుకొని తింటుంటారు. అయితే చికెన్ అతిగా తిన‌డం వ‌ల్ల అనారోగ్య స‌మ‌స్య‌లు త‌ప్ప‌వ‌ని నిపుణులు చెబుతున్నారు. తాజాగా ప‌రిశోధ‌కులు నిర్వ‌హించిన అధ్య‌య‌నంలో సంచ‌ల విష‌యాలు వెలుగులోకి వ‌చ్చాయి.   

PREV
14
Chicken: చికెన్ తింటే క్యాన్స‌ర్ వ‌స్తుందా.? ఇలా అయితే బ‌తికేది ఎలా..?

చికెన్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంద‌ని తెలిసిందే. శ‌రీరానికి అవ‌స‌ర‌మైన ప్రోటీన్ల‌ను అందించ‌డంలో చికెన్ బెస్ట్ ఛాయిస్‌గా చెబుతుంటారు. అయితే తాజాగా ప‌రిశోధ‌కులు నిర్వ‌హించిన ఓ అధ్య‌య‌నంలో సంచ‌ల‌న విష‌యాలు వెలుగులోకి వ‌చ్చాయి. అతిగా చికెన్ తినే వారు జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. 
 

24
chicken dishes

ఇటలీలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ పరిశోధకుల అభిప్రాయం ప్రకారం, ఎక్కువగా చికెన్ తినడం ఆరోగ్యానికి ప్రమాదకరం. పరిశోధకుల అభిప్రాయం ప్రకారం, వారానికి 300 గ్రాముల కంటే ఎక్కువ చికెన్ తినేవారికి కడుపు, పేగు సంబంధిత వ్యాధులతో పాటు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

ఇప్ప‌టి వ‌ర‌కు నిపుణులు రెడ్ మీట్ క్యాన్స‌ర్‌కు కార‌ణ‌మ‌వుతుంద‌ని, చికెన్ మంచి ఎంపిక అని తెలిపారు. అయితే తాజా అధ్య‌య‌నంలో చికెన్ కూడా ఆరోగ్యానికి మంచిది కాద‌ని చెబుతున్నారు. 

34

చికెన్ ఎక్కువగా తినడం వల్ల జీర్ణ సంబంధిత క్యాన్స‌ర్ వ‌చ్చే అవ‌కాశం పెరుగుతుంద‌ని పరిశోధకులు చెబుతున్నారు. ప‌రిశోధ‌న‌ల్లో భాగంగా 20 ఏళ్ల‌లో 4,869 మంది పెద్దల డేటాను అధ్యయనం చేశారు.

వీరిలో చికెన్ ఎక్కువ‌గా తినే వారు అకాల మ‌ర‌ణం పొందార‌ని ప‌రిశోధ‌ల్లో తేలింది. అయితే, ప్రమాదం చికెన్ నాణ్యతలో ఉందా లేదా దానిని డీప్ ఫ్రై చేయడం, గ్రిల్ చేయడం వంటి వండే విధానంలో ఉందా అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు.
 

44

దీనిపై మరింత లోతుగా పరిశోధించాల్సిన అవసరం ఉందని పరిశోధకులు భావిస్తున్నారు. న్యూట్రియంట్స్ జర్నల్‌లో ప్రచురితమైన ఈ నివేదికలో, చికెన్ తినడం పట్ల జాగ్రత్తగా ఉండాలని నిపుణులు ప‌లు సూచ‌న‌లు చేశారు. వీటి ప్ర‌కారం చికెన్‌ను ప‌రిమితంగా తీసుకోవాలి.  మీ రోజువారీ ఆహారంలో పండ్లు, కూరగాయలు వంటి ఫైబ‌ర్ ఎక్కువ‌గా ఉండే ఫుడ్‌ను భాగం చేసుకోవాలి. ప్రాసెస్ చేసిన మాంసం లేదా డీప్ ఫ్రైడ్ చికెన్‌కు దూరంగా ఉండాలి. 

Read more Photos on
click me!

Recommended Stories