బరువు తగ్గడానికి ప్రయత్నించేటప్పుడు, ముఖ్యంగా తినేటప్పుడు మనం చేసే కొన్ని తప్పులు మరింత బరువు పెరగడానికి దారితీస్తాయి. బరువు తగ్గే ముందు, నిపుణుల సలహా తీసుకోవడం చాలా మంచిది.ముఖ్యంగా ఏదైనా ఆహారం తినే సమయంలో కొన్ని పొరపాట్లు చేయకూడదు.
టీ, స్నాక్స్ అలవాట్లు:
కొంతమందికి ఉదయం నిద్రలేచిన వెంటనే టీతో స్నాక్స్ తినే అలవాటు ఉంటుంది. ఇది సాంప్రదాయ అలవాటు అయినప్పటికీ, బరువు తగ్గాలనుకునే వారు ఈ విధంగా టీతో స్నాక్స్ తినడం మంచిది కాదు, ఇది శరీరంలో ఐరన్ శోషణను ప్రభావితం చేస్తుంది.కడుపులో ఎసిడిటీ పెరిగి,జీర్ణ సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. టీలోని టానిన్, కెఫిన్ బరువు పెరగడానికి కారణమవుతాయి.
అదేవిధంగా, కొంతమందికి అరటిపండ్లతో పాలు కలిపే అలవాటు ఉంటుంది. పాలు, అరటిపండ్లు రెండూ పోషకాలతో సమృద్ధిగా ఉంటాయి. వాటిని కలిపి తినడం కంటే 20 - 30 నిమిషాల విరామం వదిలి, విడిగా తినడం మంచిది. రెండూ కలిపి తినడం వల్ల వేగంగా బరువు పెరుగుతారు.