Chia Seeds Water : రోజూ పరిగడుపున చియా సీడ్ వాటర్ ను తాగొచ్చా?

Published : Sep 30, 2025, 06:46 PM IST

Chia Seeds Water :చియా సీడ్స్ ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిని తీసుకోవడం వల్ల కేవలం బరువు తగ్గుతామని అనుకుంటారు. కానీ ఈ వాటర్ ను రోజూ ఉదయాన్నే పరిగడుపున తాగడం వల్ల మరెన్నో ప్రయోజనాలను పొందుతారు. అవేంటంటే?

PREV
15
చియా సీడ్ వాటర్ బెనిఫిట్స్

మారిన లైఫ్ స్టైల్ వల్ల చాలా మంది ఎన్నో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అందుకే ఈ రోజుల్లో ఆరోగ్యంగా ఉండాలంటే ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి. ఆరోగ్యకరమైన ఆహారాల లీస్ట్ లో చియా సీడ్స్ కూడా ఉన్నాయి. 

ఈ చియా సీడ్స్ లో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, ప్రోటీన్లు, కాల్షియం వంటి ఎన్నో రకాల పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన బరువును తగ్గించడంతో పాటుగా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తాయి. అసలు రోజూ ఉదయాన్నే పరిగడుపున చియా సీడ్ వాటర్ ను తాగడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

25
చియా సీడ్ వాటర్ ను తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు

జీర్ణక్రియ మెరుగుపడుతుంది

చియా సీడ్ వాటర్ ను తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఈ చియా సీడ్స్ ను రాత్రంతా నానబెట్టడం వల్ల దీనిలోని ఫైబర్ కంటెంట్ వల్ల అవి జెల్ గా మారుతాయి. ఈ చియా సీడ్స్ వాటర్ ను ఉదయాన్నే పరిగడుపున తాగడం వల్ల పేగులు శుభ్రపడతాయి. అలాగే జీర్ణక్రియ ప్రక్రియ కూడా మెరుగుపడుతుంది. ఈ వాటర్ ను రోజూ తాగితే మలబద్దకం సమస్య తొలగిపోతుంది. అలాగే కడుపునకు సంబంధించిన సమస్యలు కూడా రావు.

35
బరువు తగ్గడానికి సహాయపడుతుంది

వెయిట్ లాస్ అవ్వాలనుకునేవారికి కూడా చియా సీడ్ వాటర్ ఎంతో సహాయపడుతుంది. ఎందుకంటే దీనిలో పుష్కలంగా ఉండే ఫైబర్ కంటెంట్ కడుపును ఎక్కువ సేపు నిండుగా ఉంచుతుంది. దీంతో మీకు తరచుగా ఆకలి కాకుండా ఉంటుంది. అంతేకాదు దీనిలో పోషకాలు ఎక్కువగా, కేలరీలు తక్కువగా ఉంటాయి. ఈ వాటర్ ను తాగడం వల్ల మీ శరీరానికి మంచి శక్తి అందుతుంది.

బలమైన ఎముకలు, దంతాలు

చియా సీడ్ వాటర్ లో మెగ్నీషియం, కాల్షియం, భాస్వరంలు పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ మన ఎముకల్ని, దంతాల్ని బలంగా ఉంచడానికి సహాయపడతాయి. ఈ వాటర్ ను రెగ్యులర్ గా తాగితే ఎముకల బలం తగ్గదు. అలాగే ఎముకలు బలహీనంగా, ఎముకలకు సంబంధించిన సమస్యలు వచ్చే ప్రమాదం తగ్గుతుంది.

45
ఆరోగ్యకరమైన గుండె

చియా వాటర్ ను తాగితే మన గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఈ సీడ్స్ లో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవే మన గుండెను హెల్తీగా ఉంచేందుకు సహాయపడతాయి. చియా సీడ్ వాటర్ ను రెగ్యులర్ గా తాగితే శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. అలాగే రక్తపోటు కూడా నియంత్రణలో ఉంటుంది. దీనివల్ల మీకు గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది.

55
చర్మానికి, జుట్టుకు మేలు

చియా సీడ్స్ వాటర్ ను తాగితే జుట్టు, చర్మం ఆరోగ్యంగా ఉంటాయి. ఈ వాటర్ లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన చర్మాన్ని ఫ్రీరాడికల్స్ నష్టం నుంచి కాపాడుతాయి. ఈ వాటర్ ను రోజూ ఉదయాన్నే పరిగడుపున చియా సీడ్ వాటర్ ను తాగితే చర్మం అందంగా మెరుస్తుంది. అలాగే జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. ఈ వాటర్ లోని ప్రోటీన్లు, ఖనిజాలు జుట్టును బలంగా చేస్తాయి. పొడుగ్గా పెరిగేందుకు సహాయపడతాయి.

Read more Photos on
click me!

Recommended Stories