Dosa : నూనె లేకుండా దోశను క్రిస్పీగా, టేస్టీగా చేయడం ఎలాగా?

Published : Sep 30, 2025, 04:50 PM IST

Dosa నూనె లేదా నెయ్యితోనే దోశను తయారుచేస్తుంటారు. వీటివల్లే దోశ టేస్టీగా, క్రిస్పీగా అవుతుందని చాలా మంది అనుకుంటారు. కానీ దోశ కానీ, నెయ్యి కానీ లేకుండా దోశను టేస్టీగా క్రిస్పీగా చేయొచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

PREV
15
నూనె లేకుండా దోశ

పిల్లలైనా, పెద్దలైనా ప్రతి ఒక్కరూ దోశను చాలా ఇష్టంగా తింటారు. అందుకే చాలా మంది ఇండ్లలో వారానికి మూడు నాలుగు సార్లు దోశనే మార్నింగ్ టిఫిన్ గా చేస్తుంటారు. కానీ ఇండ్లలో చేసే దోశ హోటల్, రెస్టారెంట్ స్టైల్లో రాదు. దీనికోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అలాగే నూనె లేదా నెయ్యి లేకుండా దోశను తయారేచేయరు. కానీ నూనె కానీ, నెయ్యిని కానీ వేయకుండా రెస్టారెంట్ స్టైల్ లో క్రిస్పీ, టేస్టీ దోశను తయారుచేయొచ్చు. ఇందుకోసం ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

25
నూనె లేకుండా పర్ఫెక్ట్ దోశను తయారుచేయడం ఎలా?

బ్యాటర్ ఎలా ఉండాలంటే?

నూనె లేకుండా దోశ పర్ఫెక్ట్ గా రావాలంటే దోశ పిండిని మరీ చిక్కగా లేదా పల్చగా లేకుండా చూసుకోవాలి. దోశ పిండి పెనానికి సులువుగా అంటుకునేలా చూసుకోవాలి. పిండి మరీ మరీ గట్టిగా ఉంటే దోశ మృదువుగా అవుతుంది. అదే మరీ పల్చగా ఉంటే దోశ చిరిగిపోతుంది. సరిగ్గా రాదు.

రవ్వను వాడండి

నూనె లేదా వెన్న లేకుండా దోశను తయారుచేయడానికి రవ్వ బాగా ఉపయోగపడుతుంది. ఇందుకోసం మీరు దోశపిండిలో ఒకటి రెండు టీ స్పూన్ల రవ్వను వేసి కలపండి. ఈ రవ్వ వల్ల దోశలు పెనానికి అంటుకోవు. చిరిగిపోవు. అలాగే క్రిస్పీగా కూడా వస్తాయి.

35
పెనం వేడి

దోశ పర్ఫెక్ట్ గా రావాలంటే పెనం వేడి కూడా చాలా ముఖ్యం. దోశను వేయడానికి ముందు పెనం బాగా వేడెక్కాలి. ఆ తర్వాత కొంచెం చల్లబర్చాలి. అలాగే దోశను మీడియం మంటమీదే కాల్చాలి. పెనం ఎక్కువ వేడిగా ఉంటే పిండి అంటుకుంటుంది. అలాగే పెనం మరీ చల్లగా ఉంటే పిండి పెనానికి సరిగ్గా వ్యాపించదు. అందుకే ఉష్ణోగ్రత సరిగ్గా ఉంటే దోశ బాగా కాలుతుంది. నూనె అవసరమే లేకుండా క్రిస్పీగా, టేస్టీగా ఉంటుంది.

45
పిండిని సరిగ్గా వ్యాపింజేయాలి

దోశ పిండిని పెనం మధ్యలో వేసి వెడల్పుగా అనాలి. మీరు పిండిని ఎంత వెడల్పుగా అంటే దోశ అంత సన్నగా, క్రిస్పీగా వస్తుంది. దోశను సన్నగా వేయడం వల్ల తొందరగా వేడి అవుతుంది. అలాగే క్రించీగా అవుతుంది.

55
ఆవిరితో ఉడికించాలి

మీరు దోశను తయారుచేయడానికి నూనెను వాడటం లేదు కాబట్టి ఆవిరితో దీన్ని ఉడికించండి. ఇందుకోసం మీరు పిండిని పెనం పై వేసి వెడల్పుగా అన్న తర్వాత దానిపై ఒకటి రెండు నిమిషాలు మూతపెట్టండి. దోశ ఉడికితే పెనం నుంచి సులువుగా వస్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories