Sprouted Potatoes: మొలకెత్తిన ఆలుగడ్డలు వండుకోవచ్చా? వాటిని తింటే జరిగేది ఇదే!

Published : Jun 04, 2026, 05:04 PM IST

Sprouted Potatoes: సాధారణంగా చాలా ఇళ్లలో ఆలుగడ్డలను ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేస్తుంటారు. కొన్ని రోజులకే వాటికి మొలకలు రావడం మనం చూస్తూనే ఉంటాం. అలా మొలకెత్తిన బంగాళదుంపను తినొచ్చా? తింటే ఏమవుతుందనే డౌట్ చాలామందిలో ఉంటుంది. ఇక్కడ క్లియర్ చేసుకుందాం. 

PREV
15
మొలకెత్తిన బంగాళదుంపలు తినొచ్చా?

ఇంట్లో నిల్వ చేసిన ఆలుగడ్డలకు కొంతకాలం తర్వాత మొలకలు రావడం సాధారణమే. అయితే ఇవి తినడం ఆరోగ్యానికి మంచిదా, కాదా? అనే డౌట్ చాలామందిలో ఉంటుంది. నిపుణుల ప్రకారం ఆలుగడ్డల్లో సోలనిన్, చాకోనిన్ అనే సహజ విష పదార్థాలు చాలా తక్కువ మోతాదులో ఉంటాయి. కానీ బంగాళదుంపలు మొలకెత్తినప్పుడు లేదా పచ్చగా మారినప్పుడు ఈ విషపదార్థాల మోతాదు పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే ఆలుగడ్డలను జాగ్రత్తగా పరిశీలించకుండా వాడకూడదని డాక్టర్లు సూచిస్తున్నారు.

25
ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం

ఆలుగడ్డలు మొలకెత్తినప్పుడు వాటిలో పోషక విలువలు తగ్గిపోవడంతో పాటు విషపదార్థాల స్థాయి పెరుగుతుంది. ముఖ్యంగా మొలక భాగంలో, పచ్చగా మారిన తొక్కలో సోలనిన్ ఎక్కువగా ఉంటుంది. ఈ కారణంగా వాటిని తిన్నప్పుడు కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. తక్కువ మోతాదులో తీసుకుంటే సాధారణంగా పెద్ద ప్రమాదం ఉండకపోవచ్చు. కానీ ఎక్కువగా లేదా తరచుగా తీసుకుంటే శరీరంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. అలాగే మొలకలు చాలా ఎక్కువగా వచ్చిన లేదా పచ్చటి రంగులోకి మారిన ఆలుగడ్డలను పడేయడం మంచిది.

35
ఫుడ్ పాయిజనింగ్ లక్షణాలు

మొలకెత్తిన ఆలుగడ్డలు తినడం వల్ల కొందరికి ఫుడ్ పాయిజనింగ్ లక్షణాలు కనిపించవచ్చు. వాంతులు, కడుపునొప్పి, విరేచనాలు, తలనొప్పి, తల తిరగడం, అలసట వంటి లక్షణాలు సాధారణంగా కనిపిస్తాయి. కొన్ని సందర్భాల్లో ఎక్కువ మోతాదులో తీసుకుంటే నాడీ వ్యవస్థపై ప్రభావం చూపే అవకాశం కూడా ఉంటుంది.

45
మొలకలు తీసేసి తినొచ్చా?

కొంతమంది మొలకలు తీసేసి, పచ్చగా ఉన్న భాగాన్ని తొలగించి వాడితే సురక్షితమని భావిస్తారు. కానీ నిపుణుల ప్రకారం ఇది పూర్తిగా నమ్మదగిన విధానం కాదు. ఎందుకంటే సోలనిన్ కేవలం మొలకలో మాత్రమే కాకుండా మొత్తం ఆలుగడ్డలో కొంతవరకు వ్యాపించి ఉండే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఎక్కువ కాలం నిల్వ చేసినప్పుడు ఈ ప్రభావం మరింత పెరుగుతుంది. అందుకే మొలకలు వచ్చిన ఆలుగడ్డలను ఎంత శుభ్రం చేసినా పూర్తిగా సేఫ్‌గా భావించలేము.

55
మొలకలు రాకుండా..

ఆలుగడ్డలను చల్లని, పొడి, చీకటి ప్రదేశంలో ఉంచితే మొలకలు రాకుండా కొంతవరకు నియంత్రించవచ్చు. సూర్యకాంతిలో లేదా తేమ ఎక్కువగా ఉన్న ప్రదేశంలో ఉంచితే అవి త్వరగా మొలకెత్తుతాయి. అలాగే ఎక్కువ కాలం నిల్వ చేయడం కూడా ఈ సమస్యను పెంచుతుంది. అందుకే అవసరానికి తగ్గట్టే ఆలుగడ్డలను కొనుగోలు చేసి తక్కువ సమయంలో వాడటం ఉత్తమం.

Read more Photos on
click me!

Recommended Stories