Weight Loss: బరువు తగ్గాలని తినడం మానేస్తున్నారా? అయినా కూడా బరువు తగ్గడం లేదా? దాని వెనక కారణం ఏంటో తెలుసా? నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసా? అసలు ఎలాంటి తప్పులు చేయడం వల్ల బరువు తగ్గడం లేదో మీకు తెలుసా?
ఈ రోజుల్లో బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నవారు చాలా మంది ఉన్నారు. ఈ బరువు తగ్గించుకోవడం కోసం దాదాపు అందరూ ఆహారం తీసుకోవడం మానేస్తారు. అలా మానేసినా కూడా తాము బరువు తగ్గడం లేదని ఫీలయ్యేవారు కూడా ఉంటారు. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా బరువు తగ్గడం లేదు అంటే... అందుకు మీరు చేసే తప్పులే కారణం కావచ్చు. తెలిసీ తెలియక చేసే కొన్ని తప్పుల కారణంగా బరువు తగ్గకపోగా.. ఇంకా పెరుగుతూ ఉంటారు. మరి ఎలాంటి తప్పులు చేయకూడదో తెలుసుకుందాం...
26
చాలా తక్కువ తినడం...
ప్రారంభంలో మీ రోజువారీ కేలరీలను తీవ్రంగా తగ్గించడం పెద్ద తప్పు. వెంటనే ఫలితాలను చూడటానికి ఇది ఒక సత్వరమార్గంగా అనిపించొచ్చు. చాలా తక్కువ తినడం వల్ల మీ జీవక్రియ నెమ్మదిస్తుంది. అలసట, మానసిక స్థితి కల్లోలం లేదా తల తిరుగుతుంది. సరైన పోషకారం, ముఖ్యంగా ప్రోటీన్, హెల్దీ ఫ్యాట్స్, కూరగాయలు ఉండేలా భోజనం తీసుకోవాలి. అప్పుడే బరువు తగ్గుతారు.
36
భోజనం తినకుండా ఉండటం...
బరువు తగ్గాలని చాలా మంది భోజనం చేయడం మానేస్తారు. కానీ, వాస్తవానికి భోజనం స్కిప్ చేయడం వల్ల మీ ఆకలి పెరుగుతుంది. ఫలితంగా ఆ ఆకలి తీర్చుకోవడానికి చాలా ఎక్కువ తినేస్తూ ఉంటాం. అంతేకాదు... జంక్ ఫుడ్ తినడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తాం. అందుకే.. భోజనం స్కిప్ చేయకూడదు. మరీ ముఖ్యంగా బ్రేక్ ఫాస్ట్ తినకుండ అస్సలు ఉండకూడదు. ఆరోగ్యకరమైన అల్పాహారం తీసుకోవాలి. ఇలా చేయడం జీవక్రియ పెరుగుతుంది. రోజంతా ఎనర్జిటిక్ గా ఉండటానికి సహాయపడుతుంది. కోడి గుడ్లు, ఓట్ మీల్ లేదా పండ్లను తీసుకోవాలి.
తక్కువ కొవ్వు లేదా చక్కెర లేనివి అని చెప్పే ప్రతిదీ మీకు మంచిది కాదు. చాలా స్నాక్స్ , పానీయాలు కృత్రిమ పదార్థాలను కలిగి ఉంటాయి. వాటిలో పోషక విలువలు తక్కువగా ఉంటాయి. ఇవి కొన్నిసార్లు ఆకలిని పెంచుతాయి. బదులుగా విత్తనాలు, కూరగాయలు, పండ్లు వంటి ఆహారాలను ఎంచుకోవడం మంచిది.
56
తగినంత నీరు త్రాగకుండా ఉండటం:
నీరు శరీరంలోని టాక్సిన్స్ బయటకు పంపడానికి, మీ జీవక్రియను నియంత్రించడానికి, మీ ఆకలిని అణచివేయడానికి సహాయపడుతుంది. అయితే, ఆహారం లేదా వ్యాయామంపై దృష్టి సారించే మహిళలు తరచుగా తగినంత నీరు త్రాగడాన్ని విస్మరిస్తారు. కొన్నిసార్లు, దాహాన్ని కూడా ఆకలిగా తప్పుగా భావించవచ్చు. అందువల్ల, భోజనానికి ముందు ఒక గ్లాసు నీరు తాగడం వల్ల అతిగా తినడం నివారించవచ్చు.
66
వెంటనే ఫలితాలు రావాలని కోరుకోవడం...
చాలా మంది రెండు వారాల్లో ఫలితాలు కనిపించకపోతే చేసే పనిని ఆపేస్తారు. ఇవి ఫాలో అయినా వేస్ట్ బరువు తగ్గము అనే భ్రమలో పడిపోయి ఆ పని చేయడం ఆపేస్తారు. ఇలా చేయడం వల్ల కూడా మీరు బరువు తగ్గరు. ఏ పని చేసినా కనీసం నెల, రెండు నెలలు కంటిన్యూస్ గా ఫాలో అయితే.. అప్పుడు మీరు కోరుకున్న ఫలితాలు కనపడతాయి.