నిమ్మరసం కిడ్నీలకు మంచిదా? కాదా?

Published : Oct 27, 2021, 01:39 PM IST

మూత్రపిండ వ్యాధిగ్రస్తుల విషయానికి వస్తే... ఏం తినాలి? ఏం తాగాలి? వేటికి దూరంగా ఉండాలి? అనే విషయంలో చాలా గందరగోళం ఉంటుంది. ఈ క్రమంలోనే చాలామంది lemon water గురించి తరచుగా వైద్యులని అడుగుతుంటారు. 

PREV
18
నిమ్మరసం కిడ్నీలకు మంచిదా? కాదా?
lemon water

నిమ్మకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది, ఇది కాల్షియం శోషణను మెరుగుపరుస్తుంది, bone densityని కాపాడడానికి ఎంతో ముఖ్యమైనది. నిమ్మకాయరసం చాలామందికి ఇష్టం. దీన్ని రిఫ్రెష్ డ్రింక్ గా తాగుతారు.

28
Kidney

ఇక మూత్రపిండ వ్యాధిగ్రస్తుల విషయానికి వస్తే... ఏం తినాలి? ఏం తాగాలి? వేటికి దూరంగా ఉండాలి? అనే విషయంలో చాలా గందరగోళం ఉంటుంది. ఈ క్రమంలోనే చాలామంది lemon water గురించి తరచుగా వైద్యులని అడుగుతుంటారు.  Kidney disease ఉన్నవారికి ఇదో పెద్ద విషయంగా మారుతుంది.

38

మూత్రపిండాల వ్యాధికి నిమ్మరసం మంచిదా?

రక్తంలోని టాక్సిన్స్, వ్యర్థాలను విసర్జించే పనిని మూత్రపిండాలు నిర్వహిస్తాయి. రక్తపోటును నియంత్రించడంలో, ఎముకల ఆరోగ్యాన్ని నియంత్రించడంలో, క్రియేటినిన్, యూరిక్ యాసిడ్ వంటి రసాయనాల స్థాయిలను నిర్వహించడంలో మూత్రపిండాలు చక్కటి పాత్ర పోషిస్తాయి.

48

మూత్రపిండాలు రక్తాన్ని ఫిల్టర్ చేయలేకపోవడాన్ని దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి అంటారు, అంటే టాక్సిన్స్, వ్యర్థ పదార్థాలు రక్తంలో built-upగా ఉంటాయి. దీనివల్ల స్ట్రోక్, గుండె జబ్బులు వంటి ప్రమాదకరమైన ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది.

విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు, సిట్రిక్ యాసిడ్ పుష్కలంగా ఉండే నిమ్మరసం తాగడం వల్ల దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి రోగులకు ఎటువంటి ప్రమాదం ఉండదు.

58

నిమ్మరసం క్రియాటినిన్‌ను తగ్గిస్తుందా?

నిమ్మకాయరసం క్రియేటినిన్ స్థాయిలను తగ్గించదు. కానీ Creatinine levels పెరగకుండా సాయపడుతుంది. క్రియేటినిన్ అనేది ఒక వ్యర్థ రసాయన ఉత్పత్తి, ఇది కండరాలు అరిగిపోయేలా చేస్తుంది. దెబ్బతినేలా చేస్తుంది. కండరాలు ఎక్కువగా ఉన్న వ్యక్తుల్లో రక్తంలో క్రియేటినిన్ ఎక్కువగా ఉంటుంది.

68

కిడ్నీలు క్లియర్ చేసే క్రియాటినిన్ పరిమాణాన్ని క్రియాటినిన్ క్లియరెన్స్ అంటారు. ఆరోగ్యవంతమైన వ్యక్తిలో, క్రియేటినిన్ స్త్రీలలో నిమిషానికి 95 ml, పురుషులలో 120 ml వరకు ఉంటుంది. క్రియేటినిన్ క్లియరెన్స్ వయస్సు, పరిమాణం, మూత్రపిండాల పరిస్థితిపై కూడా ఆధారపడి ఉంటుంది. నిమ్మరసం తీసుకోవడం వల్ల క్రియాటినిన్ స్థాయిలను పెంచడం లేదా తగ్గించడం సాధ్యం కాదు.

78
kidney

నిమ్మకాయ కిడ్నీకి చెడ్డదా?
నిమ్మరసం తాగడం వల్ల దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధిగ్రస్తుల పరిస్థితి మరీ దిగజారిపోదు. అయితే ఎక్కువ తీసుకుంటే.. కొన్ని ఇతర ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. ఎక్కువ నిమ్మరసం తాగితే వికారం, విరేచనాలు, వాంతులు అవుతాయి. మూత్రవిసర్జనగా కూడా పెరుగుతుంది. అంటే శరీరంలోని ద్రవాల విసర్జనను పెంచుతుంది, దీని ఫలితంగా తరచుగా వాష్ రూంకు వెళ్లాల్సి వస్తుంది. 

88

ఎప్పుడు తాగాలి..?

నిమ్మరసం తాగడానికి సరైన సమయం లేదు. ఇది శరీరంలో ఆల్కలీన్ వాతావరణాన్ని ఏర్పరుస్తుంది. అందుకే ఉదయం పూట తాగితే చాలా మంచిి.

ఉదయాన్నే నిద్ర లేచిన తరువాత మీ శరీరం detoxifying అయి ఉంటుంది. దీంతో ఆల్కలీన్ ఉన్న నిమ్మరసం తాగడం వల్ల pH సమతుల్యతను కాపాడుకోవడంలో సహాయపడుతుంది.

నిమ్మరసాన్ని ఊరికే కాకుండా అల్లం, తేనెతో కలిపి తాగొచ్చు. దీంట్లోని యాంటీఆక్సిడెంట్, యాంటీమైక్రోబయాల్ కంటెంట్‌లు మూత్రపిండాల ఆరోగ్యకరమైన పనితీరుకు మద్దతు ఇస్తాయి.

ఒంటరిగా బతకాలనే కోరిక పెరిగిపోతుందా..?

Read more Photos on
click me!

Recommended Stories