దీపావళి గిఫ్ట్స్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఇది మీ కోసమే...

First Published Oct 27, 2021, 12:44 PM IST

సాధారణంగా దీపావళి అనగానే ముందుగా పేనీలు, స్వీటుబాక్సులు గుర్తుకువస్తాయి. ఎక్కువగా వీటినే గిఫ్ట్ లుగా ఇస్తుంటారు. అయితే ఈ సారి దీపావళికి కాస్త కొత్తగా ట్రై చేయండి. వారు ఊహించని గిఫ్ట్ లతో సర్ ఫ్రైజ్ చేయండి. 

పండుగల సీజన్ అందర్నీ ఉత్సాహంగా ఉంచుతుంది. ఇంటి అలంకరణ, కొత్త బట్టలు, బంధువులు, స్నేహితులకు బహుమతులు ఇవ్వడం.. పిండివంటలు, పటాకులు, స్వీట్లు.. పువ్వులు, దీపకాంతులు వెరసి పూర్తి హడావుడిగా, ఆహ్లాదంగా సాగుతుంది.

ఇక దీపావళి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. కోటికాంతులతో ఆశల చివుర్లు వేయిస్తూ.. ఆనందాల వెలుగులను విరజిమ్ముతుంది. దీపావళి అనగానే కొత్తబట్టలు, తీపి వంటకాలు, పటాకులే గుర్తుకువస్తాయి. ఇక ఈ పండుగకు మనకిష్టమైనవారితో కలిసి చిచ్చుబుడ్లు, తారాజువ్వలు, కాకరొత్తులు, బాంబులు పేల్చడంతో పాటు.. వారికి అందమైన బహుమతులు అందించి సంతోషపెట్టడమూ ఓ సంప్రదాయమే.

సాధారణంగా దీపావళి అనగానే ముందుగా పేనీలు, స్వీటుబాక్సులు గుర్తుకువస్తాయి. ఎక్కువగా వీటినే గిఫ్ట్ లుగా ఇస్తుంటారు. అయితే ఈ సారి దీపావళికి కాస్త కొత్తగా ట్రై చేయండి. వారు ఊహించని గిఫ్ట్ లతో సర్ ఫ్రైజ్ చేయండి. 

Prewedding skin care tips

అందాన్ని మరింత పెంచేలా..
మీ స్నేహితులు, ప్రియమైనవారి చర్మ సంరక్షణకు ప్రత్యేకంగా లోషన్లు, క్రీములు లాంటి బ్యూటీ ప్రొడక్ట్స్ లేదా మేకప్ కిట్ ఇవ్వడం మంచి ఎంపిక. ఇది వారిని మీరు ఎంత ప్రత్యేకంగా చూస్తున్నారో చెబుతోంది. 

ఈ రోజుల్లో చర్మ సంరక్షణ అనేది ప్రతీ ఒక్కరి డైలీ లైఫ్ లో భాగం అయిపోయింది. అందుకే ఈ పండుగ సీజన్‌లో అందించడానికి personalised చేసిన ఇలాంటి బహుమతి కంటే మెరుగైనది ఏదీ ఉండదు. 

పెర్ఫ్యూమ్
ఒకవేళ skin care products విషయంలో మీకేదైనా అనుమానం ఉన్నా.. వారి చర్మ తత్వం గురించి పెద్దగా మీకు అవగాహన లేకుంటే మరో మంచి ఎంపిక పెర్ఫ్యూమ్. 

చక్కటి సువాసనలు వెదజల్లే Perfumeను ఇష్టపడని వారు ఉండరు. ఇందులోనూ చక్కటి బ్రాండ్స్ ఎంచుకుని గిఫ్ట్ గా ఇస్తే నిజంగానే చాలా సర్ ఫ్రైజ్ అవుతారు. అంతేకాదు మీ మీద చక్కటి ఇంప్రెషన్ కూడా వస్తుంది. చాలాసార్లు Gifts అనగానే ఏమివ్వాలో అర్థం కాదు.. అలాంటి గందరగోళ పరిస్థితుల్లో ఇది పనికివస్తుంది. 

పండుగ అంటేనే డైటింగ్ లు, ఆహారనియమాలు వదిలేసి కడుపునిండా హాయిగా ఇష్టమైనవి లాగించడమే....అయితే, గిఫ్ట్ ఇవ్వడానికి ఇలాంటి ఫుడ్ ఎంపికలు బాగానే ఉంటాయి. అయితే ఇందులోనూ మీదైన ముద్ర వేసేలా.. ఆర్గానిక్ ఫుడ్, హెల్తీ స్నాక్స్, స్వీట్స్ ను ఇవ్వొచ్చు. 

చాక్లెట్స్ నుంచి మొదలు పెట్టి డ్రై ఫ్రూట్స్ లడ్డూ వరకు.. ఏదైనా సరే మీకిష్టమైనదాన్ని బహుమతిగా ఇవ్వండి. 

జిలేబీ , పాలు కలిపి తీసుకుంటే.. శృంగారంలో రెచ్చిపోవచ్చా..?

click me!