ఉల్లిపాయలపై బ్లాక్ గా ఉండే మచ్చలు కనిపిస్తూ ఉంటాయి. వాటిని నీటిలో కడిగేసి తర్వాత ఉల్లిపాయను కోసి వండుతారు. అయితే ఈ బ్లాక్ ఫంగస్ మనకు ప్రమాదమా? తింటే ఏమవుతుంది?
ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదని అంటారు. అలాంటి ఉల్లిపాయలపై ఇప్పుడు బ్లాక్ ఫంగస్ ఎక్కువైపోయింది. వాటిని కొన్నాక తొక్క తీసి ఆ బ్లాక్ ఫంగస్ ను నీటిలో వేసి శుభ్రంగా కడిగి తిరిగి వాడుతున్నాము. ఒక్కొక్కసారి అలా కడిగే అవకాశం లేనప్పుడు శుభ్రం చేయకుండానే వంటల్లో వాడినప్పుడు ఆ బ్లాక్ ఫంగస్ ఏం చేస్తుంది? అది మన శరీరానికి ఎలాంటి హాని చేస్తుంది?
25
ఉల్లిపాయలు ఎందుకు తినాలి?
బిర్యానీ నుంచి కూరల వరకు అన్నింట్లో ఉల్లిపాయ పడాల్సిందే. అప్పుడే గ్రేవీ చిక్కగా వస్తుంది. అలాగే అన్నంతో పాటు ఉల్లిపాయలు కలిసి ఆరోగ్యాన్ని అందిస్తాయి. ఉల్లిపాయలు డయాబెటిస్ రోగులకు ఎంతో మేలు చేస్తాయి. రక్తంలో చక్కర స్థాయిలను స్థిరంగా ఉండేలా చేస్తాయి. పేగు కదలికలను కూడా చురుకుగా మార్చి మలబద్ధకం వంటి సమస్యలు రాకుండా అడ్డుకుంటాయి. రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అంతేనా కళ్ళ సమస్యలు, గొంతు సమస్యలు, జలుబు వంటివి రాకుండా అడ్డుకుంటాయి. కాబట్టి ఉల్లిపాయలను కచ్చితంగా తినాల్సిందే. అయితే ఉల్లిపాయలపై వచ్చే నల్ల మచ్చలు సంగతి ఏంటి? వాటివల్ల మనకు ప్రమాదమా?
35
నల్లమచ్చలతో ప్రమాదం
ఉల్లిపాయలే కాదు కొన్ని రకాల కూరగాయలు పండ్లపై కూడా ఇలాంటి బ్లాక్ ఫంగస్ కనిపిస్తుంది. దీన్ని ఆస్పర్ గిల్లస్ నైగర్ అని పిలిచే శిలీంధ్రాల వల్ల ఈ నల్ల మచ్చలు ఏర్పడతాయి. నిజానికి ఇవి ప్రమాదకరమైనవి కావని అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే కొంతమందిలో మాత్రం ఇలా నల్ల మచ్చలు ఉన్న ఉల్లిపాయలు శుభ్రం చేయకుండా తింటే రియాక్షన్ రావచ్చు. ముఖ్యంగా అలెర్జీ వచ్చే అవకాశం ఉంది. వాంతులు, వికారం, కడుపునొప్పి, తలనొప్పి వంటివన్నీ కనిపించవచ్చు.
ఆస్తమా ఉన్నవారు ఇలాంటి నల్లటి మచ్చలు ఉన్న ఉల్లిపాయలకు దూరంగా ఉండాలి. వారికి వీటివల్ల ఎక్కువ ప్రమాదం జరుగుతుంది. వారికున్న అలెర్జీ మరింతగా పెరిగిపోయే అవకాశం ఉంది. కాబట్టి నల్ల మచ్చలు మరీ అధికంగా ఉంటే అలాంటి ఉల్లిపాయలను తినకపోవడమే మంచిది. లేదా నీటిలో నానబెట్టి తర్వాత చేత్తో రుద్ది కడగాలి. అప్పుడే నల్ల మచ్చలు త్వరగా తొలగిపోతాయి. లేకుంటే ఆహార పదార్ధాలతో కలిసి ఆ నల్ల బ్లాక్ ఫంగస్ ఆహారాన్ని విషపూరితంగా చేయవచ్చు.
55
ముందుగా శుభ్రపరిచాకే
ఉల్లిపాయలే కాదు ఏ కూరగాయలనైనా వాడే ముందు నీటిలో పావుగంట సేపు నానబెట్టి ఆ తర్వాత చేతితో రుద్ది అప్పుడు వండేందుకు సిద్ధం అవ్వండి. నల్ల మచ్చలు ఉన్న ఉల్లిపాయలు అన్నింటినీ పడేయాల్సిన అవసరం లేదు. పావుగంట సేపు నీటిలో నానబెట్టి వాటిని శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. నల్ల మచ్చలు ఉంటున్నాయని ఉల్లిపాయల్ని మాత్రం దూరంగా పెట్టవద్దు. అవి మన ఆరోగ్యానికి ఎంతో అవసరం. ఉల్లిపాయల్లో చలవ చేసే గుణం అధికంగా ఉంటుంది.