Second Heart: శరీరంలో ఈ అవయవం మన రెండవ గుండె.. కాపాడుకోకపోతే మొదటి గుండెకు కష్టమే

Published : Sep 01, 2025, 02:47 PM IST

శరీరంలో గుండె ఎంతో ముఖ్యమైనదని అందరికీ తెలుసు. గుండె ఆరోగ్యం క్షీణిస్తే శరీరం మొత్తం కూలబడిపోతుంది. అలాగే మన శరీరంలో రెండవ గుండెగా పిలుచుకునే భాగం కాళ్లలో ఉండే ‘కాఫ్ మజిల్స్’. దీన్నే దూడ కండరం అని కూడా పిలుస్తారు. 

PREV
14
రెండవ గుండె ఇదే

మన శరీరంలో ఎన్ని గుండెలు ఉంటాయి? అని అడిగితే అందరూ ఒకటే అని చెబుతారు. కానీ వైద్య పరంగా మాత్రం మనకి రెండు గుండెలు. ఒక గుండె ఛాతీకి దగ్గరలో ఉంటే మరొకటి కాలికి దగ్గరలో ఉంటుంది. కాలులో ఉండే కాఫ్ మజిల్స్ ని రెండవ గుండే అని పిలుచుకుంటారు. వైద్యులు చెబుతున్న ప్రకారం కాలిలో ఉన్న కాఫ్ మజిల్స్ లేదా దూడ కండరాలను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. లేకుంటే మన అసలైన గుండె కూడా ప్రమాదంలో పడుతుంది. కాఫ్ మజిల్స్ కు గుండెకు ఎంతో అనుబంధం ఉంది.

24
కండరాలకు గుండెకు ఏమిటి సంబంధం?

కాలిలో ఉన్న దూడ కండరాలను ఏదైనా సమస్య మొదలైతే ఛాతీలో ఉన్న అసలైన గుండెకు కూడా పెద్ద సమస్య వచ్చి పడుతుంది. అందుకే దూడ కండరాలను జాగ్రత్తగా చూసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. ఎందుకంటే ఈ కండరాలు రక్తప్రసరణలో ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. అందుకే వీటిని కూడా గుండెతో సమానంగా కాపాడుకోవాల్సిన అవసరం ఉందని వైద్యులు చెబుతున్నారు. మనం అడుగు వేసినప్పుడల్లా కండరాలు సంకోచించి రక్తాన్ని ఛాతీ దగ్గరున్న గుండె వైపుకు వెళ్లేలా నెట్టివేస్తాయి. దూడ కండరాలు కాళ్ల వైపుగా వచ్చిన రక్తప్రసరణను తిరిగి గుండె వైపుగా పంపించడానికి సహాయపడతాయి. అలాగే రక్తం గడ్డ కట్టకుండా కూడా అడ్డుకుంటాయి.

34
కాఫ్ మజిల్స్ సరిగా పనిచేయకపోతే

కాళ్లలో ఉన్న దూడ కండరాలు బలహీనపడితే పాదాల వైపుగా వచ్చే రక్తం గుండె వైపుకు తిరిగి పంపడం కష్టం అయిపోతుంది. అలాంటప్పుడు గుండెకు రక్తప్రసరణ తగ్గిపోతుంది. గుండె మరింతగా ఎక్కువగా పంప్ చేయాల్సి వస్తుంది. దీనివల్ల దానిపై తీవ్ర ఒత్తిడి పెరుగుతుంది. అక్కడ ఇన్ష్లమేషన్ కూడా రావచ్చు. రక్తపోటు కూడా పెరిగిపోవచ్చు. అలాంటి సమయంలో గుండెకు సమస్యలు వస్తాయి. గుండె ఆగిపోయే ప్రమాదం పెరుగుతుంది. దీన్ని మందులతో నయం చేయడం కూడా కష్టం.

44
ఏం చేయాలి?

కాలిలో ఉన్న కాఫ్ మజిల్స్ సరిగా పనిచేయకపోతే గుండెకు ఎన్ని సమస్యలు వస్తాయో తెలుసుకున్నారు కదా.. అందుకే ఆ కండరాలను బలోపేతం చేయడానికి మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. గంటల తరబడి కూర్చోవడం వంటి పనులు చేయకూడదు. ఆధునిక జీవనశైలి వల్ల చాలామంది గంటలు తరబడి కూర్చుంటున్నారు. అప్పుడప్పుడు లేచి నడుస్తూ ఉండాలి. మెట్లు ఎక్కడం, దిగడం వంటివి చేయాలి. లేకుంటే దూడ కండరాలు బలహీనంగా మారి గుండెను కూడా ప్రభావితం చేస్తాయి. దానివల్ల గుండె కూడా బలహీనంగా మారవచ్చు. అలాగే ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం మాత్రం మరచిపోవద్దు. మన మొదటి గుండెను కాపాడుకోవాలంటే రెండో గుండెను రక్షించుకోవాలి.

Read more Photos on
click me!

Recommended Stories