దానిమ్మ తొక్కతో ఇన్ని లాభాలా..!

Published : Oct 30, 2022, 10:47 AM IST

దానిమ్మ పండే కాదు.. దాని తొక్క కూడా మన ఆరోగ్యానికి ఎన్నో విధాలా మేలు చేస్తుంది. ఈ తొక్కలు చర్మం, జుట్టు, గుండెకు ప్రయోజనకరంగా ఉంటాయి.   

PREV
17
దానిమ్మ తొక్కతో  ఇన్ని లాభాలా..!

దానిమ్మ పండులో ఎన్నో పోషకవిలువలుంటాయి. ఈ పండును తినడం వల్ల బరువు తగ్గడం నుంచి ఇమ్యూనిటీ పవర్ పెరగడం వరకు ఎన్నో ప్రయోజనాలను పొందుతాం. అందుకే ఈ పండును రోజూ తినాలని డాక్టర్లు, ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. ఈ పండు అనారోగ్యంతో ఉన్నవారికి దివ్య ఔషదం లాంటిది. దీన్ని చాలా రోజుల నుంచి తింటూ ఉంటే మీ శరీరంలో రక్తానికి కొరతే ఉండదు. దానిమ్మ  పండే కాదు దీని తొక్కలు కూడా మనకు ఉపయోగపడతాయి. ఎన్నో సమస్యలను నయం చేస్తాయి. అవేంటో తెలుసుకుందాం పదండి. 

27

క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది

దానిమ్మ తొక్కలు చర్మ క్యాన్సర్ ప్రమాదాన్ని చాలా వరకు తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు హానికరమైన యూవీఏ కిరణాల నుంచి కూడా మన చర్మాన్ని రక్షిస్తాయి. దీనికోసం దానిమ్మ తొక్కల పొడిని క్రీమ్ లో లేదా లోషన్ లో కలిపి యూజ్ చేయొచ్చు. దీన్ని ముఖానికి అప్లై చేయడం వల్ల ముడతలు తగ్గిపోతాయి. ముఖం కాంతివంతంగా మెరిగిసిపోతుంది. 
 

 

37

నోటి దుర్వాసన, చిగుళ్ల వాపు నుంచి ఉపశమనం

ఒక గ్లాస్ నీటిని తీసుకుని అందులో దానిమ్మ తొక్కల పొడిని కలిపి నోట్లో పోసుకుని పుక్కిలిస్తే నోటి నుంచి చెడు వాసన రాదు. అలాగే చిగుళ్ల వాపు నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. ఈ నీటితో పుక్కిలిస్తే నోట్లో ఉండే బొబ్బలు కూడా కొన్ని రోజుల్లోనే నయమవుతాయి. 
 

47

కొలెస్ట్రాల్ తగ్గుతుంది

దానిమ్మ తొక్కల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మీకు తెలుసా దానిమ్మ తొక్కలు శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ ను కూడా తగ్గిస్తాయి. అలాగే ఒత్తిడి నుంచి కూడా ఉపశమనం కలిగిస్తాయని నిపుణులు చెబుతున్నారు. 
 

57

దానిమ్మ పొడిని తయారుచేయడానికి ముందుగా.. దానిమ్మ తొక్కలను తీసి  బాగా ఎండబెట్టండి. ఆ తర్వాత వాటిని మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోండి. ఈ పొడిని గాలి వెళ్లని డబ్బాలో నిల్వ చేసుకోండి.  ఈ పొడి వల్ల పీరియడ్స్ నెల నెలకు ఖచ్చితంగా అవుతాయి. అలాగే కడుపు నొప్పి కూడా తగ్గిపోతుంది. 
 

67

కొబ్బరి నూనెను గోరు వెచ్చగా చేసి, అందులో కొద్దిగా దానిమ్మ తొక్కల పొడిని కలిపి తలకు పెట్టి.. 15 నిమిషాల తర్వాత స్నానం చేస్తే.. చుండ్రు పూర్తిగా తొలగిపోతుంది. ఈ పొడిలో కొన్ని నీళ్లు పోసి పేస్ట్ లా చేసి గాయాలకు, పుండ్లకు పెట్టాలి. దీనివల్ల అవి తొందరగా మానిపోతాయి. 

77

ఈ తొక్కలు మొటిమలను కూడా తగ్గించడానికని సహాయపడతాయి. ఇందుకోసం ఈ పౌడర్ లో నీళ్లు పోసి పేస్ట్ గా తయారుచేయాలి. దీన్ని ముఖానికి అప్లై చేయాలి. 20 లేదా 30 నిమిషాల తర్వాత ముఖాన్ని కడగాలి. ఇలా తరచుగా చేస్తుంటే కొన్నిరోజుల్లోనే మొటిమలు పూర్తిగా తగ్గిపోతాయి. 

Read more Photos on
click me!

Recommended Stories