సాధారణంగా మహిళలు ఇంట్లోని బల్లులను చూసి భయపడిపోతున్నారా..? వాటిని తరిమేందుకు నానా రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే వాారికి బల్లుల వల్ల ప్రయోజనాలు తెలిస్తే ఈ ప్రయత్నాలు వెంటనే ఆపేస్తారు.
Lizards : ఇంట్లో బల్లులు ఉండటం కొందరు ప్రమాదకరంగా, మరికొందరేమో అశుభంగా భావిస్తుంటారు. అందుకే వాటిని ఇంట్లోంచి తరిమికొట్టేందుకు నానా రకాలుగా ప్రయత్నిస్తుంటారు. కానీ ఈ బల్లుల వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి... వాటిగురించి తెలిస్తే మీరు అస్సలు వాటిని ఇంట్లోంచి తరిమే ప్రయత్నం చేయరు సరికదా కనిపిస్తే ఆనందిస్తారు. ఇలా బల్లుల వల్ల లాభాలేమిటో ఇక్కడ తెలుసుకుందాం.
25
బల్లులతో భలే లాభాలు
సాధారణంగా ప్రతి ఇంట్లోనూ బల్లులు ఉంటాయి... కొన్ని ఇళ్లలో గోడలు, పైకప్పులు, మూలలు, ఫోటో ప్రేముల వెనకాల ఎక్కువగా కనిపిస్తుంటాయి. మరికొన్ని ఇళ్లలో చీకటి ప్రాంతాల్లో దాక్కుని ఉంటాయి. ఈ బల్లులే ఇంటిని పరిశుభ్రంగా ఉంచి అక్కడ నివాసముండే వారి ఆరోగ్యాన్ని కాపాడతాయి. మరీముఖ్యంగా చిన్నారులు, ముసలివారి ఆరోగ్యాన్ని కాపాడటంలో బల్లులు ముఖ్యపాత్ర పోషిస్తాయి.
35
బల్లులు నేచురల్ క్రిమిసంహారకాలు
బల్లులు గోడలపై తిరుగుతూ ఈగలు, దోమలు, బొద్దింకలు, సాలెపురుగులు వంటి అనారోగ్యకరమైన కీటకాలను తింటాయి... ఇలా సహజ కీటక నియంత్రకాలుగా పనిచేస్తాయి. దీనివల్ల ఇంట్లో కీటకాల నివారణకు హానికరమైన పురుగుమందులు స్ప్రే చేయాల్సిన అవసరం ఉండదు. తద్వారా ఇంటి మెయింటెనెన్స్ ఖర్చు తగ్గుతుంది.. దీంతో కుటుంబ ఆరోగ్య ఖర్చు తగ్గుతుంది.
మీరు ఏ ఇంటినైనా గమనించండి... బల్లులు ఎక్కువగా ఉంటే పరిశుభ్రంగా ఉండి వాతావరణం ఆరోగ్యంగా ఉంటుంది. ఇంట్లోకి ప్రవేశించే కీటకాల సంఖ్యను బల్లులు తగ్గిస్తాయి కాబట్టే ఈ వాతావరణం. ఆహార పదార్థాల్లో కూడా కీటకాలు పడకుండా బల్లులు కాపాడతాయి. అయితే కీటకాల కోసం వచ్చి ఒక్కోసారి బల్లులు కూడా వంటకాల్లో పడే అవకాశాలుంటాయి... ఇది చాలా ప్రమాదకరం. కాబట్టి ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి.
55
ఈ వ్యాధులకు బల్లులతో చెక్..
ఇంట్లోకి వచ్చే దోమలను బల్లులు చురుకుగా వేటాడుతాయి. వ్యాధులను వ్యాప్తి చేసే దోమలను తినడం ద్వారా మీ ఆరోగ్యాన్ని కాపాడతాయి. ఇలా దోమల ద్వారా వ్యాప్తిచెందే డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా, జికా వైరస్ వంటి వ్యాధుల నుండి రక్షణ పొందవచ్చు. ఇళ్లలో ఎక్కువగా చిన్నారులు, ముసలివారు ఉంటారు… కాబట్టి వారి ఆరోగ్యాన్ని కాపాడటంతో బల్లులు కీలకంగా వ్యవహరిస్తాయి. ఇన్ని లాభాలున్నాయి కాబట్టి ఇకపై బల్లులను తరిమికొట్టకుండా జాగ్రత్త వహించండి.