మెంతుల్లో మన ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో రకాల పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ మెంతినీళ్లను మీరు ప్రతిరోజూ ఉదయాన్నే తాగితే ఎన్నో అనారోగ్య సమస్యలు తగ్గిపోయి ఆరోగ్యంగా ఉంటారు.
మనం వాడే మసాలా దినుసుల్లో మెంతులు ఒకటి. వీటిని చాలా రకాల వంటల్లో వేస్తాం. ఇవి వంటల రుచిని పెంచడమే కాకుండా మన ఆరోగ్యానికి కూడా ప్రయోజకరంగా ఉంటాయి. ఈ మెంతుల్లో యాంటీ ఆక్సిడెంట్, శోథనిరోధక లక్షణాలతో పాటుగా ఎన్నో రకాల పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి.
అందుకే మెంతులను తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. మెంతులను నానబెట్టిన వాటర్ ను ఉదయాన్నే పరిగడుపున తాగడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
26
మెంతినీళ్లను తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు
మెరుగైన జీర్ణక్రియ
మెంతి వాటర్ మన జీర్ణక్రియను మెరుగుపర్చడానికి ఎంతగానో సహాయపడుతుంది. ఈ వాటర్ లో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది కడుపు ఉబ్బరం, మలబద్దకం, గ్యాస్, అజీర్ణం వంటి జీర్ణ సమస్యలను తగ్గించడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. మీకు గనుక జీర్ణ సమస్యలు ఉంటే మాత్రం ప్రతిరోజూ ఒక కప్పు మెంతి నీళ్లను తాగండి.
వెయిట్ లాస్
మెంతి వాటర్ మీరు ఆరోగ్యంగా బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. ఈ వాటర్ ను తాగితే ఆకలి చాలా వరకు తగ్గుతుంది. అలాగే మన జీవక్రియను పెంచి ఎక్కువ కేలరీలు కరగడానికి సహాయపడుతుంది. ఈ వాటర్ వల్ల ఒంట్లో కొవ్వు పేరుకుపోవడం చాలా వరకు తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు ఈ మెంతివాటర్ ను తాగితే మంచిది.
36
కొలెస్ట్రాల్ తగ్గుతుంది
ఒంట్లో చెడు కొలెస్ట్రాల్ పెరగడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఇది మన ప్రాణాల్ని రిస్క్ లో పడేస్తుండి. అందుకే దీన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మెంతి నీళ్లను రోజూ తాగితే శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ తగ్గడం ప్రారంభమవుతుంది. అలాగే గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.
బ్లడ్ షుగర్ కంట్రోల్
మెంతినీళ్లు డయాబెటీస్ పేషెంట్లకు కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. ఈ వాటర్ ను తాగితే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. వెంటనే బ్లడ్ షుగర్ పెరిగే ప్రమాదం ఉండదు. అందుకే ఈ వాటర్ ను డయాబెటీస్ పేషెంట్లు తాగాలని నిపుణులు చెప్తుంటారు.
46
కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం
కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు వంటి ఆర్థరైటిస్ సమస్యలతో బాధపడేవారికి మెంతినీళ్లు మంచి మెడిసిన్ లా పనిచేస్తాయి. ఎందుకంటే వీటిలో శోథ నిరోధక లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఈ నీళ్లను తాగతే ఉబ్బసం వంటి మంట సంబధిత సమస్యలు కూడా తగ్గుతాయని నిపుణులు అంటున్నారు.
చర్మం ఆరోగ్యం
మెంతినీళ్లు మన చర్మాన్ని కూడా ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. ఈ నీళ్లను మీరు రెగ్యులర్ గా తాగితే మొటిమలు తగ్గిపోతాయి. మచ్చలు మాయమవుతాయి. అలాగే మీ స్కిన్ క్లియర్ గా ఉంటుంది. ఈ నీళ్లు తాగితే మీ చర్మానికి మంచి గ్లో వస్తుంది.
56
జుట్టు ఆరోగ్యం
జుట్టు ఆరోగ్యానికి కూడా మెంతినీళ్లు సహాయపడతాయి. ఈ వాటర్ ను తాగడం వల్ల జుట్టు రాలడం చాలా వరకు తగ్గుతుంది. అలాగే మీ జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది. అంతేకాదు నెత్తిమీద దురద, చుండ్రు కూడా తగ్గిపోతాయి. దీంతో మీ జుట్టు హెల్తీగా ఉంటుంది.
66
మెంతి నీళ్లను ఎలా తయారుచేయాలి?
ఒకటి లేదా రెండు టీ స్పూన్ల మెంతులను తీసుకుని గ్లాస్ వాటర్ లో వీటిని వేసి రాత్రంతా నానబెట్టండి. లేదంటే నాలుగు గంటలు నానబెట్టినా సరిపోతుంది. ఉదయాన్నే ఈ నీళ్లను వడకట్టి ఖాళీ కడుపున తాగండి. వీటిని మీరు గోరువెచ్చని నీళ్లలో నానబెట్టి కూడా తాగొచ్చు. లేదా కొన్ని నిమిషాలు ఉడకబెట్టి వడకట్టి కూడా తాగొచ్చు.