పకోడీలు, పూరీలు వేయించాక మిగిలిన నూనెను పారేస్తున్నారా? దాన్ని ఇలా తెలివిగా వాడేయండి

Published : Aug 14, 2026, 11:32 AM IST

పకోడీలు, పూరీలు చేయడానికి నూనె డీప్ ఫ్రై చేయాల్సి వస్తుంది. ఆ డీప్ ఫ్రైకు వాడిన నూనెను వాడడం ఆరోగ్యానికి మంచిది కాదని పడేస్తూ ఉంటారు. అలా పడేయాల్సిన అవసరం లేకుండా ఆ నూనెను తిరిగి ఎన్ని రకాలుగా వాడవచ్చో తెలుసుకోండి.

PREV
13
మిగిలిపోయిన నూనె ఏం చేయాలి?

ప్రతి ఇంట్లో అప్పుడప్పుడు పూరీలు, పకోడీలు చేసుకోవడం అలవాటే. అవి వేయంచాక బాణలిలో మిగిలిపోయిన నూనెను చాలామంది పారేస్తుంటారు. అయితే కాస్త తెలివిగా ఆలోచిస్తే ఈ నూనెను వృథా చేయకుండా తిరిగి మళ్లీ అనేక రకాలుగా వాడుకోవచ్చు. నూనె పూర్తిగా చల్లారిన తర్వాత, సన్నని జల్లెడ లేదా కాటన్ వస్త్రంతో శుభ్రంగా వడకట్టుకోవాలి. ఇలా శుభ్రం చేసుకున్న నూనెను భద్రపరిస్తే అది త్వరగా పాడవకుండా ఇతర అవసరాలకు ఉపయోగపడుతుంది.

23
ఇన్ని రకాలుగా నూనెను వాడొచ్చు

ఈ వడకట్టిన నూనెను మళ్లీ డీప్ ఫ్రై కోసం మళ్లీ వాడకూడదు కానీ, రోజువారీ పప్పు, సాంబార్, కూరల్లో పోపు వేసుకోవడానికి చక్కగా వాడుకోవచ్చు. అలాగే పరాటాలు, ఇతర పిండివంటలు చేసేటప్పుడు పిండిలో కాస్త కలిపితే అవి ఎంతో క్రిస్పీగా వస్తాయి. వంటలకే కాకుండా ఇంట్లోని తలుపుల సందును నుంచి వచ్చే శబ్దాలను తగ్గించడానికి, కత్తులు-కత్తెరలు తుప్పు పట్టకుండా ఉండటానికి, పాత చెక్క ఫర్నిచర్‌పై మెరుపు తీసుకురావడానికి కూడా ఈ నూనెను ఉపయోగించవచ్చు. సబ్బు నీటిలో కొద్దిగా నూనె కలిపి మొక్కలపై స్ప్రే చేస్తే చీడపీడలు కూడా దూరమవుతాయి.

33
వారంలోపే వాడేయండి

అయితే ఈ నూనెను వాడేటప్పుడు కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. వడకట్టిన నూనెను గాలి చొరబడని డబ్బాలో ఉంచి 5 నుంచి 7 రోజుల్లోపే వాడేయడం ఆరోగ్యానికి మంచిది. ఒకవేళ నూనె రంగు బాగా నల్లబడిపోయినా, అందులోంచి నురుగు లేదా చెడు వాసన వస్తున్నా దాన్ని ఉపయోగించకుండా వెంటనే పారేయడమే ఉత్తమం.

Read more Photos on
click me!

Recommended Stories