Alcohol: వారానికి ఒక‌సారి ఆల్క‌హాల్ తాగితే ఏం కాదా.? నిపుణులు ఏం చెబుతున్నారంటే..

Published : Mar 08, 2026, 04:00 PM IST

Alcohol: ఆల్క‌హాల్ ఆరోగ్యానికి హానిక‌ర‌మ‌ని తెలిసిందే. మందు ప్రియులు మాత్రం సాకులు చెబుతూ ఆల్క‌హాల్ అల‌వాటును వ‌ద‌ల‌రు. వారానికి ఒక‌సారి తాగితే ఏం కాద‌ని అంటుంటారు. అయితే ఇందులో నిజంగా నిజం ఉందా.? ఇప్పుడు తెలుసుకుందాం. 

PREV
15
నిపుణులు ఏమంటున్నారు?

వైద్యుల అభిప్రాయం ప్రకారం తక్కువ మోతాదులో ఆల్క‌హాల్‌ తీసుకుంటే ఆరోగ్యంగా ఉన్న కొంతమందికి పెద్ద సమస్యలు ఉండకపోవచ్చు. ఉదాహరణకు వారానికి ఒకసారి సుమారు 60 మిల్లీలీటర్ల వరకు మాత్రమే తాగితే ప్రమాదం తక్కువగా ఉండొచ్చు. అయితే తక్కువ మోతాదు అంటే ప్రమాదం ఉండదని కాదు. ఒకేసారి ఎక్కువగా తాగితే శరీరానికి హాని కలగవచ్చు. ఆల్క‌హాల్ తాగేటప్పుడు తీసుకునే ఆహారం వల్ల కూడా శరీరంలో క్యాలరీలు ఎక్కువ అవుతాయి. రెండు బీర్లు తాగి స్నాక్స్ తింటే సుమారు 1000 నుంచి 1200 క్యాలరీలు చేరే అవకాశం ఉంటుంది. దీంతో బరువు పెరిగే ప్రమాదం ఉంటుంది.

25
ఒకేసారి ఎక్కువ తాగితే ప్రమాదం

తక్కువ సమయంలో ఎక్కువ మద్యం తాగడాన్ని బింజ్ డ్రింకింగ్ అంటారు. ఇది చాలా ప్రమాదకరం. ఎక్కువ మొత్తంలో తాగడం వల్ల ఒక్కసారిగా లివర్‌పై ఒత్తిడి పెరుగుతుంది. గుండె సమస్యలు రావచ్చు. తీవ్రమైన పరిస్థితుల్లో ప్రాణాపాయం కూడా ఉండొచ్చు. వారానికి ఒక్కరోజే తాగినా ఒకేసారి ఎక్కువ తాగితే శరీర సమతుల్యత దెబ్బతింటుంది.

35
లివర్, కిడ్నీలపై ప్రభావం

ఆల్క‌హాల్ శరీరంలోకి వెళ్లిన తర్వాత దాన్ని విరగదీసే పని లివర్ చేస్తుంది. తరచూ లేదా వారానికి ఒకసారి తాగినా లివర్‌పై ఒత్తిడి పడుతుంది. దీర్ఘకాలంలో ఫ్యాటీ లివర్ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మందు తాగడం వల్ల శరీరంలో నీరు తగ్గిపోతుంది. దీనివల్ల కిడ్నీల పనితీరు కూడా ప్రభావితం అవుతుంది. ముఖ్యంగా తగినంత నీరు తాగకపోతే సమస్యలు పెరుగుతాయి.

45
గుండె, నిద్రపై ప్రభావం

ఆల్క‌హాల్ తాగితే రక్తపోటు పెరిగే అవకాశం ఉంటుంది. గుండె కొట్టుకునే వేగం అసమానంగా మారవచ్చు. మందుతో పాటు స్మోక్‌ చేస్తే గుండె జబ్బుల ప్రమాదం మరింత పెరుగుతుంది. మద్యం తాగిన తర్వాత త్వరగా నిద్రపోయినట్టు అనిపించినా నిజానికి మంచి నిద్ర ప‌ట్ట‌దు. మరుసటి రోజు అలసట, చిరాకు వంటి సమస్యలు కనిపించవచ్చు.

55
ఎవ‌రికి ఎక్కువ ప్ర‌మాదం.?

ఆల్క‌హాల్ ప్ర‌తీ ఒక్క‌రికీ ప్ర‌మాద‌క‌ర‌మ‌ని తెలిసిందే. అయితే మ‌రీ ముఖ్యంగా కొంత‌మంది మాత్రం ఎట్టి ప‌రిస్థితుల్లో ఆల్క‌హాల్‌కు దూరంగా ఉండాల‌ని చెబుతున్నారు. వీరిలో గర్భిణీలు, లివర్ లేదా గుండె సమస్యలున్న వారు, మానసిక ఆరోగ్య సమస్యలున్న వారు, ఇత‌ర ట్యాబ్లెట్స్ వాడుతున్న వారు, జీర్ణకోశ సమస్యలు లేదా అసిడిటీ ఉన్నవారికి కూడా ఆల్క‌హాల్ ప్ర‌మాద‌క‌రం.

Read more Photos on
click me!

Recommended Stories