చాలా మందికి రాత్రిళ్లు సరిగ్గా నిద్రపట్టదు. కానీ దీనివల్ల ఆరోగ్యం పాడవుతుంది. లేనిపోని అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే ప్రతిరోజూ రాత్రిపూట గోరువెచ్చని పాలలో ఒక మసాలా దినుసును కలిపి తాగితే బాగా నిద్రపడుతుంది.
మన ఆరోగ్యం బాగుండాలంటే మంచి హెల్తీ ఫుడ్ ను తినడమే కాకుండా.. ప్రతిరోజూ కంటినిండా నిద్ర కూడా పోవాలి. అయితే ఈ రోజుల్లో చాలా మంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. ఈ నిద్రలేమికి ఎన్నో కారణాలు ఉన్నాయి. పని ఒత్తిడి, శారీరక శ్రమ, మనం తినే ఫుడ్ వంటివి నిద్రపట్టకుండా చేస్తాయి.
అయితే రాత్రిపూట నిద్రపోవడానికి మసాలా దినుసుల్లో ఒకటైన జాజికాయ సహాయపడుతుంది. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. జాజికాయ నిద్రను మెరుగుపర్చడానికి బాగా సహాయపడుతుంది. ఈ జాజికాయను గోరువెచ్చని పాలలో వేసుకుని తాగితే రాత్రిపూట బాగా నిద్రపడుతుంది. అలాగే జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
25
గోరువెచ్చని పాలలో జాజికాయ పొడిని కలుపుకుని తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు
బాగా నిద్రపడుతుంది
గోరువెచ్చని పాలలో జాజికాయ పొడిని కలుపుకుని తాగితే బాగా నిద్రపడుతుంది. జాజికాయలో మిరిస్టిసిన్ అనే సమ్మేళనం ఒత్తిడిని తగ్గిస్తుంది. నాడీ వ్యవస్థను శాంతపరుస్తుంది. దీంతో మీకు బాగా నిద్రపడుతుంది. నిద్రలేమి సమస్యతో బాధపడుతున్న వారికి ఈ పాలు నేచురల్ రెమిడీగా పనిచేస్తాయి.
35
మెలటోనిన్ ఉత్పత్తి
వేడి పాలలో ఉండే ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లం నిద్ర హార్మోన్ అయిన మెలటోనిన్ ఉత్పత్తిని పెంచడానికి సహాయపడుతుంది. అయితే పాలలో మీరు జాజికాయను వేస్తే ఈ ప్రభావం మరింత పెరుగుతుంది. దీంతో మీరు వెంటనే నిద్రలోకి జారుకుంటారు.
మెరుగైన జీర్ణక్రియ
జాజికాయ జీర్ణక్రియను మెరుగుపర్చడానికి బాగా సహాయపడుతుంది. దీనిలో ఉండే కార్మినేటివ్ లక్షణాలు కడుపు ఉబ్బరం, గ్యాస్, ఎసిడిటీ, అజీర్ణం వంటి సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుంది. ఇది జీర్ణ సమస్యలను తగ్గించడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది.
జాజికాయ జీవక్రియను మెరుగుపర్చడానికి సహాయపడుతుంది. దీనిలో ఉండే సమ్మేళనాలు జీర్ణ ఎంజైమ్లను పెంచుతాయి. అలాగే జీవక్రియ పెరుగుతుంది. మీరు రాత్రిళ్లు జాజికాయ కలిపిన పాలను తాగితే జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది.
ఒత్తిడిని తగ్గిస్తుంది
జాజికాయ కలిపిన పాలను తాగితే ఒత్తిడి, యాంగ్జైటీలు తగ్గిపోతాయి. ఈ పాలను తాగడం వల్ల మనస్సు, శరీరం రెండూ రిలాక్స్ అవుతాయి. అలాగే సెరోటోనిన్ లెవెల్స్ పెరిగి మీకు విశ్రాంతి కలిగిస్తుంది. అలాగే ప్రశాంతంగా నిద్రపోతారు.
55
ఒత్తిడిని తగ్గిస్తుంది
జాజికాయ కలిపిన పాలను తాగితే ఒత్తిడి, యాంగ్జైటీలు తగ్గిపోతాయి. ఈ పాలను తాగడం వల్ల మనస్సు, శరీరం రెండూ రిలాక్స్ అవుతాయి. అలాగే సెరోటోనిన్ లెవెల్స్ పెరిగి మీకు విశ్రాంతి కలిగిస్తుంది. అలాగే ప్రశాంతంగా నిద్రపోతారు.