ఆచార్య చాణక్యుడు పురుషులతో పాటు మహిళల గురించి ఎన్నో విషయాలను తెలియజేశాడు. కొన్ని రకాల పనులు చేస్తే మహిళల వల్ల ఇంట్లో అశాంతి నెలకొంటుందని వివరించాడ. ముఖ్యంగా మహిళలు చేసే మూడు పనులు ఆ ఇంటి పరిస్థితులను మార్చేస్తుందని చాణక్యుడు వివరించాడు.
చాణక్యుడి విధానాలు ఇప్పటికీ మన దేశంలో ఎంతోమందికి ఆచరణయోగ్యంగానే ఉన్నాయి. అతడు నీతి శాస్త్రాన్ని రచించిన గొప్ప ఆర్థిక తత్వ శాస్త్రవేత్త. ఆయన నీతి శాస్త్రంలో పురుషులకు, మహిళలకు ఎన్నో ముఖ్యమైన విషయాలను వివరించారు. స్త్రీకి ఉండాల్సిన లక్షణాలు, పురుషులకు ఉండాల్సిన లక్షణాలను ముందుగానే వివరించారు. అయితే చాణక్యుడు చెప్పిన దాన్ని బట్టి ఒక ఇంటి ఇల్లాలికి ఎలాంటి లక్షణాలు ఉండకూడదో వివరించారు. అవి ఉండడం వల్ల ఆ ఇంటి పరిస్థితి మారిపోతుందని... ఆ ఇంట్లో అశాంతి నెలకొంటుందని ఆయన చెప్పారు. చాణక్యుడు చెప్పిన ప్రకారం ఎలాంటి పనులను లేదా ఎలాంటి లక్షణాలను మహిళలు కలిగి ఉండకూడదో తెలుసుకోండి.
24
ప్రతి విషయాన్ని భర్తతో విభేదించడం
వైవాహిక జీవితం ఆనందంగా సాగాలన్నా, ఆ కుటుంబంలో సామరస్యత ఉండాలన్నా భార్యాభర్తల ఆలోచనలు ఒకేలా సమతుల్యత కలిగి ఉండాలి. కానీ చాలా సార్లు భర్త చెప్పే విషయాలను భార్య విభేదిస్తూ ఉంటుంది. ఆ విభేదాలు సమస్యలకు కారణం అవుతాయి. ఒక్కోసారి నిర్ణయాలే ఇంటిల్లిపాదికి సమస్యలను తెచ్చిపెడతాయి. కాబట్టి భర్త చెప్పే విషయాలను భార్య నెమ్మదిగా విని అంగీకరించాలి. ఒకవేళ తనకు నచ్చకపోతే ఆ విషయాన్ని నేరుగా సామరస్యంగా వివరించాలి. అంతేతప్ప తీవ్రమైన విచారానికి గురవడం, వివాదాలకు తావివ్వడం, అసంతృప్తి బారినపడి బాధపడడం వంటివి చేయకూడదు. పురుషుడైనా, స్త్రీ అయినా పరిస్థితిని బట్టి తమ అభిప్రాయాలను బహిరంగంగా వ్యక్త పరచాలి. అయితే అలా వ్యక్తపరిచేటప్పుడు పరుషంగా కాకుండా తేలికపాటి పదజాలాన్ని వాడాలి. అప్పుడే భార్యాభర్తల మధ్య గొడవలు రాకుండా ఉంటుంది. లేకపోతే ఆ ఇల్లు నరకంగా మారిపోతుంది.
34
అబద్ధం చెప్పే అలవాటు
ఒక ఇంటి గృహిణికి అబద్ధం చెప్పే అలవాటు ఉంటే ఆ ఇల్లు ప్రశాంతంగా ఉండడం చాలా కష్టం. అబద్దం చెప్పడం తీవ్రమైన నేరం అని చాణక్యుడు చెబుతున్నారు. స్త్రీలు కొన్నిసార్లు చిన్న చిన్న విషయాలకే ఇంట్లో అబద్దాలు చెబుతూ ఉంటారు. ఇది పెద్ద సమస్యలను తెచ్చిపెడుతుందని ఆయన వివరిస్తున్నారు. అబద్ధాలు తాత్కాలికంగా ఆనందాన్ని ఇవ్వవచ్చు.. కానీ నిజాన్ని ఎక్కువ కాలం దాచలేవు. నిజం బయటికి వచ్చినప్పుడు భార్యాభర్తలు విడిపోయే స్థితికి చేరుకుంటుంది. కాబట్టి మహిళలు ఎప్పుడైనా పురుషులకు నిజాలే చెప్పాలి. భర్త దగ్గర ఏ విషయాన్ని దాయకూడదు అని చాణక్యుడు వివరిస్తున్నాడు.
చాణక్యుడు చెబుతున్న ప్రకారం ప్రతి ఇంటి స్త్రీ తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. స్త్రీలు తమ ఆరోగ్యాన్ని విస్మరించినా, నిర్లక్ష్యం చేసినా అది చాలా పెద్ద తప్పుగా మారిపోతుందని చాణక్యుడు చెబుతున్నారు. చిన్న అనారోగ్యమైనా లేదా తీవ్రమైన సమస్య అయినా మహిళలు వెంటనే చికిత్స తీసుకోవాలి. లేకుంటే కుటుంబానికి ఆడదిక్కు లేక ఇబ్బంది పడతారు. ఎప్పుడైతే ఇంటి ఇల్లాలి ఆరోగ్యం తీవ్రంగా ప్రభావితం అవుతుందో ఆ ఇంటిలో ఆనందం కనుమరుగైపోతుంది. ఇంటి ఇల్లాలి మనసు, శరీరం ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఆ కుటుంబం సజావుగా ఉంటుంది. కాబట్టి మహిళలు తమ ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు కాపాడుకోవాలి.