
భర్తను చంపిన భార్య.
భార్యను చంపిన భర్త.
ఎనిమిదేళ్ల అమ్మాయిపై సామూహిక అత్యాచారం చేసిన నలుగురు అబ్బాయిలు. అందరూ పదేళ్లలోపువారే.
బెట్టింగ్ లు లోన్ యాప్ మాఫియాలు.
.. అయిదు సంవత్సరాల్లో సమాజం ఎందుకు తలకిందులు అయ్యింది ?
మొబైల్ .. లాప్ టాప్ .. టాబ్ .. డెస్క్ టాప్ .. స్మార్ట్ టీవీ !
ఇంటర్నెట్ లోకి ఎలా వెళ్లినా ..
చాలామందికి ... అది క్రమేపీ అడిక్షన్ అయిపోతుంది .
అదః పాతాళానికి ఎనిమిది మెట్లు !
ఇంటర్నెట్ లో ... మీ మనసుకు నచ్చిన విషయాలు చూస్తారు .
రీల్స్ .. సోషల్ మీడియా పోస్టింగ్స్ .
ఫిలిమ్స్ .. వీడియో గేమ్స్ .. ఇలా ... .
వీటిని చూడడం వల్ల డోపామైన్ ఉత్పత్తి అవుతుంది .
డోపామైన్ కిక్కు... మద్యం లాంటిది .
అంత కంటే ఎక్కువ .
తొలి రోజుల్లో ఒక పెగ్గు .
అటు పై... డోసు పెంచితే కానీ ... కిక్కు రాదు .
మొదట్లో వచ్చిన కిక్కు ... రావాలంటే మరింత సేపు .. మరింత లోతుగా నెట్ లోకి వెళుతారు.
అంటే ఎక్కువ గంటల పాటు ... మొబైల్ పరికరాలనుండి వచ్చే నీలి కాంతి కళ్ళను తాకుతుంది.
దీని వల్ల ... శరీరంలో మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తి తగ్గిపోతుంది.
దీనితో నిద్ర పట్టదు .
నిద్ర పట్టకపోవడంతో ... అలసట , చిరాకు వస్తుంది .
ఇమ్మ్యూనిటి చస్తుంది .
జలుబు.. దగ్గు నిత్య కృత్యం అయిపోతుంది . దీనితో మరింత చిరాకు .. అలసట .
మెదడు చురుకుతనం కోల్పోతుంది .
అంటే ఇంగిత జ్ఞానం సగం చస్తుంది .
ఈ దశలో ఇంటర్నెట్ కు మరింత అతుక్కుని పోతారు .
ప్రయత్నం లేకుండానే చేయి మొబైల్ పైకి పోతుంది .
రీల్స్ .. వెబ్ వార్తలు .. వాట్సాప్ పోస్ట్లు ..
.అదే పని .
. రోజంతా ..
యధాలాపంగా చేయి మొబైల్ పైకి .
టెక్విలా ...
బీరు... విస్కీ .. బ్రాందీ దశను దాటేస్తే .. టెక్విలా ..
నెట్ పై కూడా అంతే
కిక్కు కావాలంటే చిత్ర విచిత్ర వార్తలు చూడాలి .
"షాక్ తింటారు .."
" పిచ్చెక్కి పోతుంది .."
" తగల పెట్టేసారు .. "
... లాంటి థంబ్ నెయిల్స్ తో .. యూట్యూబ్ వీడియో లు ఇలాంటి వారి కోసమే వస్తాయి .
సోషల్ మీడియా అల్గారిథమ్ తో పని చేస్తుంది .
ఎలాంటి పోస్ట్లు చూస్తారో అలాంటివే ... పదేపదే కనిపిస్తాయి .
క్రమేపీ సాధారణ విషయాలు ఆసక్తి కలిగించడం మానేస్తాయి .
అద్భుత వార్తలకు అలవాటు పడిపోతారు .
"ప్రపంచం లో ఖరీదయిన హోటల్ ఏదో తెలుసా?"
"అక్కడ ఒక రోజు రూమ్ ఛార్జ్ ఎంతో తెలుసా ?"
"లంచ్ కి అయిదు లక్షలు ఛార్జ్ చేసే హోటల్స్ పేర్లు తెలుసా ?"
"ఆమె కట్టుకొన్న చీర ఖరీదు కేవలం అయిదు కోట్లు .."
"ఆయన జీతం జస్ట్ వెయ్యి కోట్లు ".
ఇలాంటి వార్తలకు మీరు అలవాటు పడిపోతారు .
ఇలాంటి వార్తలు ఆత్మ విశ్వాసాన్ని దెబ్బ తీస్తాయి .
ఆత్మ న్యూనత..
లో సెల్ఫ్ ఎస్టీమ్ ..
ఐడెంటిటీ క్రైసిస్ దశ .
" తూ.. దీని ... నాదీ .. ఒక బతుకేనా ?
"నా కారు ఖరీదు జస్ట్ పది లక్షలు . అయన కారేమో అయిదు కోట్లు ."
"నాది అమీర్పేట్ లో డబుల్ బెడ్ రూమ్ ఇల్లు.
కోకాపేటలో ఎనిమిది బెడ్ రూమ్ స్కై విల్లా అంట . ఏడు కోట్లు .... బతికితే ఆలా బతకాలి ."
"ఉన్నది ఒక లైఫ్ . ఇప్పుడు కాకపోతే ఎపుడు ఎంజాయ్ చేస్తాము?"
...ఇవీ ఆలోచనలు .
అనుకరణ ..
కసితో అనుకరణ
"లైఫ్ ఎంజాయ్ చెయ్యాలి .. చేస్తే తప్పు లేదు .. చేయక పొతే తప్పు" అని నిర్దారణకు వచ్చేశారు .
దీనితో విలాసాలకు బానిసయిపోతారు
ఆదాయానికి మించి ఖర్చు పెడుతారు .
అమెరికా కు పోయిన నా కజిన్ ఇలాంటి కారు కొన్నాడు ..ఫేస్బుక్ లో ఇన్స్టాగ్రామ్ లో ఫొటోలే ... ఫోటోలు . .... అప్పు చేసో ... దొమ్మీ చేసో.. నేనూ కొనాలి. అంతకు పది రేట్ల పోజుతో... ఫోటోలు పెట్టాలి "
మగాళ్లు మందు పార్టీలలో... ఆడాళ్ళు కిట్టి పార్టీ లలో గొప్పలు చెప్పుకోవడం మొదలెడతారు .
షో ఆఫ్ ఎక్కువయి పోతుంది.
ఆదాయానికంటే ఖర్చులు ఎక్కువయిపోతాయి . క్రెడిట్ కార్డు అప్పులు ..
తెలిసినవారి దగ్గర చేబదులు .
నూటికి డెబ్భై మంది ఈ దశలో ఉన్నారు.
ఒక్క మాటలో చెప్పాలి అంటే రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక పరిస్థితే.
పాత అప్పులు కట్టడానికి కొత్త అప్పులు చెయ్యాలి .
అప్పుల ఊబి .
ఇప్పుడు తెలిసిన వారు అప్పు ఇవ్వడం మానేస్తారు .
దీనితో ఆన్లైన్ క్రెడిట్ బాట పడుతారు.
అప్పులు ఎలా తీర్చాలి ?
"ఫలానావాడికి బెట్టింగ్ లో పది కోట్లు వచ్చాయంట" అనే వార్తలు అప్పుడు వినిపిస్తాయి .
వినిపించేలా చేస్తారు .
అదే మేజిక్ .
పేకాట మనవాళ్లకు ఎప్పటి నుంచో అలవాటే .
అక్కడ కనీసం సాటి మనుషులు .". ఇక చాల్లేరా" .. అని లేపుతారు .
ఇప్పుడేమో చైనా వాడి ఆన్లైన్ బెట్టింగ్ ..
లేదా ఇంకో మాఫియా గాడు.
మనిషి చచ్చి పొతే కిడ్నీ లు అమ్ము కోవచ్చులే అనికొనే మాఫియా .
బెట్టింగ్ లో ఓడుతున్నా.. అప్పు పక్కనే పుడుతుంది .
ఇదే అష్టమ శని దశ .
ఆన్లైన్ బెట్టింగ్ మాఫియా... క్రెడిట్ మాఫియా ..
ఇంటి కొస్తారు.
భార్యని చెల్లిని .
లాక్కుని వెళ్ళిపోతారు .
తెలిసిన వారి కి ఫోన్ లు చేసి అసభ్యకరంగా తిడుతారు .
ఈ స్థాయి చేరుకొన్న వ్యకి ..
క్రమేపీ బంధువులకు మిత్రులకు దూరమయ్యి ఉంటాడు.
ఒంటరి తనం .
ఆదరించేవాడుండడు .
కనీసం ఓదార్పు దక్కదు .
జీవితం శూన్యం
అప్పుడు ఒకటే మార్గం ..
డెడ్ ఎండ్ !
చచ్చిపోవాలి .
లేదా నమ్మిన వాళ్ళను చంపి ఆస్తి లాక్కొని అప్పు తీర్చాలి .
ఇంటర్నెట్ బానిసత్వం నుండి బయటకురండి .
1. ఆఫీస్ కు సంభందించిన పనులకోసమే వైఫై ఉపయోగించండి . మిగతా సమయాల్లో రౌటర్ ఆఫ్ చేయండి .
2 . లాప్ టాప్ ను టేబుల్ పై పెట్టి వాడండి . ఎటువంటి పరిస్థితుల్లో మీ ఒడిలో పెట్టుకోవద్దు .
౩. రీల్స్ చూడొద్దు . యూట్యూబ్ వీడియోస్.. మీ నిజజీవితానికి అంటే పిల్ల చదువు , ఆరోగ్యం , ఉపాధి లాంటి అంశాలకు ఉపయోగపడే వాటినే చూడండి . అది కూడా నిజాయతీ తో కూడిన వీడియో లు మాత్రమే .
4 . మీడియా పోస్ట్ లు కూడా ఇదే పద్ధతిలో . నిజజీవితంలో ఉపసోషల్ యోగపడేది , నిజాయతీ తో కూడినవి .
5 . కూర్చున్నప్పుడు మొబైల్ దగ్గర పెట్టుకోవద్దు .
రోజుకు మొత్తం రెండు గంటలు .. గరిష్టంగా మొబైల్ చూడండి . రింగ్ అయితే వెళ్లి కాల్ అటెండ్ చెయ్యండి .
6 . మీలో విల్ పవర్ రావడానికి న్యూరో లింగ్విస్టిక్ పద్ధతిలో అఫర్మేషన్స్ తీసుకోండి .