వెల్లుల్లితో విస్తుపోయే లాభాలు.. తెలిస్తే అస్సలు వదలరు.. అవేంటో చూడండి..

First Published | Sep 28, 2021, 1:39 PM IST

 దైనందిన జీవితంలో వచ్చే అనేక సమస్యలకు వెల్లుల్లి పరిష్కారం చూపిస్తుంది. ఆరోగ్య సమస్యలతో పాటు మొటిమలకు చికిత్స చేయడం, చుండ్రును తొలగించడం, దోమలను తరిమికొట్టడంలో కూడా ప్రభావవంతంగా పనిచేస్తుంది.

వెల్లుల్లి మన వంటకాల్లో తప్పనిసరిగా ఉండే ఇంగ్రీడియంట్. పప్పు, కూరగాయలు, పచ్చళ్లు, నాన్ వెజ్ లు ఇలా ఏ వంటకంలో అయినా వెల్లుల్లి లేకపోతే అస్సలు నడవదు. వెల్లుల్లి వంటకానికి ప్రత్యేకమైన రుచిని అందిస్తుంది. వెల్లుల్లి మన ఆరోగ్యానికి చాలా ఉపయోగకరమైన ఆహార పదార్థం. దైనందిన జీవితంలో వచ్చే అనేక సమస్యలకు పరిష్కారం ఇది. ఆరోగ్య సమస్యలతో పాటు మొటిమలకు చికిత్స చేయడం, చుండ్రును తొలగించడం, దోమలను తరిమికొట్టడంలో కూడా ప్రభావవంతంగా పనిచేస్తుంది. 

పొట్ట సంబంధిత సమస్యలు : అజీర్ణం లేదా అసిడిటీ వంటి పొట్ట సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారా? మీ గట్ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఈ రెమెడీని ప్రయత్నించండి. 

ఒక వెల్లుల్లి రెబ్బను తీసుకుని దాన్ని మెత్తగా రుబ్బండి. దీన్ని ఒక టేబుల్ స్పూన్ లోకి తీసుకుని దీనిమీద అర టీస్పూన్ తేనెను కలపండి. ఈ మిశ్రమాన్ని ఉదయం ఖాళీ కడుపుతో తినాలి. తినేప్పుడు బాగా నమలాలి. ఈ సమయంలో కొద్దిగా నీరు తాగొచ్చు. అలాగని మరీ ఎక్కువగా తాగొద్దు. 


మొటిమల నివారణలో.. కొన్నిసార్లు మొటిమలు మొహం మీద చాలాకాలంపాటు అలాగే ఉంటాయి. అవి చాలా బాధిస్తాయి. ఆత్మన్యూనతకు గురి చేస్తాయి. దీని నివారణకు వెల్లుల్లి రెబ్బను మధ్యలోకి కోసి.. దాన్ని మొటిమల మీద రుద్దండి. వెల్లుల్లిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి, ఇవి మొటిమల నొప్పిని తగ్గిస్తాయి. వెల్లుల్లిలో అల్లిసిన్ ఉండటం వల్ల మీ చర్మ రంధ్రాలను మూసుకుపోయేలా చేసి బ్రేక్‌అవుట్‌లకు కారణమయ్యే బ్యాక్టీరియాను చంపుతుంది.

దగ్గును తగ్గిస్తుంది : జలుబు, దగ్గు లేదా గొంతు గరగరతో బాధపడుతున్నట్లైతే వెల్లుల్లి చక్కని ఉపాయం. దీనికోసం కొన్ని వెల్లుల్లి రెబ్బలను మెత్తగా నూరి... ఒక కప్పు నీటితో మరిగించాలి. ఈ మిశ్రమాన్ని 5 నిమిషాలు మరగనిచ్చి.. తరువాత వడకట్టాలి.  అవసరమైతే దీనికి కొద్దిగా తేనెను కలుపుకుని, వెచ్చగా త్రాగాలి. ఈ హోం రెమెడీతో దగ్గు లేదా జలుబు త్వరగా తగ్గిపోతాయి. 

చుండ్రు నివారణకు...చుండ్రుతో విసిగిపోయారా? చుండ్రుతో తల విపరీతమైన దురదను కలిగిస్తుందా? దీనికి చికిత్స చేయాలంటే వెల్లుల్లిని ఇలా ట్రై చేయండి. దీనికోసం కొన్ని వెల్లుల్లి రెబ్బలను మెత్తగా రుబ్బి, దీంట్లో కొద్దిగా తేనె వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని నేరుగా తలకు అప్లై చేసి చక్కగా మసాజ్ చేయాలి. 15 నిమిషాలు అలాగే ఉంచి, తర్వాత షాంపూతో కడగాలి. 

దోమల నివారణలో...వెల్లుల్లి దోమలను తరిమికొట్టడంలో కూడా బాగా పనిచేస్తుంది. వెల్లుల్లి ఘాటు వాసనతో దోమలు పారిపోతాయి. దీనికోసం 6-8 వెల్లుల్లి రెబ్బలను ముక్కలు చేసి, వాటిని కొద్దిగా నీటితో మరిగించండి. ఈ మిశ్రమాన్ని 5-10 నిమిషాల సేపు అలాగే మరిగించి, ఈ నీటిని ఇంట్లో స్ప్రే లాగా చల్లాలి. మరిగిన తరువాత ఈ నీటిని వడకట్టి స్ప్రే బాటిల్‌లోకి పోయండి. దోమలను అరికట్టడానికి ఈ ద్రావణాన్ని ఇంటి చుట్టూ, ముఖ్యంగా చీకటి మూలల్లో పిచికారీ చేయాలి.

చర్మం మీద గాట్లు పడ్డప్పుడు అది తగ్గడానికి చాలా సమయం పడుతుంది. అంతేకాదు ఆ ఘాటు రోజురోజుకూ మరింతగా చర్మం లోపలికి పెరుగుతూ ఉంటుంది. ఇది చాలా ఇబ్బందిగా ఉంటుంది. దీన్ని తొందరగా తగ్గించాలంటే.. ఒక వెల్లుల్లి రెబ్బను సగానికి కోసి గాటు పడిన ప్రాంతంలో పెట్టి కట్టు కట్టాలి. వెల్లుల్లిలోని యాంటీ బాక్టీరియల్ లక్షణాలు సహజంగా గాటును నయం చేస్తాయి. 

వెల్లుల్లి అనగానే మనకు ఘాటైన రుచి, వాసనే తెలుసు. అయితే వెల్లుల్లితో డెజర్ట్ తయారు చేసుకోవచ్చని మీకు తెలుసా? వెల్లుల్లి ఖీర్ నిజానికి మొఘలుల కాలం నాటి ఒక రుచికరమైన డెజర్ట్.  వెల్లుల్లిఖీర్ లోని పదార్ధాలు రహస్యంగా ఉన్నందున దీనిని 'బినామీ' అని పిలిచేవారు. ఈ ఖీర్ వంటకాన్ని 1 లీటరు పాలు, 150 గ్రాముల వెల్లుల్లి, 125 మి.లీ.ల వైట్ వెనిగర్, 80 గ్రాముల చక్కెర, 2 రేకుల కుంకుమ పువ్వు, 2 ఆకుపచ్చ ఏలకులు ఉపయోగించి తయారు చేస్తారు.

దశ 1- వెల్లుల్లి రెబ్బలను కోసి, వెనిగర్‌లో 20 నిమిషాలు నానబెట్టండి.
దశ 2- 20 నిమిషాల తర్వాత వెనిగర్ లో నుంచి తీసి.. శుభ్రంగా కడిగి.. ఒకకప్పు నీటితో పాటు ఓ గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని మూడుసార్లు ఉడకించాలి. ఉడకించే ప్రతిసారీ, పాత నీటిని తీసేసి, కొత్తగా మళ్లీ నీరు చేర్చాల్సి ఉంటుంది. ఇది వెల్లుల్లి, వెనిగర్ గాఢమైన రుచులను వదిలించుకోవడానికి తోడ్పడుతుంది. ఈ ప్రక్రియ పూర్తయ్యాక నీటిని తీసివేసి, వెల్లుల్లిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. 
దశ 3- గిన్నెలో, పాలు, కుంకుమపువ్వు, పంచదార, వెల్లుల్లి వేసి ఈ మిశ్రమం సగం అయ్యేవరకు మరిగించాలి.
దశ 4- ఖీర్‌లో ఏలకుల పొడి వేసి రుచికి అనుగుణంగా చల్లగా లేదా వేడిగా వడ్డించండి.

దశ 1- వెల్లుల్లి రెబ్బలను కోసి, వెనిగర్‌లో 20 నిమిషాలు నానబెట్టండి.
దశ 2- 20 నిమిషాల తర్వాత వెనిగర్ లో నుంచి తీసి.. శుభ్రంగా కడిగి.. ఒకకప్పు నీటితో పాటు ఓ గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని మూడుసార్లు ఉడకించాలి. ఉడకించే ప్రతిసారీ, పాత నీటిని తీసేసి, కొత్తగా మళ్లీ నీరు చేర్చాల్సి ఉంటుంది. ఇది వెల్లుల్లి, వెనిగర్ గాఢమైన రుచులను వదిలించుకోవడానికి తోడ్పడుతుంది. ఈ ప్రక్రియ పూర్తయ్యాక నీటిని తీసివేసి, వెల్లుల్లిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. 
దశ 3- గిన్నెలో, పాలు, కుంకుమపువ్వు, పంచదార, వెల్లుల్లి వేసి ఈ మిశ్రమం సగం అయ్యేవరకు మరిగించాలి.
దశ 4- ఖీర్‌లో ఏలకుల పొడి వేసి రుచికి అనుగుణంగా చల్లగా లేదా వేడిగా వడ్డించండి.

Latest Videos

click me!