తమలా తాము నటించడం తేలికే.. కానీ బయోపిక్ లో చేస్తున్నప్పుడు వారిలా నటించాలంటే.. ఆ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేయాలి. తెరమీద అచ్చు సదరు వ్యక్తే సజీవంగా దర్శనమిస్తుందా అనిపించేలా ప్రేక్షకులన్ని మురిపించాలి. అది చాలా కష్టమైన పని. ఇదే నటీనటులకు కత్తిమీద సాములా మారుతుంది. అలాంటి సాహసాన్ని అలవోకగా చేసి అందరితో భేష్ అనిపించుకుంది బాలీవుడ్ స్టార్ కంగనా రనౌత్.
తమలా తాము నటించడం తేలికే.. కానీ బయోపిక్ లో చేస్తున్నప్పుడు వారిలా నటించాలంటే.. ఆ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేయాలి. తెరమీద అచ్చు సదరు వ్యక్తే సజీవంగా దర్శనమిస్తుందా అనిపించేలా ప్రేక్షకులన్ని మురిపించాలి. అది చాలా కష్టమైన పని. ఇదే నటీనటులకు కత్తిమీద సాములా మారుతుంది. అలాంటి సాహసాన్ని అలవోకగా చేసి అందరితో భేష్ అనిపించుకుంది బాలీవుడ్ స్టార్ కంగనా రనౌత్.
దంగల్ సినిమాలో పాత్రకు తగ్గట్టుగా లావయ్యి.. ఆ తరువాత మళ్లీ తన ఫిట్ నెస్ ను సాధించి అమీర్ ఖాన్ అప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారారు. అలాగే ఇప్పుడు ఫైర్ బ్రాండ్ కంగనా కూడా తలైవి సినిమా కోసం ఏకంగా 20 కిలోల బరువు పెరిగి.. తిరిగి తన పూర్వ రూపాన్ని సాధించి ప్రశంసలు అందుకుంటోంది. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవితస్ఫూర్తితో తెరకెక్కని చిత్రం తలైవి. ఈ సినిమాలో కంగనా తన అద్భుతమైన నటనతో జయలలితకు ప్రాణ ప్రతిష్ట చేసింది. సినిమాకు అనుగుణంగా లావు అవుతూ.. ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేసింది.
సినిమా షూటింగ్ తరువాత అసలు టాస్క్ మొదలయ్యింది కంగనాకు.. సినిమాకోసం పెరిగిన 20 కిలోల బరువును తగ్గడం అంత మామూలు విషయం ఏమీ కాదు. బరువు పెరిగినప్పుడు శరీరం మీద ఏర్పడిన స్ట్రెచ్ మార్క్స్ పోగొట్టుకోవడం అంత మామూలు విషయం కాదంటుందామె.
'తలైవి' కోసం బరువు పెరగడం, దానిని కోల్పోవడం బాధాకరం అని కంగనా చెప్పుకొచ్చింది. 34 యేళ్ల కంగనా, తలైవీలో ఆమె యాక్టింగ్ కి ఇప్పటికే ప్రశంసలు అందుకుంటోంది. అయితే ఈ చిత్రం కోసం బరువు పెరగడం గురించి నటి చాలా ఓపెన్‌గా, నిజాయితీగా చెప్పుకొచ్చింది. ఆ బరువును తగ్గించుకోవడం చాలా పెయిన్ ఫుల్ జర్నీ అని పంచుకుంది. బరువు పెరగడం, బరువు తగ్గడం రెండింటిలోనూ స్ట్రెచ్ మార్కులు ఏర్పడతాయి. బరువుతో పాటు ఈ మార్క్స్ ను పోగొట్టుకోవడం చాలా కష్టం అంటుందామె.
దీనికి సంబంధించిన ఫోటోలు షేర్ చేస్తూ.. తలైవి వి ఇప్పటికి ఫొటోలు షేర్ చేసింది. "తలైవి కోసం 20 కేజీల బరువు పెరగడం, 6 నెలల్లో ఆ బరువును తగ్గించుకోవడం నా ముప్పై ఏళ్ల కెరీర్ శరీరాన్ని ఇంతగా గందరగోళం చేసింది మరోటి లేదు’ అంటూ షేర్ చేసింది. ముప్పై ఏళ్ల తరువాత బరువు తగ్గడం అంత సులభమైన విషయం కాదు. దీనికోసం కఠినమైన వ్యాయామాలు చేయడం వల్ల వెన్నుపూస మీద ప్రభావం పడుతుంది. అంతేకాదు మునుపటి చురుకుదనం రావడం కష్టంగా మారుతుంది.
ఆరోగ్యం విషయంలో కంగనా చాలా మంచి జీవనశైలిని ఫాలో అవుతుంది. పరిశుభ్రమైన ఆకుపచ్చ ఆహారాన్ని మాత్రమే తీసుకుంటుంది. క్రమం తప్పకుండా వర్కవుట్స్ చేస్తుంది. అందుకే బరువు పెరగడం, వయసు ఆమె విషయంలో చాలా ఇబ్బందిగా మారతాయి. ముప్పై యేళ్ల వయసులో బరువు తగ్గడానికి చాలా సమయం తీసుకుంటుంది. ఎందుకంటే బరువు పెరిగినప్పుడు శరీరం చాలా మార్పులకు గురవుతుంది. వయస్సు పెరిగే కొద్దీ మనం కండర ద్రవ్యరాశి కోల్పోతుంది. జీవక్రియ నెమ్మదిగా జరుగుతుంది, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి స్థాయిలు, సుదీర్ఘ పని షెడ్యూల్‌లు కూడా 20 ఏళ్లలోపు వారితో పోల్చితే 30 దాటిన తరువాత బరువు తగ్గడాన్ని అసాధ్యంగా మార్చేస్తాయి.
తలైవిలోని పాత్ర విషయానికొస్తే, కంగనా తన ధాకాడ్, తేజస్‌తో సహా విడుదలయ్యే ఇతర చిత్రాల షూటింగ్‌లో బిజీగా ఉండడం వల్ల తొందరగా బరువు తగ్గాల్సి ఉంది. తక్కువలో తక్కువ ఆరు నెలల వ్యవధిలో ఇది జరగాలి. దీనికోసం ఫిట్‌నెస్, డైట్ నిపుణుల సహాయంతో కంగనా 20 కిలోలు పెరిగి, తగ్గారు. బరువు పెరగడానికి, కంగనా హార్మోన్ల మాత్రలు, ప్రామినెంట్ ఫుడ్ తీసుకోవాల్సి వచ్చింది, దీనివల్ల ఆమె వేగంగా బరువు పెరిగింది. అంతే కాకుండా, కంగనా తన చిత్ర దర్శకుడు, AL విజయ్ బరువు పెరగడంలో సహాయపడటంలో పెద్ద పాత్ర పోషించాడని పేర్కొన్నాడు, ఎందుకంటే అత్యంత సహజమైన రీతిలో బరువు పెరగడానికి వీలుగా ఇంట్లో తయారుచేసిన ఆహారాన్ని తీసుకువచ్చేవాడట.
తలైవి కోసం కంగనా చేసిన జా-డ్రాపింగ్ ట్రాన్స్ఫర్మేషన్ ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. నటి ఇప్పుడు తలైవి పూర్వపు బరువుకు తిరిగి వచ్చినప్పటికీ, మణికర్ణిక నటి చాలా కష్టపడి, తన ఆకృతిని తిరిగి పొందడానికి ట్రెడిషనల్ గా వర్కవుట్ చేసింది. తన ఆఫ్-షూట్ రోజుల నుండి కొన్ని BTS పోస్ట్‌లు, చిత్రాలను పంచుకుంటూ, కంగనా ముందు, తరువాత రూపాలు, వ్యాయామాలు, యోగా ఆసనాల చిత్రాలను షేర్ చేస్తూనే ఉంది. నటి ఒక సంవత్సరం కంటే తక్కువ సమయంలో ఇవన్నీ జరిగేలా చేయడం నిజంగా అభినందనీయం.
బరువు తగ్గడానికి కంగనా పని చేయడం ఇదే మొదటిసారి కాదు. 2019 సంవత్సరంలో కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో తన కోచర్ ప్రదర్శన కోసం రికార్డు స్థాయిలో 10 రోజుల్లో 5 కిలోలకు పైగా బరువు కోల్పోయింది.
కేవలం ఈ ట్రాన్స్ ఫర్మేషనే కాదు. కంగనా రనౌత్ నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. యోగా, శ్వాసక్రియ, ధ్యానం లతో పాటు వారానికి ఐదు రోజులు జిమ్ కి వెడుతుంది. ప్రతిరోజూ 45 నిమిషాల యోగా సాధన చేస్తుంది.
కంగనా శాఖాహారి. ఆకుకూరల నుంచి అందే పోషక శక్తిని నమ్ముతుంది. స్మూతీల నుండి సలాడ్‌ల వరకు, కంగనా తన భోజనాన్ని తేలికైన ఆహారం తీసుకుంటుంది. అందుకే ఆమె ఫుడ్ పోషకాహారంతో నిండి ఉంటుంది. భోజనాల మధ్య స్నాక్స్ లా పండ్లను తీసుకుంటుంది. బరువు తగ్గడాన్ని ప్రోత్సహించే, టాక్సిన్‌లను తొలగించే ఆహారాలను ఇష్టపడుతుంది.