Fridge: మీ ఇంట్లో ఫ్రిజ్ ఉందా..? ఈ పొరపాట్లు మాత్రం చేయకండి..!

Published : Oct 11, 2025, 05:20 PM IST

Fridge: ఫ్రిజ్ అనేది రోజూ ఉపయోగించే అత్యంత అవసరమైన పరికరం. సరైన జాగ్రత్తలు తీసుకుంటే ఇది సంవత్సరాల పాటు సజావుగా పనిచేస్తుంది. క్రమం తప్పకుండా శుభ్రపరచడం, ఉష్ణోగ్రత నియంత్రణ, సీల్ చెక్ చేయడం వంటి చిన్న చర్యలు పెద్ద నష్టాన్ని నివారిస్తాయి.

PREV
14
fridge

ఈ రోజుల్లో ఇంట్లో ఫ్రిజ్ లేనివాళ్లు ఎవరైనా ఉంటారా? ప్రతి ఒక్కరికీ ఇది నిత్యవసర వస్తువు అయిపోయింది. కూరగాయలు, పండ్లు, పాలు, మాంసం ఇలా అన్ని ఆహార పదార్థాలను అందులోనే పెట్టేస్తూ ఉంటాం. ఇంట్లో ఫ్రిజ్ ఉండగానే సరిపోదు... దానిని సరిగా మేనేజ్ చేయడం కూడా తెలియాలి. లేకపోతే చాలా తక్కువ కాలంలోనే పాడైపోతుంది. అలా పాడవ్వకుండా ఉండాలన్నా, ఫ్రిజ్ లైఫ్ స్పాన్ పెరగాలన్నా కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోవాలి. మరి, అవేంటో చూద్దాం...

24
ఫ్రిజ్‌ నిండా ఆహార పదార్థాలు నింపొద్దు..

చాలా మంది ఫ్రిజ్‌ను ఆహార పదార్థాలతో నిండుగా నింపేస్తారు. ఇది పెద్ద తప్పు. ఫ్రిజ్‌లో గాలి సరిగ్గా ప్రసరించకపోతే చల్లదనం సమానంగా వ్యాపించదు. ఫలితంగా, కొంత ఆహారం చెడిపోవచ్చు. ఫ్రిజ్ కంప్రెసర్ ఎక్కువ ఒత్తిడికి గురి అవుతుంది. అందువల్ల, ఫ్రిజ్‌లో గాలి చక్కగా వ్యాపించడానికి కొంచెం గ్యాప్ ఇవ్వాలి.

34
కాయిల్ శుభ్రం చేయడం మర్చిపోవద్దు

ఫ్రిజ్ వెనుక భాగంలో లేదా దిగువన ఉండే కాయిల్ ఫ్రిజ్ చల్లదనానికి ప్రధాన కారణం. ఇది దుమ్ముతో నిండిపోతే.. ఫ్రిజ్ ఎక్కువగా వేడెక్కుతుంది. విద్యుత్ వినియోగం పెరుగుతుంది. ప్రతి రెండు మూడు నెలలకు ఒకసారి కాయిల్‌ను వాక్యూమ్ క్లీనర్ లేదా బ్రష్ సహాయంతో శుభ్రం చేయడం అలవాటు చేసుకోండి.

ఉష్ణోగ్రత..

ఫ్రిజ్ ఉష్ణోగ్రత చాలా తక్కువగా లేదా ఎక్కువగా ఉంచడం కూడా మంచిది కాదు. సాధారణంగా ఫ్రిజ్ లోపలి ఉష్ణోగ్రత 3°C నుండి 5°C మధ్యలో ఉండాలి. దీని కంటే చల్లగా ఉంచితే విద్యుత్ వినియోగం పెరుగుతుంది. వేడిగా ఉంచితే ఆహారం త్వరగా చెడిపోతుంది.

44
డోర్ సీల్‌ని పరిశీలించండి..

ఫ్రిజ్ తలుపు చుట్టూ ఉండే రబ్బరు సీల్ గాలి లీక్ కాకుండా నిరోధిస్తుంది. అది దెబ్బతిన్నట్లయితే లేదా కరిగిపోయినట్లయితే, చల్లని గాలి బయటకు వెళ్ళిపోతుంది. దీని వల్ల ఫ్రిజ్ నిరంతరం పనిచేస్తూ ఎక్కువ శక్తి వాడుతుంది. సీల్ సరిగ్గా పనిచేస్తోందో లేదో తరచుగా చెక్ చేయండి.అవసరమైతే దానిని మార్చించండి.

5. తలుపు ఎక్కువసేపు తెరిచి ఉంచవద్దు

కొంతమంది ఫ్రిజ్ తలుపు తెరిచి పదార్థాలు వెతకడానికి ఎక్కువ సమయం తీసుకుంటారు. దీని వల్ల బయట నుండి వేడి గాలి లోపలికి చేరి చల్లదనాన్ని తగ్గిస్తుంది. ఫలితంగా, కంప్రెసర్ ఎక్కువసేపు పనిచేయాల్సి వస్తుంది. కావున, అవసరం ఉన్నప్పుడు మాత్రమే ఫ్రిజ్ తలుపు తెరచి వెంటనే మూసేయండి.

6. శబ్దాలను నిర్లక్ష్యం చేయవద్దు

ఫ్రిజ్ నుండి ఎవైనా శబ్దాలు వస్తే వాటిని నిర్లక్ష్యం చేయకండి. ఇవి కాయిల్, ఫ్యాన్ లేదా కంప్రెసర్‌లో సమస్యల సంకేతం కావచ్చు. వెంటనే టెక్నీషియన్‌ను సంప్రదించి సమస్యను పరిష్కరించండి. చిన్న సమస్యను సమయానికి సరిచేయకపోతే, ఫ్రిజ్ పాడయ్యే ప్రమాదం ఉంది.

Read more Photos on
click me!

Recommended Stories