హై మంట మీద వంట చేయడం..
ప్రెజర్ కుక్కర్ లో వంట చేసేటప్పుడు ఎక్కువ మంట మీద అస్సలు వండకూడదు. ఎక్కువ మంట పెడితే.. కుక్కర్ లో ఫుడ్ మాడిపోయే అవకాశం ఉంది. అంతేకాదు.. సమానంగా కూడా ఉడకదు. అందుకే, మీియం ఫ్లేమ్ మీద మాత్రమే వంట చేయాలి. దీనివల్ల వంటకం మెత్తగా ఉడుకుతుంది. రుచి కూడా అద్భుతంగా వస్తుంది.
4. తగినంత నీరు పోయకపోవడం..
ప్రెజర్ కుక్కర్ ఆవిరి ద్వారా పనిచేస్తుంది. కాబట్టి తగినంత నీరు లేకపోతే అది సరిగ్గా పనిచేయదు. అంతేకాకుండా కుక్కర్ అడుగు మాడిపోయి, పాత్ర దెబ్బతింటుంది. కాబట్టి... దేనికి ఎంత నీరు అవసరమో అంతే పోయాలి. అప్పుడే వంట రుచిగా వస్తుంది.
5. ప్రెజర్‌ను తప్పుగా విడుదల చేయడం..
కుక్కర్‌లోని ఆవిరిని ఎలా బయటకు వదులుతున్నారు అనేదానిపై మీ వంట రుచి ఆధారపడి ఉంటుంది. స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే.. కుక్కర్ విజిల్ తీయడానికి ప్రయత్నించొద్దు. ఆఫ్ చేసిన తర్వాత సహజంగా ఆవిరి పోయేంత వరకు ఆగితే.. ఆ వంటకు రుచి పెరుగుతుంది. కమ్మగా కూడా ఉంటాయి.