
బాదం, జీడిపప్పు, వాల్‌నట్, పిస్తా లాంటివి ఖరీదైన డ్రైఫ్రూట్స్. వీటిని కొన్న తరువాత సరిగా స్టోర్ చేయకపోతే కొన్ని రోజులకే మెత్తగా మారిపోతాయి. ఒక్కోసారి వింత వాసన కూడా వస్తాయి. దీనికి ప్రధాన కారణాలు వేడి, గాలి, వెలుతురు, తేమ. ఈ గింజల్లో సహజంగానే కొవ్వు శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది గాలిలోని ఆక్సిజన్‌తో కలిసినప్పుడు కాలక్రమేణా రుచి, వాసన మారిపోతాయి. దీన్నే ఫ్యాట్ ఆక్సిడేషన్ అంటారు.
అలాగే, వాతావరణంలో తేమ ఎక్కువగా ఉంటే బాదం, జీడిపప్పు ఆ తేమను పీల్చుకుని క్రిస్పీగా ఉండే స్వభావాన్ని కోల్పోతాయి. తేమ అలాగే ఉంటే ఫంగస్ వచ్చే ప్రమాదం కూడా ఉంది. అందుకే వీటిని నిల్వ చేసేటప్పుడు గాలి, వేడి, వెలుతురు, తేమ... ఈ నాలుగింటిని కంట్రోల్ చేయడం చాలా ముఖ్యం.
సరైన పద్ధతిలో నిల్వ చేస్తే ఈ డ్రై ఫ్రూట్స్ ఫ్రిడ్జ్‌లో 6 నెలలు, ఫ్రీజర్‌లో ఏకంగా ఏడాది పాటు ఫ్రెష్‌గా ఉంటాయి.
అన్ని డ్రై ఫ్రూట్స్‌కు ఒకే రకమైన జీవితకాలం ఉండదు. డ్రై ఫ్రూట్ రకం, ప్యాకింగ్ విధానం, గది ఉష్ణోగ్రతను బట్టి వాటి జీవితంకాలం మారుతుంది.
ఫ్రిడ్జ్‌లో: సుమారు 6 నెలల వరకు నాణ్యత తగ్గకుండా ఉంటాయి.
ఫ్రీజర్‌లో: గట్టిగా మూతపెట్టి ఉంచితే ఏడాది లేదా అంతకంటే ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి.
గది ఉష్ణోగ్రత వద్ద: సుమారు 1 నెల.
ఫ్రిడ్జ్‌లో: సుమారు 6 నెలల వరకు.
ఫ్రీజర్‌లో: ఏడాది పాటు ఫ్రెష్‌గా ఉంటాయి.
వాల్‌నట్స్‌లో పాలీ అన్‌శాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువ. కాబట్టి వీటిని వేడిగా ఉండే చోట ఎక్కువ రోజులు ఉంచకూడదు.
గది ఉష్ణోగ్రత వద్ద: సుమారు 1 నెల.
ఫ్రిడ్జ్‌లో: సుమారు 6 నెలలు.
ఫ్రీజర్‌లో: ఏడాది పాటు నిల్వ చేయొచ్చు.
గది ఉష్ణోగ్రత వద్ద: సుమారు 1-2 నెలలు.
ఫ్రిడ్జ్‌లో: సుమారు 6 నెలల వరకు.
ఫ్రీజర్‌లో: ఏడాది పాటు ఫ్రెష్‌గా ఉంటాయి.
వీటిలో తేమ ఉంటుంది కాబట్టి బాదం, జీడిపప్పు కంటే కాస్త భిన్నంగా నిల్వ చేయాలి.
గది ఉష్ణోగ్రత వద్ద: సుమారు 1-2 నెలలు.
ఫ్రిడ్జ్‌లో: 6 నెలల వరకు మంచి కండిషన్‌లో ఉంటాయి.
ఖర్జూరం రకం, అందులో ఉండే తేమను బట్టి నిల్వ ఉండే కాలం మారుతుంది.
గది ఉష్ణోగ్రత వద్ద: సుమారు 1 నెల.
ఫ్రిడ్జ్‌లో: 6 నెలల వరకు నిల్వ చేయొచ్చు.
డ్రై ఫ్రూట్స్ సరిగా నిల్వ చేస్తే ఎక్కువకాలం తాజాగా ఉంటాయి. తుందన్నదే ఇక్కడ ముఖ్యం.
గాలి చొరబడని మూత ఉండే గాజు డబ్బాలో డ్రైఫ్రూట్స్ ను ఎక్కువ కాలం నిల్వ చేయడానికి బెస్ట్ ఆప్షన్. దీనివల్ల లోపల ఏముందో ఈజీగా చూడొచ్చు. డ్రైఫ్రూట్స్ ఎలాంటి వాసనను పీల్చుకోవు.
గట్టిగా మూతపడే స్టీల్ డబ్బా కూడా మంచి ఆప్షనే.
అయితే స్టీల్ డబ్బా అనగానే గాలి చొరబడదని కాదు. మూత టైట్‌గా పడుతుందో లేదో చెక్ చేసుకోవాలి.
ఫుడ్ గ్రేడ్ క్వాలిటీ ఉన్న ప్లాస్టిక్ డబ్బాలను వాడొచ్చు. కానీ నాసిరకం లేదా మూత సరిగా పడని ప్లాస్టిక్ డబ్బాలను ఎక్కువ కాలం నిల్వ చేయడానికి వాడకపోవడమే మంచిది.
గాలి చొరబడని గాజు డబ్బా లేదా గట్టిగా మూతపడే స్టీల్ డబ్బా... ఈ రెండూ ఇంట్లో వాడటానికి బెస్ట్. డబ్బా పేరు కంటే గాలి, తేమ లోపలికి వెళ్లకుండా చూసుకోవడమే అసలైన ట్రిక్. బాదం నిల్వ గైడ్‌లైన్స్‌లో కూడా తేమ, గాలి చొరబడకుండా ఉండే మంచి ప్యాకేజింగ్ చాలా ముఖ్యమని చెప్పారు.