Spices:బ్రిటీష్ వారు మన దేశాన్ని చాలా సంవత్సరాల పాటు పాలించిన విషయం తెలిసిందే. స్వతంత్రం తర్వాత వారు తిరిగి వాళ్ల దేశానికి వెళ్తూ వెళ్తూ.. మన దేశం నుంచి కొన్నింటిని తీసుకొని వెళ్లారు. వాటిల్లో మసాలా దినసులు కూడా ఉన్నాయి.
మధ్య యుగ కాలంలో యూరప్ దేశాలకు మన భారతదేశం అంటే ఒక అద్భుతమైన ప్రపంచం. ఇక్కడి సుగంధ ద్రవ్యాల కోసం ఫ్రెంచ్, ఇంగ్లీష్, డచ్ దేశాల మధ్య భీకరమైన వ్యాపార యుద్ధాలే జరిగాయి. చివరకి మన దేశంలో దొరికే మసాలాల కోసమే.. మన దేశాన్ని వలస రాజ్యంగా మార్చుకున్నారు. భారతీయ వంటలకు ప్రత్యేకమైన రుచి, వాసననుు అందించే మసాలాలపై వారి కన్నుపడింది. అందుకే, 1947లో మన దేశాన్ని విడిచిపెట్టి వెళ్లేటప్పుడు.. బ్రిటీష్ వారు ఇక్కడి మసాలా దినుసులను తమ దేశానికి ఎగుమతి చేసుకున్నారు. వాటిని ఇప్పటికీ, తమ యూరోపియన్ వంటల్లో విరివిగా వాడుతూ ఉంటారు. ఆ మసాలాలు ఏంటో చూద్దాం...
24
1.జీలకర్ర...
ప్రపంచ జీలకర్ర ఉత్పత్తిలో ఏకంగా 70 శాతం మన భారత దేశానిదే. బ్రిటీష్ వారు తమ దేశంలోని చాలా రకాల మాంసం వంటకాల్లో ఈ జీలకర్రను ఉపయోగిస్తారు. అంతేకాదు, ఫ్రాన్స్ లోని కొన్ని సంప్రదాయ రొట్టెలు, లీడెన్ చీజ్ తయారీలోనూ దీనిని వాడతారు.
నల్ల మిరియాలు..
ఒకప్పుడు మిరియాలు ఎంత విలువైనవంటే.. వాటిని కరెన్సీలా, తాకట్టు వస్తువులా కూడా వాడేవారు. డచ్ భాషలో "మిరియం అంత ఖరీదైనది" అని అర్థం. అంటే..దాని విలువ ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ప్రపంచ మసాలా వ్యాపారంలో ఐదో వంతు మిరియాలదే వాటా. బ్రిటిష్ వారు స్కోన్లు , హాట్‌పాట్‌లు, మాంసాహార వంటకాల్లో దీనిని తప్పనిసరిగా వాడతారు.
34
దాల్చిన చెక్క..
మన దేశం నుంచి వారు తీసుకెళ్లిన మరో ముఖ్యమైన మసాలా దాల్చినచెక్క. బ్రిటిష్ వారు కబాబ్‌లు, కర్రీల తయారీతో పాటు కేకులు బేకింగ్ చేయడానికి, కాఫీ లేదా హాట్ చాక్లెట్ వంటి వేడి పానీయాలకు అద్భుతమైన సువాసన కోసం దీనిని విరివిగా ఉపయోగిస్తారు.
మన సాంప్రదాయ 'పసుపు పాలు' ఇప్పుడు స్టార్‌బక్స్ వంటి గ్లోబల్ కేఫ్‌లలో 'టర్మరిక్ లాటే' రూపంలో ప్రపంచాన్ని ఊపుతెస్తున్నాయి. ఆయుర్వేదం శతాబ్దాలుగా చెబుతున్న పసుపులోని ఔషధ గుణాలను ఇప్పుడు పాశ్చాత్య దేశాలు గుర్తించాయి. బ్రిటిష్ వారు చేపల కూరలు, సూప్‌లు, పిలాఫ్లతో పాటు పచ్చళ్లకు ఆకర్షణీయమైన రంగు, రుచి కోసం పసుపును ఉపయోగిస్తున్నారు.
ధనియాల పొడి :
బ్రిటిష్ వారు మన దేశంలో గడిపిన 200 ఏళ్ల కాలంలో ధనియాల పొడి మాయలో పడిపోయారు. స్థానికులు భరించలేని కారాన్ని తగ్గించడానికి గరం మసాలాలో ధనియాల పొడిని కలిపి అద్భుతమైన సువాసనను సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం లండన్‌లోని హై-ఎండ్ రెస్టారెంట్లలో డెజర్ట్‌లకు సిట్రస్ ఫ్లేవర్ ఇవ్వడానికి, బెల్జియన్ వీట్ బీర్ల తయారీలోనూ దీనిని ఉపయోగిస్తున్నారు.