చిన్న వయసులోనే తెల్ల జుట్టు వచ్చిందా ? ఇవి తింటే వెంట్రుకలు నల్లగానే ఉంటాయి

Published : Sep 09, 2025, 01:33 PM IST

ఒకప్పుడు 40, 50 ఏండ్ల తర్వాతే తెల్ల వెంట్రుకలు వచ్చేవి. ఇప్పుడు 30 ఏండ్లకే జుట్టంతా తెల్లగా అయిపోతుంది. అయితే కొన్ని రకాల ఆహారాలను తింటే తెల్ల వెంట్రుకలు రావడం తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే?

PREV
16
తెల్ల జుట్టు

వయసు పెరుగుతున్న కొద్ది తెల్ల జుట్టు రావడం చాలా కామన్. కానీ ఈ రోజుల్లో తెల్ల వెంట్రుకలు చిన్న వయసులోనే వస్తున్నాయి. ముఖ్యంగా 20, 30 ఏండ్లలోపే జుట్టంతా తెల్లవెంట్రుకలు వస్తున్నాయి. దీనికి ఎన్నో కారణాలు ఉన్నాయి. జెనెటిక్స్, మనం తినే ఫుడ్, జీవనశైలి, హెయిర్ కేర్ సరిగ్గా లేకపోవడం వంటి వివిధ కారణాల వల్ల జుట్టు తెల్లగా అవుతుంది. అయితే కొన్ని ఆహారాలను తింటే గనుక తెల్ల వెంట్రుకలు రావడం తగ్గుతుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం.. 

26
తెల్ల జుట్టుకు కారణాలు

నిపుణుల అభిప్రాయం ప్రకారం..మన జుట్టుకు వివిధ రకాల విటమిన్లు, ఖనిజాలు, సూక్ష్మపోషకాలు చాలా అవసరం. ఇవన్ీన తగ్గినప్పుడు జుట్టు ఊడిపోవడం, తెల్లబడటం, డ్రైగా మారడం వంటి సమస్యలు వస్తాయి. అలాగే ఒత్తిడి వల్ల కూడా జుట్టు చిన్నవయసులోనే తెల్లబడుతుందని నిపుణులు అంటున్నారు. 

36
కరివేపాకు

కరివేపాకు మన జుట్టుకు ఎంతో మేలు చేస్తుంది. దీనిలో ఉండే ఔషదగుణాలు జుట్టును నల్లగా ఉంచడానికి, హెయిర్ ఫాల్ ను తగ్గించడానికి సహాయపడతాయి.10 కరివేపాకు ఆకులను ప్రతిరోజూ పరిగడుపున నమిలి తింటే మెలనిన్ ఉత్పత్తి పెరిగి జుట్టు తెల్లబడటం తగ్గుతుంది. అలాగే జుట్టు నల్లగా, ఒత్తుగా పెరుగుతుంది. 

46
ఉసిరికాయ

ఉసిరి మన జుట్టుకు చేసే మేలు అంతా ఇంతా కాదు. దీనిలో పుష్కలంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి జుట్టు మూలాలకు చేరి తెల్లబడటాన్ని తగ్గించడానికి సహాయపడతాయి. కాబట్టి తెల్ల జుట్టు రాకుండా ఉండటానికి మీరు ఉసిరికాయ జ్యూస్ ను తాగొచ్చు. లేదా రోజూ ఒక ఉసిరికాయను తిన్నా సరిపోతుంది. 

56
నల్ల నువ్వులు

మన ఆరోగ్యానికి నల్ల నువ్వులు చాలా మంచివి. అంతేకాదు ఇవి మన జుట్టుకు కూడా ప్రయోజనకరంగా ఉంటాయి. నల్ల నువ్వులు ఆక్సీకరణ ఒత్తిడి తగ్గించి జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి సహాయపడుతాయి. అలాగే చిన్న వయసులో తెల్ల జుట్టు రాకుండా ఉండటానికి కూడా ఇది సహాయపడుతుంది. మీరు గనుక ప్రతిరోజూ ఒక టీస్పూన్ నల్ల నువ్వుల నూనెను జుట్టుకు పెట్టుకుంటే జుట్టు నల్లగా ఉంటుంది. లేదా మీరు వాడే నూనెలో కలిపి దీన్ని జుట్టుకు రాసుకున్నా సరిపోతుంది. 

66
నల్ల జీలకర్ర

నల్ల జీలకర్రలో ఎన్నో ఔషదగుణాలుంటాయి. ఇది మన ఆరోగ్యానికి చాలా మంచిది. అంతేకాదు ఇది జుట్టుకు కూడా మేలు చేస్తుంది. ఇది నెత్తిమీద రక్తప్రసరణను పెంచి జుట్టు పెరగడానికి సహాయపడుతుంది. అలాగే తెల్ల జుట్టు రాకుండా ఉండటానికి సహాయపడుతుంది. ఈ నల్లజీలకర్ర హెయిర్ ప్యాక్ ను వారానికి ఒకటి రెండు సార్లు వేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. 

Read more Photos on
click me!

Recommended Stories