నాలుగు పదులు దాటినా తరగని అందం.. కాజోల్ బ్యూటీ సీక్రెట్స్ ఇవే..

Published : Sep 27, 2021, 05:00 PM IST

అజయ్ దేవగన్‌తో వివాహం తర్వాత కాజోల్ ఇద్దరు పిల్లలకు తల్లిగా బిజీగా మారిపోయింది. అయితే, సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చింది.. అంతేకానీ పూర్తిగా మానేయలేదు. పెళ్లి తరువాత దిల్ వాలే సినిమాతో అదే జోష్ తో కుర్రకారును ఉర్రూతలూపింది. 

PREV
19
నాలుగు పదులు దాటినా తరగని అందం.. కాజోల్ బ్యూటీ సీక్రెట్స్ ఇవే..

దిల్ వాలే దుల్హనియా లే జాయింగే.. కుచ్ కుచ్ హోతాహై... లాంటి సినిమాలతో కుర్రకారు హృదయాల్ని కొల్లగొట్టిన అందాల హీరోయిన్ కాజల్. ఆ తరువాత బాలీవుడ్ మీరో అజయ్ దేవగన్ ను పెళ్లి చేసుకుని కాజోల్ దేవ్ గన్ గా మారిపోయింది. ఆ తరువాత సినిమాలకు కొద్ది కాలంపాటు దూరమయ్యింది. 

29

అజయ్ దేవగన్‌తో వివాహం తర్వాత కాజోల్ ఇద్దరు పిల్లలకు తల్లిగా బిజీగా మారిపోయింది. అయితే, సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చింది.. అంతేకానీ పూర్తిగా మానేయలేదు. పెళ్లి తరువాత దిల్ వాలే సినిమాతో అదే జోష్ తో కుర్రకారును ఉర్రూతలూపింది. పెళ్లై, ఇద్దరు పిల్లల తల్లైనా తనలోని తరగని అందానికి రహస్యాలు ఆమె స్వయంగా చెప్పుకొచ్చింది. 

39

కాజోల్ ఏ సినిమాలో నటించినా.. తనదైన ప్రత్యేకతను చాటుకుంటుంది. అన్ని పాత్రల్లో కెళ్లా తను ప్రత్యేకంగా ఉండేలా జాగ్రత్తగా చూసుకుంటుంది.  అంతేకాదు పెళ్లై 20 యేళ్లు గడుస్తున్నా మునుపటి అదే అందంతో మెరిసిపోవడానికి మొదటి కారణం తన డైట్ అని చెబుతోంది. 

49

కాజోల్ కు ఫాస్ట్ ఫుడ్ అస్సలు ఇష్టం ఉండదట. తన ఫుడ్ లో ఎక్కువగా కాజోల్ పండ్లు, నీరు ఉండేలా చూసుకుంటుంది. దీంతోపాటు తేలికపాటి భోజనంపైనే ఎక్కువ దృష్టి పెడుతుంది.

59

అంతేకాదు ఆమె అనుసరించే డైట్ ప్లాన్ ప్రకారం ప్రతిరోజూ ఆహారం తీసుకుంటుంది. ఫాస్టింగ్ ల జోలికి వెళ్లదు. అంతేకాదు కాజోల్ కు పంజాబీ ఫుడ్‌ అంటే చాలా ఇష్టం. అయితే, ఎంత ఇష్టం అయినా కాజోల్ ఆ ఫుడ్ ను నెలకు ఒకసారి మాత్రమే తింటుంది.

69

తినే ఫుడ్ చాలా హెల్తీగా ఉండేలా చూసుకుంటుంది. నెయ్యి, నూనెలు ఎక్కువగా ఉండే ఆహారాలకు దూరంగా ఉంటుంది. ఒకేసారి ఎక్కువ మొత్తంలో తినకుండా కొద్ది కొద్ది మొత్తాల్లో ఎక్కువ సార్లు తింటుంది. బరువు తగ్గే ప్రయత్నంలో కాజల్ తన ఆహారాన్ని నియంత్రించడానికి ఇష్టపడదు.

79

తన ఫిట్ నెస్ కోసం ఆరోగ్యకరమైన ఆహారాన్ని మాత్రమే కాజోల్ ఇష్టపడుతుంది. ఫిట్ నెస్ కోసం కేవలం ఆహారమే కాదు.. కాజోల్ ఆహారంతో పాటు వ్యాయామంపై కూడా శ్రద్ధ పెడుతుంది.

89

శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవడానికి ప్రతిరోజూ వర్కవుట్స్ చేస్తుంది. అలాగని జిమ్ ల చుట్టూ తిరగదు. జిమ్‌కు వెళ్లకుండా ఇంట్లోనే యోగా ద్వారా ఆరోగ్యంగా ఉండటానికి ప్రయత్నిస్తుంది.

99

కాజోల్ కి కాస్మెటిక్స్ అంటే పెద్దగా ఇష్టం ఉండదట. అందుకే తన అందం విషయంలో కాస్మిటిక్స్ ను తక్కువగా నమ్ముతుంది. అయితే అందాన్ని కాపాడుకోవడానికి ఇంటి రెమెడీలు ట్రై చేస్తుందట. సో.. కాజోల్ ని ఫాలో అవ్వండి.. మీరు మరింత అందంగా, యవ్వనంగా కనిపించాలంటే.. కాజోల్ చెబుతున్న ఈ సీక్రెట్స్ ఫాలో అయితే సరిపోతుంది. 

Read more Photos on
click me!

Recommended Stories