పిల్లల ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారా..?

First Published Sep 27, 2021, 2:42 PM IST

సోషల్ మీడియాలో పర్సనల్ ఫోటోలు షేర్ చేయడం.. అడల్ట్స్ తో పాటు..  చిన్నారులకు కూడా భవిష్యత్తులో సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

kids


ఈ రోజుల్లో సోషల్ మీడియా వాడని వారంటూ ఎవరూ ఉండరేమో.  టీనేజ్ పిల్లల దగ్గర నుంచి.. ముసలివారి దాకా.. అందరూ అదే ప్రపంచంగా బతికేస్తున్నారు.  ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు,.. తమ జీవితంలోని ప్రతి విషయాలను ఆ సోషల్ మీడియాలోనే పెట్టేస్తున్నారు. 


కొందరు అప్పుడే పుట్టిన తమ చిన్నారుల ఫోటోలను కూడా  షేర్ చేస్తూ ఉంటారు. అయితే..  అసలు చిన్నారుల ఫోటోలను షేర్ చేయకూడదని నిపుణులు సూచిస్తున్నారు.అలా ఫోటోలు షేర్ చేయడం వల్ల కలిగే నష్టాలేంటో..దీని గురించి నిపుణులు ఏం చెబుతున్నారో ఓసారి చూద్దాం..

kids


సోషల్ మీడియాలో పర్సనల్ ఫోటోలు షేర్ చేయడం.. అడల్ట్స్ తో పాటు..  చిన్నారులకు కూడా భవిష్యత్తులో సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

kids

ఈ రోజుల్లో తమ చిన్నారుల ఫోటోలను షేర్ చేసుకోవాలని ఆత్రుత చూపిస్తుంటారు. ఇలా షేర్ చేసుకోవడం లో తప్పులేదు. కానీ.. అందులో కొంత లిమిటేషన్ ఉండాలని చెబుతున్నారు. ఏవి పడితే అవి షేర్ చేయకూడదని చెబుతున్నారు.
 

kids

ఇలా ఫోటోలను షేర్ చేసుకోవడం వల్ల.. వాటిని మిస్ యూస్ చేసేవాళ్లు చాలా మంది ఉంటారట. సైబర్ నేరగాళ్లు బాగా పెరుగుతున్న ఈ సమయంలో.. ఇలా ఆ ఫోటోలను మార్ఫింగ్ చేయడం.. లేదా ఇంకేదైనా మిస్ యూస్ చేసే అవకాశాలు ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

kids

పిల్లల స్కూల్ అడ్రస్,  ఇంటి అడ్రస్, కోచింగ్ సెంటర్ ఎక్కడికి వెళ్తున్నారు..  ఇలాంటి విషయాలను షేర్ చేయడం అంత మంచిది కాదట. వాటి ఆధారంగా కిడ్నాపర్స్ మీ పిల్లల సమాచారం తెలుసుకొని.. ఆ తర్వాత  కిడ్నాప్ చేసే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి.. మీ పిల్లల ఇలాంటి సమచారాన్ని  అస్సలు షేర్ చేయకూడదట.

kids

ముద్దుగా ఉంటారని  చెప్పి.. చాలా మంది పిల్లలను డ్రెస్ లు లేకుండా ఫోటోలు తీస్తుంటారు. అయితే.. వాటిని షేర్ చేయడం కూడా చాలా ప్రమాదమట.  అవి చిన్నప్పటి ఫోటోలు అయినా.. కూడా పెద్దయ్యాక అయినా వారికి ఇబ్బందిగా మారే ప్రమాదం ఉందట.

అంతేకాకుండా.. పిల్లల మెడికల్ రిపోర్ట్స్, పాస్ పోర్ట్, ఐడెంటిటీ కార్డ్స్ లాంటివి కూడా పొరపాటున కూడా సోషల్ మీడియాలో  షేర్ ఛేయకూడదట. వాటిని హ్యాకర్లు మిస్ యూస్ చేసే ప్రమాదం ఉంది.
 

kids

మీ పిల్లల.. బలాలు, బలహీనతలు, వారికి ఉన్న బీహేవియరల్ సమస్యలు లాంటివి కూడా సోషల్ మీడియాలో షేర్ చేయకూడదట. మీ పిల్లల సమస్యలను ఎదుటివారికి చెప్పడం వారికి మంచిది కాదు.

మీ పిల్లలను ఎంబారిసింగ్ కి గురిచేసే ఫోటోలు, వీడియోలు కూడా షేర్ చేయకూడదు. అలా షేర్ చేయడం వల్ల పిల్లలకు.. భవిష్యత్తులో వారి సోషల్ ప్లాట్ ఫాం లో అడుగుపెట్టే సమయంలో.. ఇబ్బంది పడే ప్రమాదం ఉంటుందట.
 

click me!