చదునైన పొట్ట కోసం.. చక్కటి పరిష్కారాలు...

Published : Sep 27, 2021, 03:42 PM IST

ఆహార విషయంలో అనేక నిబంధనలు పెట్టుకుంటారు. స్ట్రిక్ట్ వ్యాయామాలు చేస్తారు. అయినా సరే ఫ్లాట్ పొట్ట అసాధ్యంగా మారుతుంది. ఇక ఈ లక్ష్యాన్ని చేరుకోవాలంటే నెలలు, సంవత్సరాలు కూడా పడుతుంది. 

PREV
110
చదునైన పొట్ట కోసం.. చక్కటి పరిష్కారాలు...

సన్నగా, నాజూగ్గా ఉండాలని కోరుకోని వారుండరు.  అంతేకాదు కాస్త బొద్దుగా ఉన్నా సరే కానీ.. పొట్ట మాత్రం ఫ్లాట్ గా ఉండాలని కోరుకుంటారు. పిసరంతైనా పొట్ట కనిపించకుండా ఉండాలని ట్రై చేస్తుంటారు. నడుం చుట్టూ పేరుకుపోయికొవ్వు వల్ల ఏర్పడే పొట్టను తగ్గించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తారు. 

210

ఆహార విషయంలో అనేక నిబంధనలు పెట్టుకుంటారు. స్ట్రిక్ట్ వ్యాయామాలు చేస్తారు. అయినా సరే ఫ్లాట్ పొట్ట అసాధ్యంగా మారుతుంది. ఇక ఈ లక్ష్యాన్ని చేరుకోవాలంటే నెలలు, సంవత్సరాలు కూడా పడుతుంది. ఏదేమైనా, చదునైన పొట్ట కోసం మీ సంకల్పం, దృఢ నిశ్చయం మిమ్మల్ని ట్రాక్‌లో ఉంచటానికి సహాయపడుతుంది. దీనికోసం మీ కష్టానికి తోడు కొన్ని ప్రభావవంతమైన చిట్కాలు, ఉపాయాలు తోడైతే ఫ్టాట్ పొట్ట అంత కష్టమైన విషయం ఏమీ కాదు. 

310

సరైన లక్ష్యాలు : మీరు చక్కటి ఫలితాలు చూడాలనుకుంటే సహేతుకమైన, వాస్తవికమైన లక్ష్యాలను నిర్దేశించుకోవాలి. బరువు తగ్గడం, బలమైన అబ్స్ పొందడం, నెలలు.. కొన్నిసార్లు సంవత్సరాలు పడుతుంది. కాబట్టి మీరు సాధించలేని లక్ష్యాలను నిర్దేశించుకోవడం కంటే చిన్న చిన్న టార్గెట్స్ పెట్టుకోవడం చాలా ముఖ్యం. ఇలా చేయడం వలన మీరు మరింత స్థిరంగా ఉంటారు. ఇది మీరు కోరుకున్న ఫలితాలను పొందడంలో మీకు సహాయపడుతుంది. బొడ్డు కొవ్వును తగ్గించడం, పొత్తికడుపు కండరాలను టోన్ చేయడం, చదునైన కడుపుని పొందడం  శ్రమతో కూడుకున్న ప్రక్రియ. కాబట్టి మీ లక్ష్యం దిశగా మీ ప్రయాణాన్ని ఎలా మొదలు పెట్టాలో జాగ్రత్తగా గమనించుకోండి. 

410

పిలట్స్ : ప్లాట్ పొట్ట కోసం చేసే మీ ప్రయాణాన్ని ప్రారంభించడానికి లో ఇంపాక్ట్  పిలేట్స్ మంచివి. వీటివల్ల శరీరం చక్కటి ఆకారాన్ని పొందడంతో పాటు గట్టి ఆబ్స్ కు కూడా సహాయపడతాయి. పైలేట్స్ మీ కండరాలను బలోపేతం చేయడంలో సహాయపడటమే కాకుండా, శరీరం ఫ్లెక్సిబులిటీకి కూడా సహాయపడతాయి. పైలేట్స్ ముఖ్యంగా కోర్ నులక్ష్యంగా చేసుకుంటాయి, కానీ శరీరంలోని ఇతర భాగాలపై కూడా పనిచేస్తాయి. ఈ పిలెట్స్ వ్యాయామాన్ని ఎక్వీప్ మెంట్ తోనూ, ఎక్వీప్ మెంట్ లేకుండానూ చేయవచ్చు, కానీ దృష్టి శ్వాస మీద ఉండాలి. నెమ్మదిగా మరియు సున్నితమైన కదలికలను కలిగి ఉండాలి.

510

హోల్ బాడీ ఎక్సర్ సైజులు : మీ పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వును కరిగించాలంటే.. తద్వారా ప్లాట్ బెల్లీ పొందాలంటే.. వ్యాయామ సమతుల్యత అవసరం. దీనికోసం కేవలం పొట్ట భాగానికి సంబంధించిన వ్యాయామాలతో పాటు, పూర్తి శరీరానికి సంబంధించిన వ్యాయామాలను రోజూ చేయాలి. మీ అబ్స్ మాత్రమే కాకుండా, గ్లూట్స్, హామ్ స్ట్రింగ్స్, వీపు, కాళ్లు కూడా పని చేయాలి. అప్పుడే మీరు స్థిరంగా ఉంటారు. శరీరంలోని నిర్దిష్ట భాగాన్ని ఫోకస్ చేయగలిగినంత సన్నగా ఉంటారు.

610

ఆబ్-వర్కౌట్‌లు : ప్లాట్ పొట్ట కోసం అనేక అబ్-బిల్డింగ్ వర్కౌట్‌లు అందుబాటులో ఉన్నాయి. ప్లాంక్ వేరియేషన్స్, స్క్వాట్స్, సిట్-అప్‌లు, బైసికిల్ క్రంచెస్, బర్పీలు, మౌంటెన్ క్లైంబర్స్ అన్నీ మీ కోర్ని బలోపేతం చేయడానికి,  శరీరం మొత్తం పనితీరును మెరుగుపరచడంలో సహాయపడే ప్రభావవంతమైన వ్యాయామాలు. ఏదేమైనా, ఇవి టోల్-టేకింగ్ కావచ్చు, కాబట్టి నెమ్మదిగా ప్రారంభించండి. మిమ్మల్ని మీరు ఒత్తిడికి లోను చేసుకోకండి. మీ ఆబ్స్ పే పనిచేయడానికి స్థిరత్వం అవసరం, అది మీ సామర్థ్యాలకు మించి పనిచేస్తూ పోతుంది.

710

ఆహారం చాలా ముఖ్యం : వ్యాయామాలతో పాటు, మీ ఆహారం మీద కూడా దృష్టి పెట్టాలి. అధిక కేలరీలకూ దూరంగా ఉండాలి. బెల్లీ ఫ్యాట్ అనేది శరీరంలోని అత్యంత మొండి కొవ్వులలో ఒకటి, ఇందులో విసెరల్ ఫ్యాట్ ప్రమాదకరంగా ఉంటుంది. దీర్ఘకాలిక అనారోగ్యాలకు గురి చేస్తుంది.

810

అనారోగ్యకరమైన ప్రాసెస్డ్ ఫుడ్స్, చక్కెర పానీయాలను తగ్గించాలి. అతిగా తినకుండా కంట్రోల్ చేసుకోండి. పోషకాలను అందించే, పొట్టను ఎక్కువ సేపు నిండుగా ఉండేలా చేసే ఫైబర్ అధికంగా ఉండే, ఆరోగ్యకరమైన ఆహారాలు, పండ్లను తినాలి. ఆహారంలో ఇటువంటి తగ్గింపులు మీ లక్ష్యాలను త్వరగా సాధించడంలో మీకు సహాయపడతాయి.

910

హైడ్రేటెడ్‌గా ఉండండి : దీనికోసం పుష్కలంగా నీరు త్రాగాలి. బరువు తగ్గడానికి నీరు ఉత్తమ పానీయం. ఏ ఇతర ఆహారం లేదా పానీయాల మాదిరిగా కాకుండా, నీరు సురక్షితమైనది. మిమ్మల్ని హైడ్రేట్ చేస్తుంది. ప్రతి భోజనానికి ముందు నీరు తాగడం వలన అధిక కేలరీల ఆహారాన్ని దూరంగా ఉంచడం, అతిగా తినాలనే కోరికను కూడా నివారించవచ్చు. ఇది మిమ్మల్ని ఎక్కువ కాలం సంతృప్తిగా ఉండటానికి సహాయపడుతుంది, తద్వారా మీరు అతిగా తినే అవకాశం తక్కువగా ఉంటుంది.
 

1010

హైడ్రేటెడ్‌గా ఉండండి : దీనికోసం పుష్కలంగా నీరు త్రాగాలి. బరువు తగ్గడానికి నీరు ఉత్తమ పానీయం. ఏ ఇతర ఆహారం లేదా పానీయాల మాదిరిగా కాకుండా, నీరు సురక్షితమైనది. మిమ్మల్ని హైడ్రేట్ చేస్తుంది. ప్రతి భోజనానికి ముందు నీరు తాగడం వలన అధిక కేలరీల ఆహారాన్ని దూరంగా ఉంచడం, అతిగా తినాలనే కోరికను కూడా నివారించవచ్చు. ఇది మిమ్మల్ని ఎక్కువ కాలం సంతృప్తిగా ఉండటానికి సహాయపడుతుంది, తద్వారా మీరు అతిగా తినే అవకాశం తక్కువగా ఉంటుంది.

Read more Photos on
click me!

Recommended Stories