నెలనెలా రూ.1,77,500 సాలరీ.. మేనేజర్ స్థాయిలో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, తెలుగు రాష్ట్రాల్లోనూ పోస్టింగ్

Published : Dec 01, 2025, 08:49 AM IST

లక్షల సాలరీతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు… సొంత రాష్ట్రంలోనే ఉద్యోగాన్ని పొందే అవకాశం… ఇంకెందుకు ఆలస్యం… ఈ ఉద్యోగాల గురించి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకొండి.. అన్ని అర్హతలుంటే వెంటనే అప్లై చేసుకొండి.. జాబ్ కొట్టండి. 

PREV
18
తెలుగు యువతకు బంపరాఫర్

Government Jobs : నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్... కేంద్ర ప్రభుత్వ పరిధిలోని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలచేసింది. మొత్తం 84 గ్రూప్ A, B & C కేటగిరీ పోస్టులను భర్తీ చేయనున్నారు. డిప్యూటీ మేనేజర్ నుంచి స్టెనోగ్రాఫర్ వరకు వివిధ పోస్టులకు శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేసేందుకు ఈ ప్రకటన వెలువడింది. దేశవ్యాప్తంగా ఎక్కడైనా పోస్టింగ్స్ ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం కోరుకునే అభ్యర్థులకు ఇది ఒక గొప్ప అవకాశం.

28
NHAI ఖాళీల వివరాలు

డిప్యూటీ మేనేజర్ (ఫైనాన్స్ & అకౌంట్స్) – 09

లైబ్రరీ & ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ – 01

జూనియర్ ట్రాన్స్‌లేషన్ ఆఫీసర్ – 01

అకౌంటెంట్ – 42

స్టెనోగ్రాఫర్ – 31

38
NHAI ఉద్యోగాలకు విద్యార్హతలు

డిప్యూటీ మేనేజర్‌ - MBA (ఫైనాన్స్)

లైబ్రరీ అసిస్టెంట్‌ - లైబ్రరీ సైన్స్‌లో డిగ్రీ

జూనియర్ ట్రాన్స్‌లేషన్ ఆఫీసర్‌ - హిందీ/ఇంగ్లీష్‌లో మాస్టర్ డిగ్రీ

అకౌంటెంట్ & స్టెనోగ్రాఫర్ పోస్టులకు డిగ్రీ అవసరం. కొన్ని పోస్టులకు ప్రత్యేక అర్హత, అనుభవం అవసరం.

48
వయోపరిమితి

జనరల్ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ట వయస్సు 30 ఏళ్లు

స్టెనోగ్రాఫర్‌ ఉద్యోగాలకు గరిష్ట వయస్సు 28 ఏళ్లు

ప్రభుత్వ నిబంధనల ప్రకారం SC/ST, OBC, PwBD, మాజీ సైనికులకు తగిన వయస్సు సడలింపు ఉంటుంది.

58
దరఖాస్తు విధానం

అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేయాలి.

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభ తేదీ : 30.10.2025 ఉదయం 10.00 గంటలు

దరఖాస్తుకు చివరి తేదీ : 15.12.2025 సాయంత్రం 06.00 గంటలు

దరఖాస్తు ఫీజు

SC/ST/PWD – ఉచితం

ఇతరులు – రూ.500

68
ఎంపిక విధానం

అభ్యర్థులను కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) + ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ కూడా ఉంటుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు చెన్నైలో కూడా పరీక్షా కేంద్రం ఉంటుందని గమనించాలి.

78
సాలరీ

ఈ పోస్టులు కేంద్ర ప్రభుత్వ జీతాల స్కేల్‌ను అనుసరిస్తాయి.

గ్రూప్ A – లెవెల్ 10 : 56,100 – 1,77,500 రూపాయలు

గ్రూప్ B – లెవెల్ 6 : 35,400 – 1,12,400 రూపాయలు

గ్రూప్ C – లెవెల్ 4 & 5 : 25,500 - 92,300 రూపాయలు

జీతంతో పాటు PF, DA, రవాణా భత్యం, వైద్య ప్రయోజనాలు వంటి వివిధ సౌకర్యాలు కూడా ఉంటాయి.

88
ఈ ఉద్యోగం వస్తే లైఫ్ సెటిల్

ఉన్నతమైన రంగంలో శాశ్వత ఉద్యోగం పొందాలనుకునే వారికి NHAI రిక్రూట్‌మెంట్ 2025 ఒక పెద్ద అవకాశం. విద్యా అర్హత, వయోపరిమితి సరిపోయే వారు వెంటనే అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపిక ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా జరుగుతుంది కాబట్టి ఈ ప్రకటన ప్రభుత్వ ఉద్యోగం ఆశించేవారికి కచ్చితంగా మంచి వార్త. దరఖాస్తు చేసే ముందు ప్రకటనను పూర్తిగా చదివి అర్హత, వయోపరిమితిని సరిచూసుకోవాలి. అర్హులైన వారు నేరుగా అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories