సంబంధిత విభాగాల్లో డిగ్రీ, అంతకంటే ఉన్నత విద్యార్హతలు కలిగివుండాలి. ఉద్యోగాన్ని బట్టి విద్యార్హతలు మారతాయి. ఎంబిఏ, సీఏ, ఎంబిబిఎస్, ఇంజనీరింగ్, సాధారణ డిగ్రీ అర్హతలతో ఉద్యోగాలున్నాయి. కనీసం 1 సంవత్సరం ఆయా విభాగాల్లో పనిచేసిన అనుభవం తప్పనిసరి. చీఫ్ మేనేజర్ పదవికి మాత్రం 12 ఏళ్ల అనుభవం కావాలి.
వయోపరిమితి పోస్టును బట్టి మారుతుంది
సీనియర్ మేనేజర్ – గరిష్ఠంగా 46 ఏళ్లు
సీనియర్ ఆఫీసర్ – గరిష్ఠంగా 33 ఏళ్లు
సీనియర్ ఇంజనీర్ – గరిష్ఠంగా 38 ఏళ్లు
మెడికల్ సర్వీస్ సీనియర్ ఆఫీసర్ – గరిష్ఠంగా 42 ఏళ్లు
ఎస్సి, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్ మెన్స్ కు వయోపరిమితి సడలింపు ఉంటుంది. దీంతో గరిష్ఠంగా 56 ఏళ్ళలోపు వయసువారు కూడా ఈ ఉద్యోగాలకు అర్హులు.