RRB NTPC Graduate Level Recruitment 2025 : మీరు డిగ్రీ పూర్తిచేసి వుంటే చాలు… వెంటనే ఇండియన్ రైల్వేలో స్టేషన్ మాస్టర్ వంటి ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
RRB NTPC Graduate Level Recruitment 2025: రైల్వేలో ఉద్యోగం సాధించాలని కలలుగనే నిరుద్యోగ యువతీయువకులకు ఇది ఓ సువర్ణావకాశం. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ (NTPC) కింద మొత్తం 5810 పోస్టుల భర్తీ ప్రక్రియ చేపట్టింది. అతి తక్కువ విద్యార్హతలతో కూడిన ఉద్యోగాలు కూడా ఇందులో ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు అవసరమైన అర్హతలు, పోస్టుల వారీగా ఖాళీలు, ఇతర ముఖ్యమైన వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
28
ఆర్‌ఆర్‌బి ఎన్‌టిపిసి పోస్టులు, ఖాళీల వివరాలు
గూడ్ ట్రైన్ మేనేజర్ - 3416
జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ - 921
స్టేషన్ మాస్టర్ - 615
చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ - 161
సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ 638
ట్రాఫిక్ అసిస్టెంట్ - 59
మొత్తం RRB NTPC కింద 5810 ఉద్యోగాలను భర్తీ చేస్తోంది.
38
ముఖ్యమైన తేదీలు
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం - 29 అక్టోబర్ 2025
దరఖాస్తుకు చివరి తేదీ - 20 నవంబర్ 2025
అప్లికేషన్ ఫీజు చెల్లించేందుకు చివరి తేదీ - 20 నవంబర్ 2025
పరీక్షలు, ఫలితాలకు సంబంధించిన తేదీలను తర్వాత ప్రకటించనుంది RRB.
కేవలం క్రెడిట్, డెబిట్ కార్డ్స్, నెట్ బ్యాకింగ్ వంటివాటి ద్వారా కేవలం ఆన్ లైన్ లోనే ఫీజు చెల్లించాలి. ఆఫ్ లైన్ లో అయితే ఈ-చలాన్ ద్వారా చెల్లించవచ్చు.
58
వయోపరిమితి
అభ్యర్థుల వయసు 18 నుండి 33 ఏళ్లలోపు ఉండాలి. 01 జనవరి 2026 వరకు వయసును పరిగణలోకి తీసుకుంటారు. రిజర్వేషన్ అభ్యర్థులకు వయోపరిమితి సడలింపు ఉంటుంది.
68
విద్యార్హతలు
చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్, స్టేషన్ మాస్టర్, గూడ్ ట్రైన్ మేనేజర్, ట్రాఫిక్ అసిస్టెంట్ ఉద్యోగాలకు డిగ్రీ లేదా అందుకు సమానమైన విద్యార్హతలు కలిగినవారు అర్హులు.
ఇక జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, సీనియర్ క్లర్క్ ఫ్రమ్ టైపిస్ట్ ఉద్యోగాలకు డిగ్రీతో పాటు ఇంగ్లీష్, హిందీలో టైపింగ్ నైపుణ్యం ఉండాలి.