సూ యుటాంగ్ చెబుతున్న విషయం అలాంటి కోవలోకే వస్తుంది. ఆమెను టార్గెట్ చేసిన చైనా ఏజెంట్లు సూ యుటాంగ్ ను కాల్ గర్ల్ గా పేర్కొంటూ.. ఆమె ఫోన్ నెంబర్, అడ్రస్ ను సోషల్ మీడియాలో పెట్టారు. దీంతో ఆమెకు ప్రతిరోజు వందలాది మెసేజ్లు, ఫోన్ కాల్స్ వస్తున్నాయి. వీటికి తోడు ఆమె అడ్రస్ వెతుక్కుంటూ వచ్చి మరీ తలుపులు కొడుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నారట. మొదట ఎందుకిలా జరుగుతుందో అర్థం కాని ఆమె.. ఆ తర్వాత అసలు విషయం తెలియడంతో వేధింపులు భరించలేక పోలీసులను ఆశ్రయించింది. ఇక చైనా అనుకూల మీడియా ఇంకో ముందుకొచ్చింది.. ఆమెకు వ్యతిరేక కథనాలను ప్రచారం చేస్తుంది.