ఐదో తరగతి విద్యార్థులకు కండోమ్స్.. కొత్త సెక్స్ ఎడ్యుకేషన్ పాలసీ.. మండిపడుతున్న తల్లిదండ్రులు..

First Published Jul 12, 2021, 2:09 PM IST

చికాగో డిపార్ట్ మెంట్ ఆఫ్ హెల్త్ సహకారంతో స్కూళ్లకు కండోమ్స్ ను సప్లై చేయనున్నారు. ఒకవేళ కండోమ్స్ అయిపోతే స్కూల్ ప్రిన్సిపాల్స్ డిపార్ట్ మెంట్ ఆఫ్ హెల్త్ కు సమాచారమిచ్చి తెప్పించుకోవాల్సి ఉంటుంది. 

అమెరికాలోని చికాగో పబ్లిక్ స్కూల్స్ కు చెందిన ఎడ్యుకేషన్ బోర్డు తీసుకున్న ఓ నిర్ణయం వివాదాస్పదంగా మారింది. ఈ విద్యాసంవత్సరం నుంచి ఐదో తరగతి, ఆపై తరగతుల విద్యార్థులకు స్కూళ్లలో ‘కండోమ్స్’ను అందుబాటులో ఉంచాలని బోర్డు నిర్ణయించింది.
undefined
ఈ మేరకు బోర్డు పరిధిలోని 600 స్కూళ్లకు ఆదేశాలు జారీ చేసింది. చికాగో డిపార్ట్ మెంట్ ఆఫ్ హెల్త్ సహకారంతో స్కూళ్లకు కండోమ్స్ ను సప్లై చేయనున్నారు. ఒకవేళ కండోమ్స్ అయిపోతే స్కూల్ ప్రిన్సిపాల్స్ డిపార్ట్ మెంట్ ఆఫ్ హెల్త్ కు సమాచారమిచ్చి తెప్పించుకోవాల్సి ఉంటుంది.
undefined
సెక్స్ ఎడ్యుకేషన్ భాగంగా.. చికాగో పబ్లిక్ స్కూల్స్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ గతేడాది డిసెంబర్ లోనే ఈ పాలసీని రూపొందించింది. సెక్స్ ఎడ్యుకేషన్‌లో భాగంగా ఈ పాలసీని తీసుకొస్తున్నట్లు తెలిపింది. దీని ప్రకారం ఎలిమెంటరీ స్కూళ్లలో 250 వరకు, హైస్కూళ్లలో వెయ్యి వరకు కండోమ్స్ ను ఎప్పుడూ అందుబాటులో ఉంచాలి. ఇవి పూర్తిగా ఉచితం.
undefined
విద్యార్థుల్లో లైంగిక వ్యాధులు, అవాంఛిత గర్భాలను నిరోధించేందుకే ఈ పాలసీని తీసుకొచ్చినట్లు సీపీఎస్ (చికాగో పబ్లిక్ స్కూల్స్) అధికారులు చెబుతున్నారు.
undefined
సీపీఎస్ డాక్టర్ ఏమన్నారంటే.. సీపీఎస్ డాక్టర్ కెన్నెత్ ఈ పాలసీపై మాట్లాడుతూ.. దీనిమీద కాస్త వివాదం రేగే అవకాశం ఉన్నప్పటికీ.. విద్యార్థుల ఆరోగ్య రీత్యా ఇది అవసరమని పేర్కొన్నారు.
undefined
సమాజం చాలా మార్పులకు గురైందన్నారు. విద్యార్థులకు కండోమ్స్ అందుబాటులో ఉంచకపోతే..వారికి సరైన జాగ్రత్తలు చెప్పకపోతే... వారికి చెడు జరిగే అవకాశం ఉందని ఉందన్నారు. ఆరోగ్యకర నిర్ణయాలు తీసుకునేందుకు కచ్చితమైన, స్పష్టమైన సమాచారాన్ని తెలుసుకునే హక్కు యువతకు ఉందన్నారు. తద్వారా వారితో పాటు ఇతరుల ఆరోగ్యాన్ని కాపాడగలుగుతారని పేర్కొన్నారు.
undefined
చికాగో పబ్లిక్ స్కూల్స్ బోర్డ్ రూపొందించిన సెక్స్ ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా విద్యార్థులకు ‘ఆరోగ్యకర సంబంధాలు-సమ్మతి, శరీర నిర్మాణ శాస్త్రం, శరీర ధర్మ శాస్త్రం, కౌమార యుక్త వయసులో శరీరంలో కలిగే మార్పులు, లైంగిక ధోరణులు, లైంగిక ఆరోగ్యం.. ’ తదితర అంశాలను విద్యార్థులకు బోధించనున్నారు.
undefined
ఒకవేళ ఎవరైనా తల్లిదండ్రులు దీనిమీద అభ్యంతరం ఉంటే లిఖితపూర్వకంగా బోర్డుకు లేదా స్కూల్ యాజమాన్యానికి ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. అయితే ఈ అంశం మీద తల్లిదండ్రులు మండిపడుతున్నారు.సెక్స్ ఎడ్యుకేషన్ లో భాగంగా ఐదో తరగతి విద్యార్థులకు కండోమ్స్ అందుబాటులో ఉంచాలన్న పాలసీని కొంతమంది తల్లిదండ్రులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఐదో తరగతి అంటే కేవలం 12 యేళ్ల వయసు ఉంటుందని, అప్పటికీ వారు ఇంకా చిన్న పిల్లలే అని చెబుతున్నారు.
undefined
పిల్లలకు కండోమ్స్ ఇవ్వడమేంటని, ఇది సరైన నిర్ణయం కాదని.. దీనిపై పునరాలోచన చేయాలని కోరుతున్నారు. ఈ వివాదం మీద చికాగో విమెన్ హెల్త్ సెంటర్ డైరెక్టర్ స్కౌట్ బ్రాట్ మాట్లాడుతూ.. నిజానికి ఈ పాలసీ ద్వారా నష్టాన్ని తగ్గించవచ్చునని పేర్కొన్నారు.
undefined
click me!