కుర్రాళ్ల దెబ్బకు కూలుతోన్న ప్రభుత్వం.. సోషల్ మీడియా బ్యాన్ అన్నందుకు ఇంతలానా.?

Published : Sep 09, 2025, 03:01 PM IST

నేపాల్ ప్ర‌భుత్వం తీసుకున్న ఓ నిర్ణ‌యం కార‌ణంగా ఏకంగా ప్ర‌భుత్వ‌మే ప‌డిపోయే ప‌రిస్థితి వ‌చ్చింది. సోష‌ల్ మీడియా నిషేధానికి వ్య‌తిరేకంగా రోడ్డెక్కిన కుర్రాలు నానా ర‌చ్చ చేస్తున్నారు. తాజాగా ఈ ప‌రిణామం మ‌రో కీల‌క మ‌లుపు తీసుకుంది. 

PREV
15
యువత పోరాటం

నేపాల్‌లో యువత ఇటీవల చేపట్టిన నిరసనలు భారీ స్థాయికి చేరుకున్నాయి. అవినీతి కేసులను బయటపెట్టేందుకు సోషల్ మీడియా ప్రధాన ఆయుధంగా మారింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మెటా, యూట్యూబ్, ఎక్స్ సహా 26 సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలను నిషేధించింది. ఈ నిర్ణయం యువతలో తీవ్ర ఆగ్రహం రేపింది. సుప్రీంకోర్టు ఆంక్షలు ఎత్తివేయాలని ఆదేశించినప్పటికీ ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు. దీంతో జెన్‌జడ్‌ యువత వీధుల్లోకి వచ్చి పెద్ద ఎత్తున ఆందోళనలు ప్రారంభించింది.

25
హింసాత్మక రూపం దాల్చిన ఆందోళనలు

ఖాట్మండూ వీధుల్లో ప్రారంభమైన నిరసనలు క్రమంగా హింసాత్మకంగా మారాయి. నిరసనకారులు ప్రధాని అధికారిక నివాసం, పార్లమెంట్‌ భవనం వద్దకు చేరుకుని ఆస్తులను ధ్వంసం చేశారు. ఫర్నీచర్‌ను నిప్పంటించి, భవనంపై దాడులు జరిపారు. ఈ ఉద్రిక్తతలో కనీసం 20 మంది ప్రాణాలు కోల్పోయారు. వందలాది మంది గాయపడ్డారు. పోలీసులు, సైన్యం అడ్డుకునే ప్రయత్నాలు చేసినా పరిస్థితిని అదుపు చేయలేకపోయారు.

35
ప్రధాని ఓలీ రాజీనామా నిర్ణయం

ఉద్రిక్త పరిస్థితుల్లో మంత్రుల వరుస రాజీనామాలు మొదలయ్యాయి. హోం మంత్రి రమేశ్ లేఖక్ అల్లర్లకు బాధ్యత వహిస్తూ పదవికి రాజీనామా చేశారు. చివరికి సైన్యం సూచనల మేరకు ప్రధాని కేపీ శర్మ ఓలీ తన పదవికి రాజీనామా చేసినట్లు సమాచారం. ఆయన త్వరలోనే దేశం విడిచి దుబాయ్‌కి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారని వర్గాలు చెబుతున్నాయి.

45
కీలక నేతల ఇళ్లపై దాడులు

ప్రధాని కేపీ ఓలీ నివాసంతో పాటు పలువురు కీలక నేతల ఇళ్లను నిరసనకారులు లక్ష్యంగా చేసుకున్నారు. అధ్యక్షుడు రామ్ చంద్ర పౌడెల్ అధికారిక నివాసం, మాజీ ప్రధానులు పుష్ప కమల్ దహల్ (ప్రచండ), షేర్ బహదూర్ డ్యూబాల ఇళ్లపై దాడులు జరిగాయి. అలాగే మంత్రులు పృథ్వీ సుబ్బ గురుంగ్, రమేశ్ లేఖక్, యూఎంఎల్ నేత మహేశ్ బాస్నేట్, కాంగ్రెస్ నేత గగన్ థాపా ఇళ్లు, కార్యాలయాలు దగ్ధమయ్యాయి. పార్టీల ప్రధాన కార్యాలయాలను కూడా దహనం చేశారు.

55
విస్తరిస్తున్న ఉద్యమం

ఈ నిరసనలు ఖాట్మండూతో మాత్రమే పరిమితం కాలేదు. ప్రధాని ఓలీ స్వస్థలమైన దమక్ సహా కోశీ ప్రావిన్స్‌లోని అనేక ప్రాంతాలకు వ్యాపించాయి. దాదాపు 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న పట్టణాల్లో కూడా యువత పెద్ద ఎత్తున పాల్గొంది. దేశంలో అవినీతి నిర్మూలన, సోషల్ మీడియా స్వేచ్ఛ, ప్రజాస్వామ్య రక్షణ కోసం ఈ ఉద్యమం కొనసాగుతుందని నిరసనకారులు ప్రకటిస్తున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories