Trump: ట్రంప్ కీల‌క నిర్ణ‌యం.. హైద‌రాబాద్‌, అమ‌రావ‌తి రియ‌ల్ ఎస్టేట్‌పై తీవ్ర ప్ర‌భావం?

Published : May 19, 2025, 04:01 PM IST

అమెరికా అధ్య‌క్షుడు తీసుకుంటున్న ఓ కీల‌క నిర్ణ‌యం హైద‌రాబాద్‌, అమ‌రావ‌తి రియ‌ల్ ఎస్టేట్‌పై తీవ్ర ప్ర‌భావం ప‌డ‌నుంది. ఇంత‌కీ ట్రంప్ తీసుకుంటున్న ఆ నిర్ణ‌యం ఏంటి.? మ‌న‌పై ఎలాంటి ప్ర‌భావం చూపనుంది? లాంటి వివ‌రాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

PREV
15
అమెరికా ఫ‌స్ట్ నినాదం:

అమెరికా అధ్య‌క్షుడిగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన నాటి నుంచి ట్రంప్ ఏదో ఒక సంచ‌ల‌నంతో వార్త‌ల్లో నిలుస్తూనే ఉన్నారు. సంచ‌లన నిర్ణ‌యాలు తీసుకుంటే ప్ర‌పంచానికి కునుకు లేకుండా చేస్తున్నారు. అమెరికా ఫ‌స్ట్ అనే నినాదంతో రెండో సారి గ‌ద్దెనెక్కిన ట్రంప్ ఆ దిశ‌గా ఎంత వ‌ర‌కు వీలైతే అంత వ‌ర‌కు ప్ర‌య‌త్నాలు చేస్తూనే ఉన్నారు. ఈ క్ర‌మంలోనే ట్రంప్ తీసుకుంటున్న ఓ నిర్ణ‌యం మ‌న దేశంపై, మ‌రీ ముఖ్యంగా తెలుగు ప్ర‌జ‌ల‌పై తీవ్ర ప్ర‌భావం ప‌డ‌నుంది.

అమెరికా ప్రాధాన్య‌త‌లే లక్ష్యంగా ముందుకు సాగుతోన్న ట్రంప్ మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకునే దిశ‌గా అడుగులు వేస్తున్నారు. రిమిటెన్స్‌పై ప‌న్నులు పెంచ‌నున్నారు. దీంతో ఎన్ఆర్ఐల‌పై ఇది తీవ్ర ప్ర‌భావం ప‌డ‌నుంది. దీంతో మ‌న దేశంలోని ప‌లు రంగాల‌పై ఇది స్ప‌ష్ట‌మైన ప్ర‌భావాన్ని చూపించ‌నుంది.

25
రిమిటెన్స్ అంటే ఏంటి.?

అమెరికాలో డ‌బ్బులు సంపాదించేవారు భార‌త్‌కు పంపించే డ‌బ్బును రిమిటెన్స్‌గా చెబుతుంటారు. ఎన్‌ఆర్‌ఐలు భారత్‌కు పంపే ప్రతి డాలర్‌పై 5% టాక్స్ వసూలు చేయబోతున్నారని వార్తలు వస్తున్నాయి. కొన్ని నివేదికల ప్రకారం, ఈ నిర్ణయం ఈ ఏడాది జూలై నుంచే అమలులోకి వచ్చే అవకాశం ఉంది.

2024లో ఎంత ఉందంటే.

2024లో భారతదేశానికి విదేశాల్లో నివసిస్తున్న భారతీయులు (NRIs) $129.4 బిలియన్ (సుమారు రూ. 10.7 లక్షల కోట్లు) పంపించారు. ఇది ఇప్పటివరకు గరిష్ట స్థాయిలోని రికార్డు. గత మూడు సంవత్సరాలుగా భారత్ వరుసగా $100 బిలియన్‌కు పైగా రిమిటెన్స్‌ను స్వీకరిస్తూ ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలుస్తోంది.

35
ప్రతి లక్షపై ₹5,000 అమెరికాకు?

ఈ కొత్త నిర్ణయం అమలైతే, ఎన్‌ఆర్‌ఐలు భారత్‌కు పంపే ప్రతి లక్ష రూపాయలపై రూ. 5,000ను అమెరికా ప్రభుత్వం టాక్స్ రూపంలో తీసుకుంటుంది. అంటే భారతీయ కుటుంబాలకు చేరాల్సిన మొత్తం పూర్తిగా అందకుండా ఉంటుందన్న మాట. దీంట్లో అమెరికా ప్ర‌భుత్వం ప‌న్నుల రూపంలో కొంత మొత్తాన్ని తీసుకుంటుంది.

45
రియ‌ల్ ఎస్టేట్‌పై తీవ్ర ప్ర‌భావం:

ఎన్ఐఆర్‌లు మెజారిటీ రియ‌ల్ ఎస్టేట్‌లోనే పెట్టుబ‌డులు పెడుతుంటారు. మొన్న‌టి వ‌ర‌కు హైద‌రాబాద్‌లో ఎక్కువ‌గా పెట్టుబ‌డులు పెట్టే వారు. ఇటీవ‌ల అమ‌రావ‌తిలో కూడా పెట్టుబ‌డులు పెడుతున్న వారి సంఖ్య క్ర‌మంగా పెరుగుతోంది. ఎన్ఆర్ఐలు ఎక్కువ‌గా మిడ్, హై-ఎండ్ ప్రాపర్టీల కొనుగోలు చేస్తుంటారు.

55
ఏం జ‌ర‌గ‌నుంది.?

ట్రంప్ నిర్ణ‌యం అమ‌ల్లోకి వ‌స్తే ఎన్ఆర్ఐలు భార‌త్‌కు డ‌బ్బు పంపించడాన్ని త‌గ్గించే అవ‌కాశం ఉంటుంది. అక్క‌డే ఇన్వెస్ట్మెంట్ చేయ‌డం లేదా దాచుకునే అవ‌కాశాలు పెరుగుతాయి. ట్యాక్స్ చెల్లించేకంటే దాచుకోవ‌డం లేదా ఏదైనా ఖ‌ర్చు చేయ‌డం మేల‌నే అభిప్రాయం పెరుగుతుంది. దీంతో ఇది అమెరిక‌న్ ఎకాన‌మికీ దోహ‌ద‌ప‌డుతుంద‌ని ట్రంప్ భావిస్తుండొచ్చు.

ఇక ఈ నిర్ణ‌యంతో ఇండియాలో ఎన్ఆర్ఐలు కొనుగోళ్లు త‌గ్గుతాయి. ఫ్లాట్ డిమాండ్ తగ్గి ధరలపై ప్రభావం పడే అవకాశముంది. భారీ ఇన్‌వెస్టర్లు ప్రాజెక్టులకు వెనుకడుగు వేసే ప్రమాదం కూడా ఉంది. అలాగే ఇండియాలో నివసించే వారి కుటుంబాలకు కూడా డబ్బు తక్కువగా వస్తుంది. చదువు, వైద్యం, ప్రాపర్టీ కొనుగోలు వంటి అవసరాలకు అనుకున్న స్థాయిలో సాయం అందదు.

Read more Photos on
click me!

Recommended Stories