Zinc Rich Foods: జింక్ లోపం ఉన్నవారు తీసుకోవాల్సిన సూపర్ ఫుడ్స్ ఇవే!

Published : Jul 28, 2025, 09:36 AM IST

Zinc Rich Foods: స్త్రీల ఆరోగ్యానికి జింక్ చాలా కీలకం. ఇది హార్మోన్ల సమతుల్యత, ఇమ్యూనిటీ,  మృదువైన చర్మం కోసం అవసరం. జింక్ లోపం వల్ల చర్మం పొడిబారటం, జుట్టు ఊడటం, మానసిక అలసట వంటి సమస్యలు వస్తాయి. స్త్రీల ఆరోగ్యానికి మేలు చేసే జింక్ రిచ్ ఫుడ్స్ ఇవే..

PREV
18
నట్స్

జింక్ పుష్కలంగా లభించే నట్స్‌ను డైట్‌లో చేర్చుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇది మహిళల హార్మోనల్ బ్యాలెన్స్, చర్మ ఆరోగ్యం, ఫెర్టిలిటీకి మేలు చేస్తుంది. బాదం, జీడిపప్పు, వేరుసెనగ, పంప్కిన్ సీడ్స్ వంటివి తినడం మంచిది.

28
గుమ్మడికాయ గింజలు

జింక్‌ పుష్కలంగా లభించే గుమ్మడికాయ గింజలను డైట్ లో చేర్చుకుంటే.. ఇమ్యూనిటీ పవర్ బలోపేతం అవుతుంది. కాబట్టి వీటిని స్నాక్స్ రూపంలో లేదా సాలడ్‌లలో తీసుకోండి. 

38
పప్పు ధాన్యాలు

శనగలు, పప్పులు, బీన్స్ లలో శరీరానికి అవసరమైన జింక్ పుష్కలంగా లభిస్తుంది. ఇవి హార్మోన్ల సమతుల్యత, ఇమ్యూనిటీ బలపర్చడంలో సహాయపడతాయి. కాబట్టి వీటిని నిత్యాహారంలో భాగంగా చేర్చుకోవడం మంచిది. 

48
గుడ్డు

ఒక  గుడ్డులో సుమారుగా 5% జింక్ ఉంటుంది. ఇది హార్మోన్ల సమతుల్యత, చర్మ ఆరోగ్యం, రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. కాబట్టి ప్రతిరోజూ ఒక గుడ్డు తినడం ఆరోగ్యానికి మంచిది. 

58
పాల ఉత్పత్తులు

జింక్ అధికంగా ఉండే పాల ఉత్పత్తులను (పాలు, పెరుగు, చీజ్) డైట్‌లో చేర్చుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. వీటిలోని జింక్, కాల్షియం వంటి పోషకాల వల్ల ఎముకల ఆరోగ్యం మెరుగుపడుతుంది, శరీరం దృఢంగా ఉంటుంది.

68
రెడ్ మీట్

రెడ్ మీట్ లో శరీరానికి అవసరమైన జింక్ పుష్కలంగా లభిస్తుంది. ఇది ఇమ్యూనిటీ, రక్త హిమోగ్లోబిన్ స్థాయిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అయితే.. రెడ్ మీట్ ను మితంగా తినడం ఆరోగ్యానికి మంచిది.

78
చికెన్

చికెన్‌లో కూడా శరీరానికి అవసరమైన జింక్ లభిస్తుంది. ఇది ఇమ్యూనిటీని పెంపొందించడంలో, కండరాల అభివృద్ధిలో సహాయపడుతుంది. కాబట్టి చికెన్‌ను మితంగా తీసుకోవడం ఆరోగ్యానికి లాభదాయకం.

88
పొద్దుతిరుగుడు గింజలు

పొద్దుతిరుగుడు గింజల్లో జింక్ పుష్కలంగా ఉంటుంది. ఇవి ఇమ్యూనిటీని బలపరచడంలో, చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. కాబట్టి వీటిని స్నాక్స్‌ రూపంలో లేదా సాలడ్‌లలో చేర్చి తినవచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories